వరి పరిశోధనాస్థానాన్ని పరిశీలించిన జపాన్ బృందం
మార్టేరు (పెనుమంట్ర) : మార్టేరులోని వరిపరిశో«ధనాస్థానానికి శుక్రవారం జపాన్ శాస్త్రవేత్తలు విచ్చేశారు. ఈ సందర్భంగా జపాన్‌లోని కుబోటీ పరిశోధనాస్థానానికి చెందిన యమమెటో, ఖషిహరా అనే శాస్త్రవేత్తలు ఇక్కడ జరుగుతున్న పరిశోధనలను, వరి క్షేత్రాలను పరిశీలించారు. స్థానికంగా నిర్వహిస్తున్న యాంత్రీకరణ, నూతన పరికరాల వినియోగంపై పరిశోధనాస్థానం శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. సంస్థ డైరెక్టర్ పీవీ సత్యనారాయణ, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎస్.కృష్ణంరాజు, ఎన్.ఛాముండేశ్వరీ, ఫణికుమార్, శిరీష తదితరులు పాల్గొన్నారు.