in marter
-
బాస్కెట్ పోటీలు ప్రారంభం
ఆచంట : అంతర్ జిల్లాల బాలుర, బాలికల బాస్కెట్‌బాల్ పోటీలు గురువారం రాత్రి మార్టేరులోని వేణుగోపాలస్వామి జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ప్రారంభమయ్యాయి. పోటీలను ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడ్జెట్లో క్రీడలకు మరిన్ని నిధులు కేటాయించేలా కృషి చేస్తానని అన్నారు. గ్రామీణ ప్రాంతమైన మార్టేరులో బాస్కెట్‌బాల్ పోటీలు నిర్వహిస్తున్న అసోసియేషన్ సభ్యులను అభినందించారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన బాలబాలికల జట్లు పాల్గొన్నాయి. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పోటీలు ఉత్సాహంగా సాగాయి. తొలుత భీమవరం డీఎన్ఆర్ కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన రోప్ స్కిప్పింగ్ ఆకట్టుకుంది. విద్యార్థినీ, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. పోటీలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఏపీ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్‌బాబు, ట్రెజరర్ చక్రవర్తి, కేజీ బేసిన్ ఓన్జీసీ మేనేజర్ సతీష్‌కుమార్, పెనుగొండ ఏఎంసీ చైర్మన్ సానబోయిన గోపాలకృష్ణ, ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ ఆదిరెడ్డి సత్యనారాయణ, నెగ్గిపూడి, సర్పంచ్‌లు కె. మమతకుమారి, కె.మహాలక్ష్మి, మార్టేరు మొదటి బాస్కెట్‌బాల్ నేషనల్ మెడలిస్ట్ కేఆర్ చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు -
సార్వా దిగుబడులు ఆశాజనకం
మార్టేరు, (పెనుమంట్ర): సార్వాలో వరిచేలపై చీడ పీడలు, తెగుళ్ల ప్రభావం అంతగా లేనందున అధిక దిగుబడులు వస్తాయని పలువురు అధికారులు, శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. మార్టేరు వ్యవసాయ పరిశోధనాస్థానంలో గురువారం జరిగిన ఉభయ గోదావరి జిల్లాల అధికారులు, శాస్త్రవేత్తల సమావేశంలో మార్టేరు పరిశోధనా సంస్థ డైరెక్టర్ పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ సాధారణ స్థాయికి మించిన దిగుబడులు రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. నెలాఖరుకు అన్నిచోట్లా దాళ్వా సాగు కోసం నారుమడులు పూర్తి చేయాలని రైతులకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ సంచాలకులు మాట్లాడుతూ తమ జిల్లాలో ఇప్పటివరకు 30 శాతం కోతలు పూర్తికాగా దిగుబడి సగటున 32 బస్తాల వస్తోందన్నారు. జిల్లా వ్యవసాయ సంచాలకురాలు శ్రీలక్ష్మి మాట్లాడుతూ జిల్లా కోతలు ముమ్మరంగా సాగుతున్నాయని దిగుబడి 30 బస్తాలకు పైగా కనిపిస్తోందని చెప్పారు. రెండు జిల్లాలకు చెందిన పలువురు వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు అపరాల పంటపై కూడా చర్చించారు. అనంతరం వ్యవసాయ çపరిశోధనా స్థానంలో సిద్ధమవుతున్న నూతన వరి వంగడాలను పరిశీలించారు. -
వరి పరిశోధనాస్థానాన్ని పరిశీలించిన జపాన్ బృందం
మార్టేరు (పెనుమంట్ర) : మార్టేరులోని వరిపరిశో«ధనాస్థానానికి శుక్రవారం జపాన్ శాస్త్రవేత్తలు విచ్చేశారు. ఈ సందర్భంగా జపాన్‌లోని కుబోటీ పరిశోధనాస్థానానికి చెందిన యమమెటో, ఖషిహరా అనే శాస్త్రవేత్తలు ఇక్కడ జరుగుతున్న పరిశోధనలను, వరి క్షేత్రాలను పరిశీలించారు. స్థానికంగా నిర్వహిస్తున్న యాంత్రీకరణ, నూతన పరికరాల వినియోగంపై పరిశోధనాస్థానం శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. సంస్థ డైరెక్టర్ పీవీ సత్యనారాయణ, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎస్.కృష్ణంరాజు, ఎన్.ఛాముండేశ్వరీ, ఫణికుమార్, శిరీష తదితరులు పాల్గొన్నారు. -
మార్టేరు విత్తనాలకు విశ్వవ్యాప్త గుర్తింపు
మార్టేరు (పెనుమంట్ర): మార్టేరు వ్యవసాయ వరి పరిశోధనా స్థానం విత్తనా లు మేలైన విత్తనాలకు మారుపేరని అంతర్జాతీయ ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ అల్దాస్ జనయ్య అన్నారు. గురువారం మార్టేరు వ్యవసాయ పరి శోధనా స్థానాన్ని ఆయన సందర్శించారు. ఇక్కడ ఉత్పత్తయిన స్వర్ణ, ఎంటీయూ 1010, 1001 రకాలు విశ్వవ్యాప్తంగా పేరు గడించాయన్నారు. దేశవ్యాప్తంగా వివి ధ పరిశోధనా స్థానాల్లో తయారవుతున్న విత్తనాల పరిశీలనలో భాగంగా తాను మార్టేరు వచ్చినట్టు చెప్పారు. రైతుకు తక్కువ ఖర్చుతో పాటు అధిక దిగుబడినిచ్చే విత్తనాలందించేందుకు పలు పరిశోధనా స్థానాల్లో ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. తొలుత సంస్థ డైరెక్టర్ డాక్టరు పీవీ సత్యనారాయణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వరిశోధనా స్థానం వివరాలను, నూతన వరి వంగడాల సృష్టిని వివరించారు. ఇక్కడ నిర్వహిస్తు్తన్న వివిధ కార్యక్రమాలు, వరిక్షేత్రాలను నాబార్డు ఏజీఎం కె.కల్యాణ సుందరం తిలకించారు. పలువురు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
బాస్కెట్‌బాల్ పోటీలు ప్రారంభం
మార్టేరు (పెనుమంట్ర) : మార్టేరులోని వేణుగోపాలస్వామి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శనివారం రాత్రి రాష్ట్రస్థాయి ఇన్విటేన్ బాస్కెట్‌బాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మార్టేరులో క్రీడలకు సూర్తి ప్రదాతగా నిలిచిన పడాల ప్రహ్లాదరెడ్డి మెమోరియల్ తరఫున పోటీలు నిర్వహిస్తున్నారు. మూడు రోజులపాటు పోటీలు నిర్వహిస్తారు. పోటీల ప్రారంభోత్సవానికి పారిశ్రామికవేత్త గొలుగూరి శ్రీరామారెడి,్డ వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కవురు శ్రీనివాసు తదితరులు హాజరయ్యారు. ముందుగా అతిథులు బాస్కెట్‌బాల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. మార్టేరు,ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం నుంచి జట్లు వచ్చాయి. పోటీల ప్రారంభ సమయానికి వర్షం కురవడంతో నిర్వాహకులు ఆదివారానికి వాయిదా వేశారు. దీంతో మొదటిరోజు ప్రారంభ సభ మాత్రమే జరిగింది. అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు సత్తి సుబ్బన్‌రెడ్డి, పీడీ భూపతిరాజు వెంకట నరసింహరాజు, గొలుగూరి శ్రీనివాసరెడ్డి, తాడి శ్రీనివాసరెడ్డి, కష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.