కృష్ణాడెల్టాకు 100 టీఎంసీల నీరందిస్తాం
కృష్ణాడెల్టాకు 100 టీఎంసీల నీరందిస్తాం
Published Thu, Jun 22 2017 10:00 PM | Last Updated on Tue, Sep 5 2017 2:14 PM
జానంపేట (పెదవేగి రూరల్) : పట్టిసీమ నుంచి కృష్ణాడెల్టాకు 100 టీఎంసీల నీరు సరఫరా చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తెలిపారు. గురువారం పెదవేగి మండలం జానంపేట ఆక్విడెక్ట్ వద్ద పట్టిసీమ నుంచి వస్తున్న గోదావరి పరవళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణాడెల్టాలో ఈ ఏడాది 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. పట్టిసీమ ద్వారా 2015లో 80 టీఎంసీలు, 2016లో 60 టీఎంసీల నీరిచ్చి కృష్టాడెల్టాలోని పంటలను రక్షించామని చెప్పారు. పట్టిసీమ పూర్తైన రెండేళ్లలోనే రూ.8 వేల కోట్ల విలువైన పంటను రైతులు సాగు చేశారని, ఎకరానికి 45 నుంచి 50 బస్తాల పంట దిగుబడి సాధించారని చెప్పారు. పట్టిసీమ నుంచి ప్రస్తుతం విడుదల చేసిన 3,500 క్యూసెక్యుల నీరు కృష్ణాజిల్లాలో ప్రవేశించిందన్నారు. ఈ ఏడాది తొలిసారిగా గోదావరి జలాలు రావడంతో కృష్ణాడెల్టా రైతులు హర్షం వ్యక్తం చేస్తూ సార్వాసాగుకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు.
Advertisement