మావుళ్లమ్మ సన్నిధిలో తెలంగాణ ఐజీ
భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం మావుళ్లమ్మవారిని గురువరం తెలంగాణ ఐజీ వీసీ సజ్జనార్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. నరసాపురం డీఎస్పీ పూర్ణచంద్రరావు, వన్‌టాన్ సీఐ వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్‌ఐ శ్యామ్‌సుందర్, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.
సోమేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
పంచారామక్షేత్రం గునుపూడి ఉమాసోమేశ్వర జనార్దనస్వామి ఆలయాన్ని ఐజీ సజ్జనార్ సందర్శించారు. స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు.