ప్రై వేట్ ఆస్పత్రిలో రోగి ఆత్మహత్య
Published Thu, Jul 21 2016 9:36 PM | Last Updated on Thu, Mar 28 2019 6:31 PM
నరసాపురం: పట్టణంలోని ఓ ప్రై వేట్ ఎమర్జెన్సీ ఆస్పత్రి గదిలో నరసాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన జోగి వెంకటేశ్వరరావు (43) ఫ్యాన్‌కు ఉరివేసుకుని గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్వరరావు మృతికి ఆస్పత్రి యాజమాన్యమే కారణమని ఆరోపిస్తూ మతుని బంధువులతో కలిసి సీపీఎం నాయకులు, దళిత సంఘాల నాయకులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. బిల్డింగ్ మీద నుంచి పడటంతో ఈనెల 17న వెంకటేశ్వరరావును ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి ఒకటో అంతస్తులోని ఓ గదిలో లుంగీతో వెంకటేశ్వరావు ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడని ఆస్పత్రి సిబ్బంది గురువారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. టౌన్ ఎసై ్స యుగంధర్ ఇక్కడకు వచ్చి విచారణ చేశారు. ఇదిలా ఉండగా మతుని బంధువులు వేరే కథనం వినిపిస్తున్నారు. బుధవారం రాత్రి వెంకటేశ్వరరావు ఒకటో అంతస్తులోని గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడని, తలుపులు పగలగొట్టడానికి వైద్యులు ఒప్పుకోలేదని అంటున్నారు. రాత్రే తలుపులు తెరచి ఉంటే ఘోరం జరిగేది కాదని ఆవేదన చెందుతున్నారు.
ఆస్పత్రి వద్ద ఆందోళన
న్యాయం చేయాలని కోరుతూ వెంకటేశ్వరరావు బంధువులు ఆస్పత్రి వద్ద మతదేహంతో ఆందోళన చేశారు. ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఫోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. తాము వైద్యం చేయగా వెంకటేశ్వరరావు మృతిచెందలేదని, ఆత్మహత్య చేసుకుంటే తామెలా బాధ్యులం అవుతామని ఆస్పత్రి యాజమాన్య ప్రతినిధులు వివరణ ఇచ్చారు. మృతుని భార్య గల్ఫ్‌లో ఉండగా ఇద్దరు కుమారులు ఇక్కడ ఉంటున్నారు. వైఎస్సార్ సీపీ దళితనేత ఇంజేటి జాన్‌కెనడీ, వంగలపూడి యేషయా, సీపీఎం నాయకులు ఎం.త్రిమూర్తులు, ఎం.రామాంజనేయులు ఆందోళనలో పాల్గొన్నారు.
Advertisement