సార్వా దిగుబడులు ఆశాజనకం
సార్వా దిగుబడులు ఆశాజనకం
Published Thu, Nov 10 2016 11:46 PM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM
మార్టేరు, (పెనుమంట్ర): సార్వాలో వరిచేలపై చీడ పీడలు, తెగుళ్ల ప్రభావం అంతగా లేనందున అధిక దిగుబడులు వస్తాయని పలువురు అధికారులు, శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. మార్టేరు వ్యవసాయ పరిశోధనాస్థానంలో గురువారం జరిగిన ఉభయ గోదావరి జిల్లాల అధికారులు, శాస్త్రవేత్తల సమావేశంలో మార్టేరు పరిశోధనా సంస్థ డైరెక్టర్ పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ సాధారణ స్థాయికి మించిన దిగుబడులు రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. నెలాఖరుకు అన్నిచోట్లా దాళ్వా సాగు కోసం నారుమడులు పూర్తి చేయాలని రైతులకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ సంచాలకులు మాట్లాడుతూ తమ జిల్లాలో ఇప్పటివరకు 30 శాతం కోతలు పూర్తికాగా దిగుబడి సగటున 32 బస్తాల వస్తోందన్నారు. జిల్లా వ్యవసాయ సంచాలకురాలు శ్రీలక్ష్మి మాట్లాడుతూ జిల్లా కోతలు ముమ్మరంగా సాగుతున్నాయని దిగుబడి 30 బస్తాలకు పైగా కనిపిస్తోందని చెప్పారు. రెండు జిల్లాలకు చెందిన పలువురు వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు అపరాల పంటపై కూడా చర్చించారు. అనంతరం వ్యవసాయ çపరిశోధనా స్థానంలో సిద్ధమవుతున్న నూతన వరి వంగడాలను పరిశీలించారు.
Advertisement