విష్ణులో వెబ్‌ అప్లికేషన్‌ అభివృద్ధిపై వర్క్‌షాప్‌ | workshop 0n web site application development in vishnu | Sakshi
Sakshi News home page

విష్ణులో వెబ్‌ అప్లికేషన్‌ అభివృద్ధిపై వర్క్‌షాప్‌

Published Thu, Aug 11 2016 8:42 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM

విష్ణులో వెబ్‌ అప్లికేషన్‌ అభివృద్ధిపై వర్క్‌షాప్‌

విష్ణులో వెబ్‌ అప్లికేషన్‌ అభివృద్ధిపై వర్క్‌షాప్‌

భీమవరం : అంతర్జాలంలో పెరుగుతున్న వెబ్‌సైట్లు, పోర్టల్స్‌ ఆవశ్యకతను బట్టి వాటిని ఎంతో వినూత్నంగా సంస్థల అభిరుచిని బట్టి సమయానుకూలంగా మార్పులు చేస్తూ ఉండాలని ముంబైకి చెందిన కార్ఫెక్స్‌ టెక్నాలజీస్‌ అధినేత వారణాసి బాల సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక విష్ణు ఇంజినీరింగ్‌ మహిళా కళాశాలలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు నిర్వహించే వెబ్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ అనే అంశంపై ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో గురువారం ఆయన మాట్లాడారు. అంతర్జాలంలోని వెబ్‌సైట్లు, పోర్టల్స్‌ను వినియోగించుకోవడానికి ఫైదాన్, డిజాంగో వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవచ్చన్నారు. పైధాన్, డిజాంగోల్లోని వివిధ అంశాల ద్వారా వెబ్‌సైట్‌కు అనువుగా వెబ్‌ పేజీలు తయారు చేయడం, వెబ్‌ అప్లికేషన్‌పై బెంగుళూరుకు చెందిన రాకేష్‌ విద్యాచంద్ర శిక్షణ ఇచ్చారు. ఈ వర్క్‌షాపులో 50 మంది అధ్యాపకులు పాల్గొనగా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.శ్రీనివాసరాజు పర్యవేక్షించారు. 
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement