ఆకట్టుకున్న సీతారామరాజు నాటికం
ఆకట్టుకున్న సీతారామరాజు నాటికం
Published Thu, Jan 19 2017 10:32 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM
భీమవరం (ప్రకాశం చౌక్) : స్థానిక మావుళ్లమ్మ అమ్మవారి 53 వార్షికోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద ఏర్పాటు చేస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు భక్తులను అకట్టుకుంటున్నాయి. గురువారం ఆలయం వద్ద సూర్యోదయ ఆర్ట్స్ భీమవరం వారు ప్రదర్శించిన విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు చారిత్రాత్మక నాటిక భక్తులను విశేషంగా అలరించింది. అలాగే నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ ఎం.అర్జునరావు హైదరాబాద్ వారు ప్రదర్శించిన సీతారామ కల్యాణం భక్తి నాటకం అకట్టుకుంది.
Advertisement
Advertisement