మండల పరిషత్‌లో అగ్నిప్రమాదం | fire accident in mandal pariseth | Sakshi
Sakshi News home page

మండల పరిషత్‌లో అగ్నిప్రమాదం

Published Tue, Aug 9 2016 9:00 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

మండల పరిషత్‌లో అగ్నిప్రమాదం

మండల పరిషత్‌లో అగ్నిప్రమాదం

జంగారెడ్డిగూడెం రూరల్‌ : మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం అర్ధరాత్రి  అగ్నిప్రమాదం జరిగింది. ఒక గదిలో భద్రపరిచిన రికార్డులు, బీరువా, చెక్క పెట్టెలు పాత కంప్యూటర్‌ కాలిబూడిదయ్యాయి. ప్రమాదం జరిగిన గదిలోనే గ్యాస్‌బండ కూడా ఉంది. అదృష్టవశాత్తూ అది పేలలేదు. పేలి ఉంటే భారీ ప్రమాదం జరిగేదని అధికారులు చెబుతున్నారు.  మంటలు చెలరేగుతున్న సమయంలో గుర్తించిన నైట్‌వాచ్‌మన్‌ మంగరాజు అధికారులకు సమాచారం ఇచ్చారు. జంగారెడ్డిగూడెం అగ్నిమాపక వాహనం అందుబాటులో లేకపోవడంతో చింతలపూడి అగ్నిమాపక వాహనానికి సమాచారం ఇచ్చారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. త్రుటిలో ప్రమాదం తప్పింది. కార్యాలయం ఎదుట వేసవిలో చలివేంద్రం కోసం ఏర్పాటు చేసిన తాటాకు పాక నుంచి మంటలు చెలరేగి అనంతరం కార్యాలయంలో లోపలకు విస్తరించి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. రాత్రి ఒంటి గంటసమయంలో ప్రమాదం జరిగిందని, పాత రికార్డులు కాలిబూడిదయ్యాయని ఎంపీడీవో శ్రీదేవి తెలిపారు. కార్యాలయంలో విద్యుత్‌ సరఫరా కూడా నిలిచిపోయింది. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరిస్తే తప్ప  కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లు పనిచేస్తున్నాయా లేదా అన్న విషయాలు తెలుస్తాయని, అప్పుడే నష్టం ఎంత వాటిల్లిందనేది స్పష్టత వస్తుందని సమాచారం. ఈ ప్రమాదం విద్యుత్‌ షార్టుసర్కూ్కట్‌ వల్లగానీ, లేక  కేర్‌లెస్‌స్మోకింగ్‌ వల్ల చలివేంద్ర షెడ్డుకు నిప్పంటుకుండడం వల్లగానీ జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయమంతా నల్లగా పొగబారిపోయింది. 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement