నకిలీ కానిస్టేబుల్ అరెస్ట్
నకిలీ కానిస్టేబుల్ అరెస్ట్
Published Fri, Jan 20 2017 12:32 AM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM
జంగారెడ్డిగూడెం : కానిస్టేబుల్‌నని చెబుతూ బంగారు వస్తువులు లాక్కుపోయే ఓ వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఎస్సై ఎం.కేశవరావు కథనం ప్రకారం.. బుట్టాయగూడెం మండలం దొరమామిడికి చెందిన దంగేటి నాగదుర్గారావు కొంతకాలంగా జంగారెడ్డిగూడెంలో ఉంటున్నాడు. అతను డిసెంబర్ 7న, ఈనెల 16న గోకుల తిరుమల పారిజాతగిరికి వచ్చిన ఇద్దరు విద్యార్థులకు కానిస్టేబుల్‌నని చెప్పి బంగారు వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలని సూచించాడు. అతని సూచన మేరకు వస్తువులు చేతితో పట్టుకున్న విద్యార్థుల నుంచి వాటిని లాక్కుని పరారయ్యాడు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం అతనిని అరెస్ట్ చేశారు. దుర్గారావు వద్ద నుంచి చెవిదిద్దుల జత స్వాధీనం చేసుకున్నారు. అలాగే అతను ముత్తూట్ ఫైనాన్స్ లో కుదవపెట్టిన బంగారు ఉంగరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. తాపీ పనిచేస్తూ జీవించే దుర్గారావుకు ఇద్దరు భార్యలు. రెండు కుటుంబాలను పోషించలేకే అతను చోరీలకు పాల్పడుతున్నట్టు ఎస్సై కేశవరావు తెలిపారు.
∙
Advertisement