జీవో 43ను ఉపసంహరించాలంటూ ధర్నా
Published Fri, Aug 5 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
ఏలూరు (సెంట్రల్) : పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం విడుదల చేసి జీవో నంబర్ 43ను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఏపీ అర్బన్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నానుద్దేశించి యూనియన్ జిల్లా కార్యదర్శి బి.సోమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రైవేట్ వారికి అప్పగించేందుకు ప్రయత్నం చేస్తుందని దాని కోసం తెచ్చి జీవో 43ను ఇచ్చిందన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిని యధావిధిగా కొనసాగించాలని లేకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో యూనియన్ నాయకులు బి.బెనర్జీ, ఎన్.అంజలి, ఎండీ రిజియాన్, ఆర్.వెంకటేశ్వరరావు, సీహెచ్.రత్నం పాల్గొన్నారు.
Advertisement