జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక
ఏలూరు రూరల్ : సబ్ జూనియర్ బాలబాలికల జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు గురువారం ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో నిర్వహించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రాము, ఎం.రంగారావు ఆధ్వర్యం వహించారు. పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులను జిల్లా జట్లకు ఎంపిక చేశారు. ఈ జట్లు ఈ నెల 11 నుంచి ప్రకాశం జిల్లా శింగరాయకొండలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని చెప్పారు.
బాలికల జట్టు
కె.జ్యోతి ప్రవల్లిక, ఎం.నాగ(తాళ్లూరు), బి.శ్రావని, యు.జాన్సీలక్ష్మి(పెదపాడు), ఎస్.రూపికారాణి, జి.రమ్య(వేగేశ్వరపురం), కె.దివ్య(ఏలూరుపాడు), యు.మౌనిక(ఇరగవరం), ఎస్.మేరి(ఏలూరు), పి.మధు(అగ్రహారం), బి.రేవతి, ఎ.జ్యోతి(ఏలూరు)
బాలుర జట్టు
జి.సురేంద్ర, జె.బాలకృష్ణ(తాళ్లూరు), ఆర్.మౌళి, బి.సత్యనారాయణ(కోనేటివాడ), ఆర్.రాజేష్(ఉండ్రాజవరం), వి.చంటి (పెదవేగి), ఎం.పవన్‌కుమార్(చింతలపూడి), ఎం.నాగరాజు(పెదపాడు), డి.జగపతిబాబు(తాడేరు), ఎం.గణేష్ (తాడేపల్లిగూడెం), ఎం.వంశీ(విజయరాయి), డి.విల్సన్ (భీమవరం)తో పాటు డి.సాల్వరాజు(గణపవరం), టి. ఆంజనేయప్రసాద్(భీమవరం), కె.నిఖిల్ సతీష్(జగన్నాథపురం), కె.శివరాజుకుమార్(అల్లంపురం), యు.వెంకటేష్(పెదవేగి) ఎంపికయ్యారు.