21న రాష్ట్రస్థాయి బాడీబిల్డింగ్ పోటీలు
Published Tue, Aug 16 2016 1:56 AM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM
భీమవరం: ఏలూరు నగరంలో ఈనెల 21న 7వ రాష్ట్రస్థాయి బాడీబల్డింగ్ పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా బాడీబిల్డర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్‌కే ఖాసీం సోమవారం భీమవరంలో విలేకరులకు తెలిపారు. ఏలూరు రఘులక్ష్మి ఫిట్‌జోన్ సహకారంతో 55, 60, 65, 70, 75, 80, 85 కిలోల కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రథమ స్థానంలో నిలిచిన వారిని చాంపియన్ ఆఫ్ ది చాంపియన్‌గా ప్రకటించి రూ.15 వేలు, ట్రోఫీ, ప్రశంసా పత్రం అందజేస్తామన్నారు. బాడీ బిల్డర్లు ఎస్‌కే ఖాసిం, సెల్ 93477 77778, 95818 84687లో సంప్రదించాలని కోరారు.
Advertisement
Advertisement