సంస్కృతిలో భాగం రంగవళ్లులు
● మీరా నాగరంజన్ ● సెల్ఫీ కోలం పోటీల విజేతలకు బహుమతులు
సాక్షి,చైన్నె: తమిళ సంస్కృతి, సంప్రదాయాల్లో రంగవళ్లులు భాగమని కల్యాణమయి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మీరా నాగరంజన్ అభిప్రాయపడ్డారు. ఈమేరకు లెదర్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్‌లైన్ సెల్ఫీ కోలం కాంటెస్ట్ –2025 పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి శుక్రవారం బహుమతులు ప్రదానం చేశారు. చైన్నెలోని పురసైవాక్కంలోని లెదర్స్ స్టోర్‌లో ఏర్పాటైన కార్యక్రమానికి మీరా నాగరంజన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. శ్రీ లెదర్స్ భాగస్వాములు సుశాంతో డే, పూజారిణి డే అధ్యక్షత వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. పూజారిణి డే మాట్లాడుతూ తమిళ సంస్కృతి, కళల పట్ల గర్వాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రతి ఏడాది ఆన్‌లైన్ సెల్ఫీ కోలం కాంటెస్ట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పోటీలు మార్గశిర మాసంలో గత ఏడాది 15 డిసెంబర్ నుంచి 2025 జనవరి 20కి నిర్వహించామని, ఇందులో తమిళనాడు వ్యాప్తంగా 2వేల కంటే ఎక్కువ ఎంట్రీలతో అద్భుతమైన స్పందనను లభించిందని పేర్కొ న్నారు. అద్భుతమైన రంగవళ్లులు వేసిన వారిని విజేతలుగా ఎంపిక చేసి బహుమతులు అందించామని ఈసందర్భంగా తెలిపారు. ముందుగా మీరా నాగరంజన్ మాట్లాడుతూ తమిళ సంస్కృతి, సంప్రదాయలను పరిరక్షిస్తున్న శ్రీ లెదర్స్ నిర్వాహకులకు ముందుగా అభినందనలు తెలిపారు. రంగవళ్లులు వేయడం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఆరోగ్యం లభిస్తుందని అన్నారు. రంగవళ్లులు తమిళ సంస్కృతిలో ఒక భాగమని ఆమె అభిప్రాయపడ్డారు .
Comments
Please login to add a commentAdd a comment