ముత్యాలమ్మ హుండీ ఆదాయం రూ.10.84 లక్షలు
మొగల్తూరు: మొగల్తూరు మండలంలోని ముత్యాలపల్లిలో బండి ముత్యాలమ్మవారి ఆలయ హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. 67 రోజులకు రూ.10,84,641 నగదు, 11 గ్రాముల 750 మిల్లీగ్రాముల బంగారం, 129 గ్రాముల వెండి, ఐదు విదేశీ కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయని ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు. దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, చైర్మన్ దాసరి అమ్మాజీ బాబి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.