at eluru
-
జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక
ఏలూరు రూరల్ : సబ్ జూనియర్ బాలబాలికల జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు గురువారం ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో నిర్వహించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రాము, ఎం.రంగారావు ఆధ్వర్యం వహించారు. పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులను జిల్లా జట్లకు ఎంపిక చేశారు. ఈ జట్లు ఈ నెల 11 నుంచి ప్రకాశం జిల్లా శింగరాయకొండలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని చెప్పారు. బాలికల జట్టు కె.జ్యోతి ప్రవల్లిక, ఎం.నాగ(తాళ్లూరు), బి.శ్రావని, యు.జాన్సీలక్ష్మి(పెదపాడు), ఎస్.రూపికారాణి, జి.రమ్య(వేగేశ్వరపురం), కె.దివ్య(ఏలూరుపాడు), యు.మౌనిక(ఇరగవరం), ఎస్.మేరి(ఏలూరు), పి.మధు(అగ్రహారం), బి.రేవతి, ఎ.జ్యోతి(ఏలూరు) బాలుర జట్టు జి.సురేంద్ర, జె.బాలకృష్ణ(తాళ్లూరు), ఆర్.మౌళి, బి.సత్యనారాయణ(కోనేటివాడ), ఆర్.రాజేష్(ఉండ్రాజవరం), వి.చంటి (పెదవేగి), ఎం.పవన్‌కుమార్(చింతలపూడి), ఎం.నాగరాజు(పెదపాడు), డి.జగపతిబాబు(తాడేరు), ఎం.గణేష్ (తాడేపల్లిగూడెం), ఎం.వంశీ(విజయరాయి), డి.విల్సన్ (భీమవరం)తో పాటు డి.సాల్వరాజు(గణపవరం), టి. ఆంజనేయప్రసాద్(భీమవరం), కె.నిఖిల్ సతీష్(జగన్నాథపురం), కె.శివరాజుకుమార్(అల్లంపురం), యు.వెంకటేష్(పెదవేగి) ఎంపికయ్యారు. -
21న రాష్ట్రస్థాయి బాడీబిల్డింగ్ పోటీలు
భీమవరం: ఏలూరు నగరంలో ఈనెల 21న 7వ రాష్ట్రస్థాయి బాడీబల్డింగ్ పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా బాడీబిల్డర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్కే ఖాసీం సోమవారం భీమవరంలో విలేకరులకు తెలిపారు. ఏలూరు రఘులక్ష్మి ఫిట్జోన్ సహకారంతో 55, 60, 65, 70, 75, 80, 85 కిలోల కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రథమ స్థానంలో నిలిచిన వారిని చాంపియన్ ఆఫ్ ది చాంపియన్‌గా ప్రకటించి రూ.15 వేలు, ట్రోఫీ, ప్రశంసా పత్రం అందజేస్తామన్నారు. బాడీ బిల్డర్లు ఎస్కే ఖాసిం, సెల్ 93477 77778, 95818 84687లో సంప్రదించాలని కోరారు. -
వందేమాతరం.. మనదే ఈ తరం
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయనేత్రీ భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు అంటూ.. చిన్నారుల దేశభక్తి గీతాలు, సమైక్యతను చాటేలా వ్యాయామ విద్యార్థుల విన్యాసాలు, జాతీయ భావాన్ని కలిగించే ప్రసంగాలతో ఏలూరు పోలీస్ పరేడ్ గ్రేండ్స్లో సోమవారం స్వాతంత్య్ర దిన వేడుకలు అంబరాన్నంటాయి. –ఏలూరు (మెట్రో) జిల్లావ్యాప్తంగా 70వ స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లాస్థాయిలో ఏలూరులో జరిగిన వేడుకల్లో దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బేటీ బచావో–బేటీ పడావో నినాదంతో సర్వశిక్షాభియాన్ శకటాన్ని ప్రదర్శించారు. ఆర్డబ్ల్యూఎస్, డీఆర్డీఏ, వైద్యారోగ్య శాఖ, 108, 104, చంద్రన్న సంచార చికిత్స, అటవీ శాఖ, వ్యవసాయ, ఐటీడీఏ శాఖలు శకటాలను ప్రదర్శించాయి. విన్యాసం.. అబ్బురం వేడుకలలో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఏలూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన ‘దేశమంటే మట్టికాదోయ్– దేశమంటే మనుషులోయ్’, కొవ్వలి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు ‘జయహో..’, శర్వాణీ ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు ‘భరత ఖండమే నా దేశం’, గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయామ కళాశాల విద్యార్థులు ‘భారతీయం’, ఏలూరు రవీంద్రభారతి విద్యార్థులు ‘చెక్‌దే ఇండియా’, చైతన్య విద్యార్థులు ‘వందేమాతరం’ నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి. గోపన్నపాలెం వ్యాయామ విద్యార్థులు అబ్బురపరిచే విన్యాసాలతో అలరించారు. విజేతలకు మంత్రి మాణిక్యాలరావు ప్రశంసా పత్రాలు అందించారు. గోపన్నపాలెం వ్యాయామ కళాశాల విద్యార్థుల నృత్యం మొదటి స్థానంలో నిలిచింది. కలెక్టర్ కె.భాస్కర్, ఎస్పీ భాస్కర్‌భూషణ్, డీఈవో డి.మధుసూదనరావు, డెప్యూటీ డీఈవో డి.ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జీవో 43ను ఉపసంహరించాలంటూ ధర్నా
ఏలూరు (సెంట్రల్) : పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం విడుదల చేసి జీవో నంబర్ 43ను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఏపీ అర్బన్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నానుద్దేశించి యూనియన్ జిల్లా కార్యదర్శి బి.సోమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రైవేట్ వారికి అప్పగించేందుకు ప్రయత్నం చేస్తుందని దాని కోసం తెచ్చి జీవో 43ను ఇచ్చిందన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిని యధావిధిగా కొనసాగించాలని లేకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో యూనియన్ నాయకులు బి.బెనర్జీ, ఎన్.అంజలి, ఎండీ రిజియాన్, ఆర్.వెంకటేశ్వరరావు, సీహెచ్.రత్నం పాల్గొన్నారు. -
ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ
ఏలూరు అర్బన్ : నగరంలోని ఒక ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు దాదాపు రూ.ఆరు లక్షల విలువైన బంగారు నగలు, నగదు అపహరించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హరిశ్రీ వెంకటరామ్మూర్తి అనే ప్రయివేటు ఉద్యోగి స్థానిక ఆర్ఎంఎస్ కాలనీలోని రెండంతస్తుల భవనంలో కింది భాగంలో నివసిస్తుండగా, పై అంతస్తులో భాగంలో మామగారి కుటుంబం ఉంటోంది. మామగారి ఆరోగ్యం బాగోలేకపోవడంతో శుక్రవారం రాత్రి పై అంతస్తుకు తాళం వేసి కింద పోర్ష¯Œæలో నిద్రించారు. తెల్లవారి పైకి వెళ్లే సరికి తలుపులు తెరిచి ఉన్నాయి. లోపలికి వెళ్లి పరిశీలించగా బీరువాలో దాచుకున్న సుమారు 26 కాసుల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు అపహరణకు గురయ్యాయని గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, వన్‌టౌన్ సీఐ ఎన్.రాజశేఖర్, త్రీటౌన్ ఎస్సై ఎం.సాగర్‌బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగలు పై భాగం వెనుక తలుపుల తాళాలు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడినట్టు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.