పారిజాతగిరివాసునికి వెండి బిందె సమర్పణ
పారిజాతగిరివాసునికి వెండి బిందె సమర్పణ
Published Wed, Nov 2 2016 10:47 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM
జంగారెడ్డిగూడెం : పారిజాతగిరి శ్రీవెంకటేశ్వరస్వామి వారి నిత్య కైంకర్యాల్లో భాగంగా నిర్వహించే అభిషేక కార్యక్రమానికి పట్టణానికి చెందిన ఇనగంటి శ్రీనివాసరావు వెండి బిందెను సమర్పించారు. సుమారు 900 గ్రాముల బరువు ఉండే ఈ వెండి బిందెను భార్య భూలక్ష్మిదేవితో కలిసి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రాలతో శ్రీనివాసరావు దంపతులను ఆశీర్వదించి, స్వామి వారి శేషవస్త్రాలు బహూకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బిక్కిన సత్యనారాయణ, ధర్మకర్తలు పొన్నాడ సత్యనారాయణ, తోట రామకృష్ణ, ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement