ఎన్నాళ్లకెన్నాళ్లకు.. | ennallakennallaku | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లకెన్నాళ్లకు..

Published Thu, Jun 8 2017 12:39 AM | Last Updated on Tue, Sep 5 2017 1:03 PM

ఎన్నాళ్లకెన్నాళ్లకు..

ఎన్నాళ్లకెన్నాళ్లకు..

తాడేపల్లిగూడెం : ఆకాశంలో ఉదయం నుంచీ  కారుమబ్బులు.. బుధవారం రాత్రి ఏడుగంటల సమయంలో ఒక్కసారిగా కురిసిన వాన, హోరుగాలులకు ప్రజలు పులకించిపోయారు. ఎన్నాళ్లకు.. ఎన్నాళ్లకంటూ ఆనందం వ్యక్తం చేశారు. చల్లగాలుల తాకిడిని ఆస్వాదించారు. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. రోహిణి కార్తె చివరి దశలో కురిసిన భారీవర్షానికి భూమి చల్లబడింది. జిల్లాలో పలుచోట్ల వర్షం కురిసింది. భీమవరంలో సాయంత్రం ప్రారంభమైన వాన రెండు గంటల పాటు ఏకధాటిన కురిసింది. జంగారెడ్డిగూడెంలో పది నిమిషాలపాటు చిరుగాలితో కూడిన జల్లులు పడ్డాయి. తాడేపల్లిగూడెంలో రెండు గంటల పాటు వాన పడుతూనే ఉంది. కొవ్వూరు, పోలవరం, గోపాలపురం నియోజకవర్గంలోని పలుచోట్ల, ఏలూరు నగరంలో వర్షం పడింది. ఉక్కపోతకు ఉపశమనం కలుగ చేసింది.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement