బాస్కెట్ పోటీలు ప్రారంభం
బాస్కెట్ పోటీలు ప్రారంభం
Published Thu, Dec 15 2016 10:05 PM | Last Updated on Mon, Sep 4 2017 10:48 PM
ఆచంట : అంతర్ జిల్లాల బాలుర, బాలికల బాస్కెట్‌బాల్ పోటీలు గురువారం రాత్రి మార్టేరులోని వేణుగోపాలస్వామి జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ప్రారంభమయ్యాయి. పోటీలను ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడ్జెట్‌లో క్రీడలకు మరిన్ని నిధులు కేటాయించేలా కృషి చేస్తానని అన్నారు. గ్రామీణ ప్రాంతమైన మార్టేరులో బాస్కెట్‌బాల్ పోటీలు నిర్వహిస్తున్న అసోసియేషన్ సభ్యులను అభినందించారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన బాలబాలికల జట్లు పాల్గొన్నాయి. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పోటీలు ఉత్సాహంగా సాగాయి. తొలుత భీమవరం డీఎన్‌ఆర్ కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన రోప్ స్కిప్పింగ్ ఆకట్టుకుంది. విద్యార్థినీ, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. పోటీలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఏపీ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్‌బాబు, ట్రెజరర్ చక్రవర్తి, కేజీ బేసిన్ ఓన్‌జీసీ మేనేజర్ సతీష్‌కుమార్, పెనుగొండ ఏఎంసీ చైర్మన్ సానబోయిన గోపాలకృష్ణ, ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ ఆదిరెడ్డి సత్యనారాయణ, నెగ్గిపూడి, సర్పంచ్‌లు కె. మమతకుమారి, కె.మహాలక్ష్మి, మార్టేరు మొదటి బాస్కెట్‌బాల్ నేషనల్ మెడలిస్ట్ కేఆర్ చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు
Advertisement