హిందూ సాంప్రదాయంలో అనేక ఆచారాలను పాటిస్తారన్న సంగతి తెలిసిందే. ప్రతిరోజుకు ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది. గురువారం శ్రీమహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజని చెబుతుంటారు. అందుకే గురువారం దేవ గురువు బృహస్పతి, విష్ణుదేవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు.
ఆయన అనుగ్రహం పొందాలంటే ఎంతో నిష్టగా పూజాక్రతువులను ఆచరించాల్సి ఉంటుంది. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం నాడు కొన్ని పనులు చేయడాన్ని నిషిద్దంగా భావిస్తారు. మరి గురువారం నాడు చేయాల్సిన, చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం.
గురువారం ఆ రంగు శుభసూచికం
- గురువారం శ్రీ మహావిష్ణువును పూజించడం, ఉపవాసం చేయడం వల్ల శుభ ఫలితాలు సిద్ధిస్తాయట.
- పెళ్లి ఆలస్యం అవుతున్నా, వివాహంలో సమస్యలున్నా గురువారం రోజున ఉపవాసం చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు. ఇలా 11 వారాలు ఉపవాసాలు చేస్తే చాలా మంచిదట.
- గురువారం నాడు అరటిపండ్లను దానం చేసినా, పసుపు రంగు బట్టలు వేసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయట.
- గురువారం అరటి చెట్లకు పూజించడం వల్ల సత్ఫలితాలు సిద్ధిస్తాయట.
గురువారం నాడు చేయకూడని పనులు
♦ గురువారం బృహస్పతికి అత్యంత ప్రీతికరమైన రోజు. బృహస్పతి ఆధిపత్యం వహించే గురువారం నాడు మహిళలు తలస్నానం చేయకూడదట. మహిళల జాతకంలో బృహస్పతి భర్త కారకం. అవుతుందట. అందుకే తలంటు పోసుకోవడం వల్ల కుజుడు బలహీనంగా మారుతాడని అంటారు. ఈ నెగిటివ్ ఎనర్జీ ముఖ్యంగా భర్త, పిల్లలపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని అంటారు. ఫలితంగా ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కొంటారని విశ్వాసం.
♦ గురువారం శ్రీ మహా విష్ణువుకు ఇష్టమైన రోజు. ఆరోజు జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం వంటివి చేస్తే ఆయనకు కోపానికి కారణమవుతారని పండితులు విశ్వసిస్తారు. ఫలితంగా డబ్బుకు కొరత ఏర్పడుతుందని అంటారు.
♦ గురువారం నాడు బట్టలు ఉతకడం, ఇంట్లో బూజు దులపడం వంటివి చేస్తే విష్ణుమూర్తికి కోపం వస్తుందట.
♦ గురువారం నాడు అద్దాలు, కత్తెరలు వంటి పదునైన వస్తువులకు కొనుగోలు చేస్తే అరిష్టమని పండితులు చెబుతారు.
♦ గురువారం నాడు డబ్బు ఇవ్వడం లేదా రుణం తీసుకోవడం లాంటివి చేయకూడదట ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనై సంపద కొలువ ఉండదని చెబుతారు.
గమనిక: పైన పేర్కొన్న అంశాలు విశ్వాసాలకు, ఆచారాలకు సంబంధించినవి. వీటికి సైంటిఫిక్ ఎవిడెన్స్, కశ్చితమైన ఆధారాలు లేవు.
Comments
Please login to add a commentAdd a comment