విద్యుత్‌స్తంభాన్ని ఢీకొట్టి యువకుడి మరణం | person died hits eletric pole | Sakshi
Sakshi News home page

విద్యుత్‌స్తంభాన్ని ఢీకొట్టి యువకుడి మరణం

Published Fri, Oct 28 2016 12:37 AM | Last Updated on Thu, Mar 28 2019 6:31 PM

person died hits eletric pole

 వీరవాసరం : నర్సాపురం–భీమవరం రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువారం ఓ యువకుడు వృత్యువాత పడ్డాడు. మత్స్యపురి గ్రామానికి చెందిన నేలపాటి జానకిరాముడు (18) మోటార్‌ బైక్‌పై మత్స్యపురి నుంచి భీమవరం వైపు వస్తుండగా, మత్స్యపురి శివారు ప్రాంతంలో ప్రమాదవశాత్తు మోటార్‌ బైక్‌ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని డీకొట్టింది. ఘటనలో జానకిరాముడు తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. చైన్నైలో తాపీ పనులు చేస్తూ జీవించే జానకీరాముడు మూడు రోజుల క్రితం మత్స్యపురిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. సినిమాకు బయలేలుదేరిన అతను కానరాని దూరాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. యువకునికి తల్లిదండ్రులు లేరు. ఘటనాస్థలాన్ని నరసాపురం పోలీసులు పరిశీలించారు.  
 
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement