
చిరుధాన్యాల ప్రాసెసింగ్, మార్కెటింగ్ రంగంలోకి అడుగుపెట్టదలచిన ఔత్సాహికులు, స్టార్టప్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ(ఐఐఎంఆర్) ఈ నెల 23న హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో సంస్థ కార్యాలయంలో శిక్షణ ఇవ్వనుంది. చిరుధాన్యాల ప్రాసెసింగ్ సదుపాయాలు, టెక్నాలజీ లైసెన్సులు పొందే మార్గాలు, ఇంక్యుబేషన్ సేవలపై ఈ శిక్షణలో అవగాహన కలిగిస్తారు. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు.. 94904 76098, 04024599379 / 29885838 www.nutrihub-tbi-iimr.org
గోవాలో సేంద్రియ వ్యవసాయ వర్సిటీ ఏర్పాటుకు సన్నాహాలు
సేంద్రియ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి గోవా ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఏడాది లోగా యూనివర్సిటీని ప్రారంభిస్తామని గోవా ఉపముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి చంద్రకాంత్ కవలేకర్ ప్రకటించారు. అత్యాధునిక సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అందుబాటులోకి తేవడం, రాష్ట్రానికి అనువైన సేంద్రియ పంటలపై పరిశోధనలు చేయడానికి అనుగుణంగా యూనివర్సిటీని తీర్చిదిద్దుతామన్నారు. సేంద్రియ పంటల ఉత్పాదకత పెంపుదల, నాణ్యత నియంత్రణ, పరిశోధన, అభివృద్ధి సంబంధ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సేంద్రియ వర్సిటీ స్థానికులకు అవకాశాలు కల్పిస్తుందన్నారు. గుజరాత్‌లో ఆనంద్ యూనివర్సిటీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన డా. మదన్‌గోపాల్ వర్షణిని సేంద్రియ యూనివర్సిటీ చీఫ్ స్ట్రాటజిస్ట్‌గా నియమించారు.
జల సంరక్షణ, బోరు రీచార్జ్ పద్ధతులపై శిక్షణ
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బోర్లను రీచార్జ్ చేసుకునే పద్ధతి సహా వివిధ జల సంరక్షణ పద్ధతులపై డిసెంబర్ 16న స్వచ్ఛంద కార్యకర్తలు, విద్యార్థులు, రైతు బృందాలు, వ్యక్తులకు సికింద్రాబాద్ తార్నాకకు చెందిన వాటర్ అండ్ లైవ్‌లీహుడ్స్ ఫౌండేషన్ హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని సురన ఆడిటోరియంలో శిక్షణ ఇవ్వనుంది. భూగర్భ జల సంరక్షణలో అపారమైన అనుభవం కలిగిన జలవనరుల ఇంజినీరు ఆర్. వి. రామమోహన్ శిక్షణ ఇస్తారు. జలసంరక్షణలో అనుభవాలను పంచుకునే ఆసక్తి గల వారు కూడా సంప్రదింవచ్చు. ఈ నెల 30లోగా రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 1,500.
ఇతర వివరాలకు.. 040–27014467 email: wlfoundation@outlook.com
20న కుంచనపల్లిలో కూరగాయల రైతులకు క్షేత్రస్థాయి శిక్షణ
సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయలు సాగు చేయదలచిన, చేసే ఆలోచన ఉన్న రైతులకు ఈ నెల 20(బుధవారం)న ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని సీనియర్ రైతు ఎ. సాంబిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం శిక్షణ ఇవ్వనుంది. వివిధ జిల్లాల్లో వినూత్న పద్ధతులను అవలంబిస్తూ సేంద్రియ కూరగాయలు సాగు చేసే రైతులు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. జగదీష్ – 78934 56163
24న సేంద్రియ దానిమ్మ, జామ, అంజూర సాగుపై శిక్షణ
రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడులో ఈ నెల 24(ఆదివారం)న సేంద్రియ వ్యవసాయ విధానంలో దానిమ్మ, తైవాన్ జామ, అంజూర సాగు విధానంపై, జీవన ఎరువుల వినియోగంపై రైతులు హనుమాన్ కిషోర్ (ప్రకాశం), శ్రీనివాసరావు(ప.గో.) శిక్షణ ఇస్తారు. ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఇస్తారు. ముందుగా పేర్ల నమోదుకు సంప్రదించాల్సిన నంబర్లు.. 97053 83666, 0863–2286255
26న సిరిధాన్యాల సాగు, వాననీటి సంరక్షణపై సదస్సు
తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం(ట్రీ), మిషన్ జలనిధి, వాటర్ మేనేజ్‌మెంట్ ఫోరం (డబ్ల్యూ.ఎం.ఎఫ్.) ఆధ్వర్యంలో సిరిధాన్యాల సాగు, వాననీటి సంరక్షణపై ఈ నెల 26(మంగళవారం)న ఉ. 9 గం. నుంచి సిద్ధిపేట జిల్లా జగ్దేవ్‌పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో రైతు సదస్సు జరగనుంది. ‘ట్రీ’ అధ్యక్షులు సంగెం చంద్రమౌళి, డబ్ల్యూ.ఎం.ఎఫ్. చైర్మన్ మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి, మిషన్ జలనిధి చైర్మన్ జి.దామోదర్‌రెడ్డి, గజ్వేల్ డెవలప్‌మెంట్ అథారిటీ స్పెషల్ ఆఫీసర్ ముత్యంరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. సాక్షి సాగుబడి ఇన్‌చార్జ్ పంతంగి రాంబాబు సిరిధాన్యాల సాగుపై అవగాహన కల్పిస్తారు. వివరాలకు: కృష్ణమోహన్ – 99490 55225
19న తాడూర్‌లో మామిడి సాగుపై క్షేత్రస్థాయి శిక్షణ
గ్రామభారతి సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మామిడి సాగులో వివిధ దశల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన మెలకువలపై రైతులకు ఈ నెల 19(మంగళవారం) నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం తాడూర్‌లోని డా. మధుసూదన్‌రెడ్డి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఉ. 9 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఇస్తారు. పలువురు మామిడి రైతులు తమ అనుభవాలను పంచుకుంటారు. మార్కెటింగ్ విధానం, సేంద్రియ ధృవీకరణ, మామిడి రైతుల సంఘం ఏర్పాటుపై చర్చ జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. డా. మధుసూదన్‌రెడ్డి – 77027 71282, టి. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి – 94924 23875, బాలస్వామి – 97057 34202.