చిన్నమండెం(రాయచోటి రూరల్): చిన్నమండెం మండలం పడమటికోన గ్రామంలో పిచ్చి కుక్కలు రెండు రోజులుగా స్వైర విహారం చేస్తున్నాయి. రెండు కుక్కల దాడిలో ఏడుగురు గాయపడ్డారు. అందులో గురువారం రాత్రి నాగూరివాండ్లపల్లెకు చెందిన పాపులమ్మ, లక్ష్మీదేవి, సుగుణమ్మ.. ఆశా వర్కర్ యశోదమ్మ సాయంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. అక్కడ చికిత్స చేయించుకుని, తిరిగి స్వగ్రామానికి వెళ్లారు. అంతకు ముందు రెండు పిచ్చి కుక్కలు గొర్రెలు, గేదెలతోపాటు పాపన్న, చిన్నక్క, సాయికుమార్ (4 ఏళ్ల బాలుడు), సమీర్‌ను గాయపరిచాయి. దీంతో గ్రామస్తులంతా కలిసి పిచ్చికుక్కలను చంపేశారు.