‘భూభ్రమణ కాంక్ష’ పుస్తకావిష్కరణ
‘భూభ్రమణ కాంక్ష’ పుస్తకావిష్కరణ
Published Thu, Jan 12 2017 10:08 PM | Last Updated on Tue, Sep 5 2017 1:06 AM
పాలకొల్లు సెంట్రల్ : మీరు ఆరోగ్యంగా ఉంటారు.. ప్రతి రోజూ వాకింగ్ చేయండి అంటే చాలామంది బద్ధకిస్తున్నారు. అటువంటిది భారతీయ ఔన్నత్యాన్ని ఖండాంతరాలకు వ్యాపింపజేస్తూ పాదయాత్ర చేయడం అభినందనీయమని స్వచ్ఛభారత్ రాష్ట్ర కన్వీనర్ డా.బాబ్జి అన్నారు. గురువారం స్థానిక ముచ్చర్ల శ్రీరామ్ అతిథిగృహంలో రచయిత, ఆంధ్రాయూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం.ఆదినారాయణ ’భూభ్రమణ కాంక్ష’ పుస్తకావిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబ్జి మాట్లాడుతూ దేశం విశిష్టతను తెలియపర్చడానికి ప్రపంచంలో 14 దేశాల్లో 35 వేల కిలోమీటర్లు నడవడం సామాన్య విషయం కాదన్నారు. ప్రొఫెసర్ ఆదినారాయణ మాట్లాడుతూ అన్నీ తెలుçసు అనుకునేకన్నా అనుభవించడం ద్వారా నిజమైన వాస్తవాలను తెలుసుకోగలమన్నారు. పాదయాత్రలో అనేక విషయాలను తెలుసుకుని పుస్తక రూపంలో అందరికీ పరిచయం చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్ సహస్రావధాని, డాక్టర్ రెడ్డప్ప ధవేజీ, వారణాసి శ్రీనివాసరావు, పీర్‌సాహెబ్, వంగా నరసింహరావు, వీకే సత్యనారాయణ, ముచ్చర్ల శ్రీరామ్ పాల్గొన్నారు.
Advertisement