నకిలీ పోలీస్ అరెస్ట్
Published Fri, Oct 7 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM
వనంపల్లి, (పెనుమంట్ర) : పోలీసునని పలువురిని బెదిరించిన వ్యక్తిని పెనుమంట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఏఎస్సై కడలి సత్యనారాయణ కథనం ప్రకారం.. పెనుమంట్ర మండలం నెగ్గిపూడి శివారు వనంపల్లి గ్రామానికి చెందిన యర్రపల్లి ఓంసాయి మూడురోజుల క్రితం తన స్నేహితురాలైన ఒక యువతితో పెనుమంట్ర మండలం వెలగలేరు వద్ద మాట్లాడుతుండగా.. అక్కడకు చేరుకున్న ఆచంట శివారు వంగతాళ్ల చెరువు ప్రాంతానికి చెందిన కుడిపూడి యోగేంద్రబాబు తన సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీశాడు. అనంతరం వాళ్లతో తాను పోలీసునని చెప్పి రూ. 300 తీసుకున్నాడు. మరో రూ.3 వేలు ఇవ్వాలని వారిని డిమాండ్ చేశాడు. రోజూ డిమాండ్ చేస్తున్నాడు. దీంతో ఓంసాయి పోలీసులను ఆశ్రయించగా.. యోగేంద్ర బాబును అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో అతడు నకిలీపోలీసు అని, ఇలా కొందరిని బెదిరించాడని తేలింది. పోలీసులు అతడిని గురువారం అరెస్ట్ చేసి కోర్టుకు పంపించారు.
Advertisement