వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం 8గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.
–రోడ్డు మార్గాన నెల్లూరుకు పయనం
– యువభేరికి విపక్ష నేత హాజరు
తిరుపతి మంగళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం 8గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి బుధవారం ఈమేరకు ఒకప్రకటనలో తెలిపారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన నెల్లూరులో రాష్ట్ర ప్రత్యేక హోదాపై జరిగే యువభేరి కార్యక్రమానికి బయలుదేరి వెళతారన్నారు. అనంతరం సాయంత్రం 5గంటలకు తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాదుకు వెళతారన్నారు. జననేతకు విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ సంస్థలు, విద్యార్థి సంఘాలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.