మోటార్ సైక్లిస్ట్ దుర్మరణం
జంగారెడ్డిగూడెం (చింతలపూడి ): స్థానిక బుట్టాయగూడెం బైపాస్‌రోడ్డు జంక్షన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. బుట్టాయగూడానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి బచ్చు వెంకట సూర్యనారాయణ మోటార్‌సైకిల్‌పై జంగారెడ్డిగూడెం వచ్చి తిరిగి వెళుతుండగా బుట్టాయగూడెం జంక్షన్ లో తెలంగాణకు చెందిన ట్రక్ ఆటో ఢీకొట్టింది. దీంతో ఆయన తలకు తీవ్రగాయాలయ్యా యి. స్థానికులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. మృతదేహానికి జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుని భార్య బండ్రెడ్డి లక్షీ్మకుమారి బుట్టాయగూడెంలోని బూసరాజుపల్లి పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎం.కేశవరావు తెలిపారు.