bipass road
-
బాలీవుడ్ పిలుస్తోంది!
సినిమా: దక్షిణాది కథానాయికలు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం అంత సులభమైన విషయం కాదు. ఇక్కడ ఎంతో క్రేజ్ తెచ్చుకుంటేగానీ అది సాధ్యం కాదు. అలాంటిదిప్పుడు నటి భావనారావుకు అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. కన్నడ నటి భావనారావు. మాతృభాషలో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న ఈ బ్యూటీ తమిళంలోనూ పరిచయమైంది. ఇక్కడ కొలకొలయా ముందిరిక్కా, విణ్మీన్గళ్, వనయుద్ధం చిత్రాల్లో నటించిన ఈ భామ కన్నడంలో 2017లో నటించిన సత్యహరిచంద్ర చిత్రం ఆమెకు అభినందనలు, అవార్డులను తెచ్చిపె ట్టింది. ప్రస్తుతం శివరాజ్‌కుమార్, సుధీప్, ఎమీజాక్సన్ నటిస్తున్న విలన్ అనే చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తోంది. ఇలా కన్నడం, తమిళం భాషల్లో నటిస్తున్న భావనారావ్ను బాలీవుడ్ పిలిచింది. హిందీలో నీల్ నితిన్ ముఖేశ్‌కు జంటగా బైపాస్ రోడ్డు అనే చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. బాలీవుడ్ ఎంట్రీ గురించి భావనారావ్ తెలుపుతూ తాను కన్నడ చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ, హిందీ, తెలుగు, ఇతర భాషా చిత్రాల్లోనూ నటించాలని కోరుకుంటున్నట్టు చెప్పింది. అలా ఇప్పుడు బాలీవుడ్ దర్శకుడు నమన్ నితీశ్ దర్శకత్వం వహిస్తున్న బైపాస్ రోడ్డు చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని చెప్పింది. ఈ చిత్రం ఊహించని మలుపులతో సస్పెన్స్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని తెలిపింది. దర్శకుడు కథ చెప్పగానే అందులో తన పాత్ర చాలా నచ్చిందని చెప్పింది. ఈ చిత్రంలో చాలా బలమైన పాత్ర అని, నెగెటివ్ టచ్ ఉన్న పాత్ర కావడంతో సవాల్‌గా తీసుకుని నటిస్తున్నట్లు చెప్పింది. నటిగా తనకు నూతన సంవత్సరం చాలా ఆనందంగా ప్రారంభమైందని చెప్పింది. తొలిసారిగా బాలీవుడ్‌కి ప్రవేశించడం చాలా సంతోషంగా ఉందని అంది. హిందీలోనూ మంచి నటిగా రాణిస్తాననే నమ్మకం తనకుందని భావనారావ్ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. స్వతహాగా భరతనాట్య కళాకారిణి అయిన భావనారావ్ నటనలోనూ శిక్షణ పొందడంతో బాలీవుడ్‌లోనూ రాణిస్తుందనే నమ్మకాన్ని ఆమె అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. -
నూతన బైపాస్‌లో డేంజర్ బెల్స్
ఒంగోలు క్రైం: ఒంగోలు నగరానికి తూర్పు వైపున నిర్మించిన నూతన బైపాస్కు ఇరువైపులా ఉన్న మలుపు కూడళ్లు ప్రాణసంకటంగా మారాయి. నూతన బైపాస్ దక్షిణం వైపు, ఉత్తరం వైపు అప్రోచ్ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నందున వాహనదారులు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా, అసౌకర్యంగా మారింది. దీంతో అటు ఉత్తరం వైపు, ఇటు దక్షిణం వైపు తరచూ ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇంత జరుగుతున్నా జాతీయ రహదారి అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేస్తుండటంతో వాహనదారులు ఇక్కట్ల పాలవుతున్నారు. నూతన బైపాస్ కూడళ్లలో, మలుపుల వద్ద ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకపోవటంతో కార్లు, ద్విచక్ర వాహనాలు రోడ్డుపై ఉంచిన సిమెంట్ దిమ్మెలను ఢీకొంటున్నాయి. ఇటీవలి కాలంలో దక్షిణ బైపాస్‌లో ఐదు ప్రమాదాలు సంభవించాయి. ఇక ఉత్తర బైపాస్‌లో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇప్పటికైనా రోడ్డు మార్జిన్లలో ప్రమాద సూచికలు, రేడియం స్లిక్కర్లు ఏర్పాటు చేస్తారో లేదో వేచి చూడాల్సిందే. -
మోటార్ సైక్లిస్ట్ దుర్మరణం
జంగారెడ్డిగూడెం (చింతలపూడి ): స్థానిక బుట్టాయగూడెం బైపాస్‌రోడ్డు జంక్షన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. బుట్టాయగూడానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి బచ్చు వెంకట సూర్యనారాయణ మోటార్‌సైకిల్‌పై జంగారెడ్డిగూడెం వచ్చి తిరిగి వెళుతుండగా బుట్టాయగూడెం జంక్షన్ లో తెలంగాణకు చెందిన ట్రక్ ఆటో ఢీకొట్టింది. దీంతో ఆయన తలకు తీవ్రగాయాలయ్యా యి. స్థానికులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. మృతదేహానికి జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుని భార్య బండ్రెడ్డి లక్షీ్మకుమారి బుట్టాయగూడెంలోని బూసరాజుపల్లి పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎం.కేశవరావు తెలిపారు.