BVRM
-
డీఎన్నార్ కళాశాలలో మోడల్ ఆన్లైన్ ఎంసెట్ పరీక్ష
భీమవరం:పోటీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు మోడల్ పరీక్షలు ఎంతగానో ఉపకరిస్తాయని భీమవరం డీఎన్నార్ కళాశాల పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకటనర్సింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) అన్నారు. కళాశాలలో ఆదివారం నిర్వహించిన మోడల్ ఆన్లైన్ ఎంసెట్ పరీక్షను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. ఎంసెట్ పరీక్షకు నూతనంగా ఆన్లైన్ విధానం చేపడుతున్నందున దానిపై విద్యార్థులకు అవగాహన కల్పించుట కోసం తమ కళాశాలలో ఆన్లైన్ ఎంసెట్ నమూనా పరీక్ష ఏర్పాటు చేశారన్నారు. ఈ పరీక్షలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వంద మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షా ఫలితాలను విద్యార్థుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా తెలియచేస్తామని ప్రిన్సిపాల్ యు.రంగరాజు చెప్పారు. అలాగే ఈ నెల 14వ తేదిన మరోసారి ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తామని మోడల్ ఎంసెట్ కోఆర్డినేటర్ డీడీడీ సూరిబాబు చెప్పారు. దీనికిగాను ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు.ఈ పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందిస్తామన్నారు. -
138 ఎక్సైజ్ కేసులు పరిష్కారం
భీమవరం: జాతీయ లోక్‌అదాలత్ కార్యక్రమంలో భాగంగా భీమవరం యూనిట్ పరిధిలో 138 కేసులు పరిష్కారమైనట్టు భీమవరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.శ్రీనివాసులు శనివారం తెలిపారు. వీటిలో భీమవరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 9, నరసాపురంలో 84, పెనుగొండలో 20, తణుకులో 17, ఆకివీడులో 8 కేసులు పరిష్కారమయ్యాయని చెప్పారు. భీమవరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో డీ అడిక్షన్ సెంటన్‌ను ప్రారంభించి పాలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ గులాబ్‌రాజ్ మద్యం సేవించేవారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎక్సైజ్ సీఐ కె.బలరామరాజు, కె.వీరబాబు, ఎస్సైలు పి.వెంకటేశ్వరమ్మ, ఎస్.రాంబాబు పాల్గొన్నారు. -
2న జిల్లా ర్యాపిడ్ చెస్ పోటీలు
భీమవరం టౌన్ : భీమవరం డీఎన్నార్ కళాశాల రోడ్డులోని కిడ్జీ ప్లే స్కూల్లో ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 10 గంటలకు జిల్లా ర్యాపిడ్ చెస్ పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట భోగయ్య, కార్యదర్శి మాదాసు కిశోర్ గురువారం తెలిపారు. పోటీల్లో పాల్గొనే వారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారై ఉండాలన్నారు. అభ్యర్థులు తమ ఆధార్‌కార్డు జిరాక్స్ కాపీని తీసుకురావాలన్నారు. ఈ పోటీల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన వారు అనంతపురం జిల్లాలో జూన్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి ర్యాపిడ్ చెస్ పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహిస్తారని తెలిపారు. వివరాలకు సెల్ : 90632 24466లో సంప్రదించాలని సూచించారు. -
29న ఘంటసాల కాంస్య విగ్రహావిష్కరణ
భీమవరం: భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాటన్‌పార్క్‌లో ఈనెల 29న పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్టు విగ్రహావిష్కరణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కొత్తపల్లి కోదండరామ గాంధీరాజు, వల్లూరు వెంకట రాధాకృష్ణమూర్తి తెలిపారు. శనివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జేపీ రోడ్డులో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆకాశవాణి రిటైర్డ్ సంచాలకుడు మంగళగిరి ఆదిత్యప్రసాద్ చేతులు మీదుగా ఆవిష్కరించనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఏఎస్ఆర్ నగర్‌లోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో ఏర్పాటు చేసే సభా కార్యక్రమంలో ఎంపీలు తోట సీతారామలక్ష్మి, గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు), ఎమ్మెల్సీ కంతేటి సత్యనాయణరాజు తదితరులు పాల్గొంటారన్నారు. సాయంత్రం 6 గంటలకు ఘంటసాల సంగీత సుధావర్షిణి సంగీత కార్యక్రమం, 30 సాయంత్రం ఆరు గంటలకు రాష్ట్రపతి అవార్డు బాలశ్రీ గ్రహీత లలితా సింధూరి నాట్య ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. దానికి సంబంధించిన విగ్రహావిష్కరణ ఫ్లెక్సీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాతపాటి సీతారామరాజు, చెరుకువాడ రంగసాయి తదితరులు పాల్గొన్నారు. -
బడ్జెట్ కేటాయింపుల్లో కౌలు రైతులకు తీవ్ర అన్యాయం
భీమవరం: వ్యవసాయ రంగంలో గణనీయమైన వృద్ధ రేటు సాధించామంటూ గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో కౌలు రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని రాష్ట్ర కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య ఆరోపించారు. భీమవరం యూటీఎఫ్ కార్యాలయంలో శుక్రవారం కౌలు రైతుల సంఘం జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రొఫెసర్ రాధాకృష్ణ కమిషన్ రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులున్నారని తెలిపారు. 80 శాతం భూములను వీరే సాగు చేస్తున్నా రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం అన్యాయమన్నారు. కౌలు రైతులు, రైతుమిత్ర, జేఎల్ గ్రూపుల రుణమాఫీకి నిధులు కేటాయించక పోవడం వ్యవసాయ రంగంపై ప్రభుత్వానికి ఉన్నచిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందని చెప్పారు. రుణమాఫీ కోసం రూ.3600 కోట్లు కేటాయించినా అవి వ్యవసాయం చేయని భూస్వాములకే అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2013 ఆఖరునాటికి కౌలు రైతులు, రైతు మిత్ర, జేఎల్ గ్రూపులకు ఇచ్చిన రూ.594 కోట్ల రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. వడ్డీలేని పంట రుణాలకు కేవలం రూ.177 కోట్లు కేటాయించడం అన్యాయమన్నారు. కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కేటాయింపులకు ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తోందని, కౌలు రైతులకు బ్యాంకులు పంట రుణాలు ఇచ్చే విధంగా ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు చేటపట్టడం లేదని విమర్శించారు. కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ గోదావరి డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వంతులవారీ విధానంలో పూర్తి స్థాయిలో నీరందిస్తామని అధికారులు చేసిన ప్రచారం కేవలం ప్రకటనలకే పరిమితమైందన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు జుత్తిగ నర్సింహమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు ధనికొండ శ్రీనివాస్, జొజ్జవరపు శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు మామిడిశెట్టి రామాంజనేయులు, పెచ్చెట్టి నర్సింహమూర్తి, కవల వేంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఎయిమ్స్‌కు ‘యల్లా ప్రగడ’ పేరు పెట్టాలి
భీమవరం : రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఎయిమ్స్ భవనానికి వైద్యశాస్త్ర పరిశోధకుడు డాక్టర్ యల్లా ప్రగడ సుబ్బారావు పేరు పెట్టాలని భీమవరం కేజీఆర్ఎల్ కళాశాల కోశాధికారి గన్నాబత్తుల వెంకట శ్రీనివాస్ ఆదికవి నన్నయ యూనివర్శిటీ సభ్యుడు డాక్టర్ ఎస్.సాయి దుర్గాప్రసాద్ కోరారు. ప్లేగు వ్యాధికి మందును కనిపెట్టిన డాక్టర్ సుబ్బారావు పేరును ఎయిమ్స్ భవనానికి పెట్టడం సముచితమన్నారు. సుబ్బారావు నామకరణ సాధన సమితి కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ప్రపంచంలోని అనేక దేశాల్లో వివిధ భవనాలకు సుబ్బారావు పేరుపెట్టి గౌరవిస్తుంటే స్వరాష్ట్రంలో ఆయన పేరు పెట్టకపోవడం బాధాకరమన్నారు. ఎయిమ్స్ భవనానికి సుబ్బారావు పేరుపెట్టాలని కలెక్టర్ కె.భాస్కర్‌కు వినతిపత్రం అందించినట్టు చెప్పారు. డాక్టర్ సుబ్బారావు భీమవరంలో జన్మించినా ఆయన విగ్రహం లేకపోవడం దురదృష్టకరమని, భీమవరం ప్రభుత్వాసుపత్రిలో విగ్రహాన్ని నెలకొల్పాలని కోరినట్టు తెలిపారు. ప్రిన్సిపాల్ ఆర్.సూర్యనారాయణరాజు, వైస్ ప్రిన్సిపాల్ మెంటే త్రినాథ్, తోట వరప్రసాద్, జవ్వాది ప్రభాకర్, కట్రెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. -
ఉత్కంఠభరితంగా చదరంగం పోటీలు
భీమవరం : చదరంగంపై ఇటీవల అన్ని వయస్సుల వారిలో ఆసక్తి పెరిగిందని చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తోట భోగయ్య అన్నారు. భీమవరం అనసూయ చెస్ అకాడమీలో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి మహిళా చదరంగం పోటీల్లో విజేతలకు జ్ఞాపికలను అందచేసిన అనంతరం ఆయన మాట్లాడారు. చెస్‌తో మేథస్సుకు పదును పెడుతుందన్నారు. ఈనాటి విజేతలు జూన్ నెలలో గుంటూరులో నిర్వహించే రాష్ట్రస్థాయి మహిళా చందరంగం పోటీల్లో పాల్గొంటారన్నారు. అసోసియేషన్ కార కార్యదర్శి మాదాసు కిషోర్ మాట్లాడుతూ ఈ నెల 28న అండర్ 11 జిల్లాస్థాయి బాలబాలికల చదరంగం పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ పోటీల్లో విజేతలు కర్నూలులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. మొదటి నాలుగు స్థానాల్లో గెలుపొందిన గ్రంధి సౌమ్యబాల(కాళ్ల), కెఎల్ రోషిణి(ఏలూరు), కామన దివ్య(భీమవరం, గ్రంధి కావ్య(కాళ్ల)లకు మెడల్స్, సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందచేశారు. ఉపాధ్యక్షుడు వేమిరెడ్డి హరికృష్ణ, అల్లు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఆక్వారంగాన్ని శాసిస్తున్న చైనా
భీమవరం : ఆక్వారంగ ఉత్పత్తుల్లో ప్రపంచాన్ని చైనా దేశమే శాసిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా 580 రకాల చేపలను ఉత్పత్తి చేస్తుండగా ఒక్క చైనా దేశం 250 రకాలను ఉత్పత్తి చేస్తూ గుర్తింపు తెచ్చుకుందని ఆక్వా శాస్త్రవేత్త డాక్టర్ ఎంవీ గుప్త అన్నారు. భీమవరంలో నిర్వహిస్తున్న ప్రాఫిట్ ఆన్ ఆక్వా కల్చర్ అంతర్జాతీయ సదస్సులో రెండోరోజు ఆదివారం ఆయన మాట్లాడారు. దేశంలో ఆక్వా ఉత్పత్తులకు అవసరమైన ఎన్నోరకాల వనరులున్నప్పటికీ వాటిని వినియోగించుకోలేక పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. మలేషియాకు చెందిన డాక్టర్ నయన్‌తా మాట్లాడుతూ వనామి రొయ్యల సాగులో రైతులు ఏడాదికి మూడు పంటలను తీస్తున్నప్పటికీ ఒక్క పంటలో మాత్రమే లాభాలు వస్తున్నట్టు ఇక్కడ రైతులు చెబుతున్నారని అయితే బయోక్లిక్ టెక్నాలజీ ద్వారా అధిక ఉత్పత్తులు సాధించి లాభాలు పొందే అవకాశం ఉందన్నారు. తైవాన్‌కు చెందిన ఇహు చైన్ మాట్లాడుతూ తమ దేశంలో నీటి యాజమాన్య పద్ధతులు సక్రమంగా అవలంభిస్తారని అందువల్లనే అక్కడి రైతులు ఆక్వా సాగులో లాభాలు పొందుతున్నారన్నారు. థాయ్‌లాండ్‌కు చెందిన మహిడోల్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ బూన్ప్రిమ్ విత్యాసుమనరన్కుల్ మాట్లాడుతూ వనామీ రొయ్యల సాగులో సీడ్ దశ నుంచి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. థాయ్‌లాండ్‌కు చెందిన వీరాసన్ ప్రేమోతమొరన్కుల్ మాట్లాడుతూ ఆక్వా సాగులో డైనమిక్స్ ప్రొటోకాల్ పాటించాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డాక్టర్ మన్మోహన్సింగ్ మాట్లాడుతూ ఆక్వా రైతులంతా సమైక్యంగా ఉంటూ అధిక దిగుబడులు సాధించడానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ దిగుబడులు సాధించిన 19 మంది రైతులకు జ్ఞాపికలను అందించారు. ఈ సదస్సులో ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఛైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు తదితరులు పాల్గొన్నారు -
ముగిసిన టెన్నిస్ టోర్నీ
భీమవరం : క్రీడల నిర్వహణపై వివిధ సంస్థలు చూపిస్తున్న ఆసక్తి ప్రశంసనీయమని ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేష న్ సీఈవో, గౌరవ ప్రధాన కార్యదర్శి హెచ్.చటర్జీ పేర్కొన్నారు. భీమవరం కాస్మోపాలిట న్ క్లబ్, స్పోర్ట్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అల్లూరి రవితేజ మెమోరియల్ నేషనల్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. ఫైనల్స్‌లో క్రీడాకారులు నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రదానోత్సవ సభ జరిగింది. సభలో ముఖ్యఅతిథిగా చటర్జీ మాట్లాడారు. దాతల సహకారంతో మరిన్ని క్రీడలు నిర్వహించాలని ఆకాంక్షించారు. పోటీలకు అల్లూరి పద్మరాజు అందించిన సహకారం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు రామరాజు, తట వర్తి కృష్ణబాబు, గౌరవాధ్యక్షుడు రుద్రరాజు కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చటర్జీని క్లబ్ ఆధ్వర్యంలో సత్కరించారు. విజేతలకు బహుమతులు ఇచ్చారు. విజేతలు వీరే : పురుషుల సింగిల్స్ ఫైనల్స్ : కునాల్ విజ్రాని (మహారాష్ట్ర)పై దక్షిణేశ్వర్ సురేష్ (తమిళనాడు) 6–1, 7–5 తేడాతో గెలుపొందారు. డబుల్స్ : కునాల్ విజ్రాని (మహరాష్ట్ర), యాష్ యాదవ్ (మధ్యప్రదేశ్) జోడిపై అనురాగ్ నెన్వాని (ఢిల్లీ), రోహ న్ భాటియా (మహారాష్ట్ర) జోడి 6–2, 6–3 స్కోరుతో గెలిచింది. మహిళల సింగిల్స్ ఫైనల్స్ : నిత్యరాజ్బాబు (తమిళనాడు)పై ఈటె మెహతా (గుజరాత్) 6–1, 6–1 తేడాతో గెలిచింది. డబుల్స్ : సాయిదీప్య (తెలంగాణ), యమలపల్లి సహజ (ఏపీ) జోడిపై ఈటె మెహతా (గుజరా త్), వి.సౌమ్య (గుజరాత్) జోడి 6–0, 6–2 తేడాతో గెలిచింది. -
ముగిసిన టెన్నిస్ టోర్నీ
భీమవరం : క్రీడల నిర్వహణపై వివిధ సంస్థలు చూపిస్తున్న ఆసక్తి ప్రశంసనీయమని ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేష న్ సీఈవో, గౌరవ ప్రధాన కార్యదర్శి హెచ్.చటర్జీ పేర్కొన్నారు. భీమవరం కాస్మోపాలిట న్ క్లబ్, స్పోర్ట్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అల్లూరి రవితేజ మెమోరియల్ నేషనల్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. ఫైనల్స్‌లో క్రీడాకారులు నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రదానోత్సవ సభ జరిగింది. సభలో ముఖ్యఅతిథిగా చటర్జీ మాట్లాడారు. దాతల సహకారంతో మరిన్ని క్రీడలు నిర్వహించాలని ఆకాంక్షించారు. పోటీలకు అల్లూరి పద్మరాజు అందించిన సహకారం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు రామరాజు, తట వర్తి కృష్ణబాబు, గౌరవాధ్యక్షుడు రుద్రరాజు కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చటర్జీని క్లబ్ ఆధ్వర్యంలో సత్కరించారు. విజేతలకు బహుమతులు ఇచ్చారు. విజేతలు వీరే : పురుషుల సింగిల్స్ ఫైనల్స్ : కునాల్ విజ్రాని (మహారాష్ట్ర)పై దక్షిణేశ్వర్ సురేష్ (తమిళనాడు) 6–1, 7–5 తేడాతో గెలుపొందారు. డబుల్స్ : కునాల్ విజ్రాని (మహరాష్ట్ర), యాష్ యాదవ్ (మధ్యప్రదేశ్) జోడిపై అనురాగ్ నెన్వాని (ఢిల్లీ), రోహ న్ భాటియా (మహారాష్ట్ర) జోడి 6–2, 6–3 స్కోరుతో గెలిచింది. మహిళల సింగిల్స్ ఫైనల్స్ : నిత్యరాజ్బాబు (తమిళనాడు)పై ఈటె మెహతా (గుజరాత్) 6–1, 6–1 తేడాతో గెలిచింది. డబుల్స్ : సాయిదీప్య (తెలంగాణ), యమలపల్లి సహజ (ఏపీ) జోడిపై ఈటె మెహతా (గుజరా త్), వి.సౌమ్య (గుజరాత్) జోడి 6–0, 6–2 తేడాతో గెలిచింది. -
అభయమిచ్చిన ఆదిలక్ష్మి
భీమవరం (ప్రకాశం చౌక్) : భీమవరం మావుళ్లమ్మ ఆదిలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ 53వ వార్షికోత్సవాలు మరో ఎనిమిది రోజుల్లో పరిసమాప్తం కానున్నాయి. ఈ దృష్ట్యా అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించే కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. అభయమిచ్చే ఆదిలక్ష్మి రూపంలో ఒదిగిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. మొక్కులు తీర్చుకుని తరించారు. -
నేటి నుంచి సురభి నాటకోత్సవాలు
భీమవరం(ప్రకాశం చౌక్) : మావుళ్లమ్మ వార్షికోత్సవాల్లో భాగంగా శుక్రవారం నుంచి ఆలయం వద్ద సురభి నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్టు నీరుల్లి కురగాయల పండ్ల వర్తక ఉత్సవ కమిటీ నాయకులు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీవెంకటేశ్వర నాట్య మండలి ఆధ్వర్యంలో నాటకాలు ప్రదర్శిస్తున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా నాటకమండలి నిర్వాహకుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ శుక్రవారం శ్రీకృష్ణ లీలలు, శనివారం భక్తప్రహ్లాద, 12న బాలనాగమ్మ, 13న పాతాళభైరవి, 14న మాయాబజార్ నాటకాలు ఉంటాయని వెల్లడించారు. 60 మంది కళాకారులతో నాటకాలు ప్రదర్శించనున్నట్టు వివరించారు. నాటకోత్సవాల ఏర్పాట్లను ఉత్సవ కమిటీ పర్యవేక్షించింది. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మానే పేరయ్య, ప్రధాన కార్యదర్శి కె.సత్తిబాబు, కార్యదర్శి రంగారావు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలు
భీమవరం: క్లబ్లంటే కేవలం ప్లేయింగ్ కార్డ్స్ ఆడుకునే ప్రదేశమనే అపోహ ప్రజల్లో ఉందని అయితే భీమవరం కాస్మో పాటిలిన్ క్లబ్లో నిర్వహిస్తున్న క్రీడలు, సామాజిక సేవాకార్యక్రమాలు అలాంటి అపోహలు తొలగిస్తున్నాయని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) నండూరి సాంబశివరావు అన్నారు. భీమవరం కాస్మోక్లబ్ ఆధ్వర్యంలో కాస్మోపాలిటన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం అల్లూరి రవితేజ మెమోరియల్ నేషనల్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భీమవరం క్లబ్‌లలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు. ప్రముఖులను కలుసుకుని సరికొత్త ఆలోచనలు పంచుకోడానికి, సేద తీరడానికి క్లబ్‌లు వేదికగా ఉపయోగపడతాయన్నారు. భీమవరం పట్టణానికి దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు రావడానికి ఇక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమాలే కారణమని సాంబశివరావు పేర్కొన్నారు. ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ భీమవరం లాంటి చిన్న పట్టణంలో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) మాట్లాడుతూ కాస్మోక్లబ్లో నిర్వహిస్తున్న పలు ప్రజాహిత కార్యక్రమాలు ఆదర్శనీయమని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్పీ భాస్కర్ భూషన్, క్లబ్ గౌరవాధ్యక్షుడు యు.కృష్ణప్రసాద్, అల్లూరి పద్మనాభరాజు, కార్యదర్శి తటవర్తి కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. సాంబశివరావుకు సత్కారం డీజీపీ సాంబశివరావును గజమాల, దుశ్శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. అనంతరం టెన్నిస్ కోర్టులో క్రీడాకారులను పరిచయం చేసుకున్న సాంబశివరావు బెలూన్లు వదిలి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాస్మోక్లబ్ వేదికపై ఉద్దరాజు ధర్మరాజు, అల్లూరి రవితేజ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. హోరాహోరీగా క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు భీమవరం: భీమవరం కాస్మోక్లబ్ ఆధ్వర్యంలో కాస్మో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న అల్లూరి రవితేజ మెమోరియల్ నేషనల్ ర్యాకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు ఆదివారం హోరాహోరీగా సాగాయి. మహిళల ఫైనల్ రౌండ్లో సారా యాదవ్ (మధ్యప్రదేశ్), సృష్టిదాస్ (మహారాష్ట్ర)పై 6–4, 6–4 స్కోరుతో విజయం సాధించగా, అద్రిజా బిస్వాస్ (వెస్ ్టబెంగాల్) ప్రగతి ప్రసాద్ (కర్నాటక)పై 6–0, 6–1, ఆనంద్ అల్మాస్ (ఒడిశా) ఎస్.ప్రవీణ (తమిళనాడు)పై 6–2, 6–4, ఆర్.ప్రియాంక (మధ్యప్రదేశ్) గొట్టిపాటి శ్రీలక్ష్మి (కర్నాటక)పై 6–0, 6–2, అక్షయ సురేష్ (తమిళనాడు) రేష్న గణపతి (తమిళనాడు)పై 6–2, 6–0, అవిష్క గుప్త (జార్ఖండ్), ఎన్.పూర్వారెడ్డి (తెలంగాణ)పై 6–0, 6–2, తటవర్తి శ్రేయ (ఏపీ) ఎస్.సమీరపై 6–0, 6–0, షేక్ హుమేరా (తెలంగాణ) రెహానా తస్కీన్ (తెలంగాణ)పై 6–0, 6–0 తేడాతో విజయం సాధించారు. పురుషుల విభాగం ఫైనల్ రౌండ్లో పి.జయేష్ (మహారాష్ట్ర), ఎస్.దుర్గ (తెలంగాణ)పై 7–5, 6–4 తేడాతో విజయం సాధించగా, షేక్ ఓస్మా (ఏపీ) రాజేంద్రప్రసాద్రాయ్ (ఉత్తరప్రసాద్)పై 6–4, 6–1 తేడాతో, త్యేజో ఓజెస్ (తమిళనాడు) అంకం కృష్ణతేజ (తెలంగాణ)పై 4–6, 7–5, 6–4 తేడాతో, చిలకలపూడి తరుణ్ (ఏపీ) ఓజెస్ రాతే (హరియాణ)పై 6–2, 6–0 తేడాతో, చిన్మయ్ ప్రధా¯ŒS (ఒడిశా) యాష్వర్దన్(హరియాణ)పై 6–4, 6–2 తేడాతో, గంటా సాయికార్తీక్ (తెలంగాణ) ఒమిందర్ బాయ్సోయా (హరియాణ)పై 6–3, 6–4 తేడాతో, ఇషాన్ హుస్సేన్ (తమిళనాడు) అజయ్ పృథ్వీ (తెలంగాణ)పై 6–4, 7–5 తేడాతో విజయం సాధించారు. -
ఉత్సాహంగా గోకార్టింగ్ పోటీలు
భీమవరం: భీమవరం విష్ణు ఇంజినీరింగ్ మహిళా కళాశాలలో మూడురోజులుగా నిర్వహిస్తున్న గోకార్టింగ్ చాంపియన్‌షిప్–2017 పోటీల్లో భాగంగా ఆదివారం విద్యార్థులు రూపొందించిన వాహనాలకు వివిధ రకాల సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. పోటీలను భీమవరం మున్సిపల్ కమిషనర్ సీహెచ్ నాగనర్సింహరావు జెండా ఊపి ప్రారంభించి మాట్లాడుతూ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు వ్యయప్రయాలకోర్చి పాల్గొనడం అభినందనీయమన్నారు. స్కిడ్ పాడ్ పరీక్షల్లో భాగంగా వాహనాలను ఎనిమిది అంకె ఆకారంలో ప్రత్యేకంగా నిర్మించిన దారిలో నిర్ణీత సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకుండా నడిపి విజయం సా«ధించాలి. ఆటోక్రాస్ టెస్ట్‌లో క్లిష్టమైన మలుపులు గల రహదారిలో తక్కువ సమయంలో పూర్తిచేసి విజయం సాధించాల్సి ఉంటుంది. గరిష్ట వేగ నిర్ధారణ పరీక్షల్లో వాహనాలు నిర్దేశించిన 50 కిలోమీటర్ల దూరాన్ని ఎంత తక్కువ సమయంలో పూర్తిచేస్తాయో నిర్ధారిస్తారు. తక్కువ సమయంలో పూర్తి చేసిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. వాహనాల పరీక్షల అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి. ప్రిన్సిపాల్ డాక్టర్ జి.శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాసరాజు పాల్గొన్నారు. -
యంత్రం.. నైపుణ్య మంత్రం
భీమవరం : భీమవరం విష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న గోకార్టింగ్ చాంపియ న్షిప్–2017 పోటీల్లో భాగంగా రెండో రోజు శనివారం వాహనాలకు సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. దేశం లోని ఆరు రాష్ట్రాల నుంచి సుమారు 700 మంది విద్యార్థులు 31 బృందాలుగా ఏర్పడి నూతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన వాహనాలను ప్రదర్శించారు. సాంకేతిక పరీక్షల రెండో భాగంలో వాహనం దృఢత్వం, బరువుకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొనే వాహనాలు 120 కిలోల బరువు మించి ఉండకూడదనే నిబంధన విధించారు. రై న్ టెస్ట్ పరీక్షలో వాహనాలను ప్రత్యేకంగా నిర్మించిన వాటర్ చాంబర్లో నిర్ణీత సమయం ఉంచి ఇంజి న్‌తో పనిచేయించి పని తీరును, ఎలక్ట్రికల్ వైరింగ్‌ను పరిశీ లించారు. బ్రేక్ టెస్ట్‌లో వాహనం నిర్ణీత వేగం పుంజుకున్న తర్వాత బ్రేక్‌ను ఉపయోగించి వాహనాన్ని ఆరుమీటర్ల లోపు నిలపాల్సి ఉంటుంది. పరీక్షలను నిపుణులైన న్యాయనిర్ణేతలతో నిర్వహించినట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ జి.శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాసరాజు చెప్పారు. పోటీలకు హాజరైన పలువురు విద్యార్థులు వాహనాల పనితీరును వివరించారు. కళాశాల ప్రోత్సాహంతోనే.. మా కళాశాల ఫ్యాకల్టీ ప్రోత్సాహం ఎంతగానో ఉంది. వాహనాల తయారీకి అవసరమైన సదుపాయాలు కల్పించారు. దీంతో సొంతంగా వాహనాలు తయారు చేసి పోటీల్లో పాల్గొంటున్నాం. ప్రస్తుతం మేం ఈ వాహనానికి వాడిన ఇన్నోవేష న్స్ ను మరింత అభివృద్ధి చేసి పటిష్టంగా తయారు చేయడానికి అవకాశం కలిగింది. – విష్ణు ఉమె న్స్ ఇంజినీరింగ్ కళాశాల, భీమవరం సాంప్రదాయేతర వనరులతో.. ఇటువంటి పోటీల ద్వారా సాంప్రదాయేతర ఇంధన వనరులను ఉపయోగించి వాహనాలు తయారు చేయడం తెలుసుకున్నాం. నిర్ణీత సమయంలో తక్కువ వ్యయంతో రక్షణాత్మకంగా ఉండే విధంగా వాహనాన్ని తయారు చేశాం. ఈ పోటీల్లో మా వాహనం ప్రథమ బహుమతి గెలుచుకుంటుందని ఆశిస్తున్నాం. – ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కాలేజ్, విజయనగరం భవిష్యత్‌లో మరిన్ని పోటీలకు.. వాహన తయారీకి మా కళాశాలలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రత్యేకంగా వసతిని ఏర్పాటు చేసింది. ఫ్యాకల్టీస్ పూర్తి సహాయ సహకారాలు అందించడం వల్లే వాహనం తయారు చేశాం. భవిష్యత్‌లో మరిన్ని పోటీలకు సన్నద్ధం కావడానికి వాహనాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి పోటీలు దోహదపడతాయి. – జగన్నాథం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఒడిసా ప్రయోగాలే మిన్న ఇటువంటి పోటీల్లో పాల్గొనడం ద్వారా పారిశ్రామికంగా నూతన టెక్నాలజీతో సరికొత్త వాహనాలు తయారు చేయడానికి అనుభవం పొందవచ్చు. మేం తయారు చేసిన వాహనం విమానాశ్రయాలు, మిలట్రీలో వాహనాలు తరలించడానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాం. – ఇందూర్ ఇనిస్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీ, సిద్ధిపేట -
గోకార్టింగ్ చాంపియ న్ షిప్ పోటీలు ప్రారంభం
భీమవరం : భీమవరం శ్రీవిష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయస్థాయి గోకార్టింగ్ చాంపియ న్ షిప్ పోటీలు శుక్రవారం ఎంతో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ భాస్కర్ భూషణ్ మాట్లాడుతూ నేటితరం విద్యార్థులు కేవలం తరగతి గదుల్లో విద్యాభ్యాసానికే పరిమితం కాకుండా వివిధ నూతన ఆవిష్కరణలకు నాంది పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శ్రీవిష్ణు ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు తమలో దాగి ఉన్న ప్రతిభాపాటవాలను ప్రదర్శించడానికి ఈ పోటీలు వేదిగా నిలుస్తాయననారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాసరాజు మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ పోటీలలో ఆరు రాష్ట్రాల నుంచి 31 జట్లు పాల్గొంటున్నాయన్నారు. అనంతరం ఎస్పీని దుశ్శాలువాతో సత్కరించారు. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఆరిఫ్, విష్ణు విద్యా సంస్థల డైరెక్టర్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
11 నుంచి అంతర్జాతీయ ఆక్వా సదస్సు
భీమవరం: వచ్చేనెల 11 నుంచి మూడు రోజులపాటు భీమవరం విష్ణు కళాశాల ఆవరణలో ఆక్వాకల్చర్‌పై అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు కేరళ యూని వర్సిటీ వీసీ డాక్టర్ మోహనకుమార్ నా యర్ చెప్పారు. భీమవరంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర మత్స్యశాఖ, వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, ఆసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ సం యుక్త ఆధ్వర్యంలో సదస్సు నిర్వహి స్తామ న్నారు. సీఎం చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉందని, కేంద్ర మంత్రులు రాధామోహన్‌సింగ్, ఎం.వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారన్నారు. ఆక్వాకల్చర్‌కు చెందిన 50 మంది సైంటిస్టులు, సుమారు 1,200 మంది రైతులు, విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. సదస్సులో ఒకరోజు ప్రధానంగా చైనాలో జరిగే చేపల పెంపకంపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. నెల్లూరు ఫిషరీస్ కళాశాలకు చెందిన డాక్టర్ కె.గోపాలరావు మాట్లాడుతూ చేపల పెంపకంలో కొత్త సాగు విధానాలను వివరిస్తామన్నారు. ఆనంద గ్రూప్ చైర్మన్ ఉద్దరాజు ఆనందరాజు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కొరమీను, పండుగప్ప చేపల హేచరీలు ఏర్పాటుచేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. చేపలను ఎగుమతి చే సేందుకు అనువైన టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఆక్వా సదస్సు బ్రోచర్‌ను ఆవిష్కరించారు. -
అమ్మ పాత్రలు నటించడం చాలా ఇష్టం
భీమవరం(ప్రకాశం చౌక్) : సినిమా, టీవీ సీరియల్ నటి శ్రీమాధవి(స్వాతి చినుకులు సీరియల్, రాజన్న సినిమా ఫేమ్) మంగళవారం భీమవరంలోని మావుళ్లమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఓ సీరియల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆమె విలేకరులతో మాట్లాడారు. తాను ఇప్పటి వరకు 20 సినిమాల్లో నటించానని, పలు సీరియళ్లలో నటిస్తున్నానని చెప్పారు. నాగార్జున రాజన్న, ఒక్కడున్నాడు సిమాల్లో మంచి పాత్రల్లో నటించినట్టు చెప్పారు. సీరియల్స్ విషయానికి వస్తే తాను నటించిన స్వాతి చినుకులు, అగ్నిపూలు, బొమ్మరిల్లు ప్రస్తుతం ప్రసారం అవుతున్నాయన్నారు. సీరియల్స్ల్లో తాను చేస్తున్న అమ్మపాత్రలు అంటే చాలా ఇష్టం అని అన్నారు. తన కుమార్తె ప్రియాంక ద్వారా టీవీ రంగంలోకి వచ్చినట్టు తెలిపారు. అమ్మ పాత్రల్లో మరింత బాగా నటించి మంచి నటిగా పేరు తెచ్చుకోవాలన్నదే తన లక్ష్యం అన్నారు. -
ఆకట్టుకున్న సీతారామరాజు నాటికం
భీమవరం (ప్రకాశం చౌక్) : స్థానిక మావుళ్లమ్మ అమ్మవారి 53 వార్షికోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద ఏర్పాటు చేస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు భక్తులను అకట్టుకుంటున్నాయి. గురువారం ఆలయం వద్ద సూర్యోదయ ఆర్ట్స్ భీమవరం వారు ప్రదర్శించిన విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు చారిత్రాత్మక నాటిక భక్తులను విశేషంగా అలరించింది. అలాగే నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ ఎం.అర్జునరావు హైదరాబాద్ వారు ప్రదర్శించిన సీతారామ కల్యాణం భక్తి నాటకం అకట్టుకుంది. -
బీ–న్యూ లో సంక్రాంతి ఆఫర్లు
భీమవరం : నవ్యాంధ్రలోని అన్ని వర్గాల ప్రజలకు సెల్ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు బీ–న్యూ సంస్థ ..సంక్రాంతి సందర్భంగా వినూత్న ఆçఫర్లను అందిస్తోందని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై.డి.బాలాజీ చౌదరి తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తరువాత డిజిటల్ ఆర్థికæ లావాదేవీలు పెరిగాయన్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరకే బీ–న్యూ సంస్థ వినియోగదారులకు అందుబాటులోకి ఉంచిందన్నారు. సంక్రాంతి సందర్భంగా విభిన్న మోడళ్ల సెల ఫోన్లపై ఆఫర్లు అందిస్తున్నామన్నారు. రూ.699 డ్యూయల్ సిమ్ ఫోన్ కొనుగోలుపై లంచ్ బాక్స్, రూ.999 ఫోన్‌పై ట్రావెల్æ బ్యాగ్, రూ.1,399 ఫోన్‌తో పాటు టేబుల్‌ఫ్యాన్, రూ.4,499 4జీ స్మార్ట్‌ఫోన్‌కు జియో సిమ్, రూ. 9,999 స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఎల్æఈడీ టీవీ, రూ.16,999 జియోనీ ఫో¯న్పై ల్యాప్‌టాప్, రూ.19,999కే యాపిల్ 5 ఎస్, రూ.15,499కే లెనోవో కే-6 నోట్‌బుక్‌తో పాటు బ్లూటూత్ హెడ్ సెట్æ ఉచితంగా ఇస్తున్నామన్నారు. ఎంపిక చేసిన కొన్ని మోడళ్లపై బ్లూ టూ™త్, పవర్ బ్యాంక్, హెడ్ సెట్æ, మెమరీ కార్డులను ఉచితంగా పొందవచ్చన్నారు. వివిధ మోడళ్ల ఫోన్లకు బజాజ్ ఫైనాన్స్ ద్వారా నెలవారీ వాయిదా పద్ధతిలో చెల్లించే సదుపాయం ఉందన్నారు. అన్ని రకాల డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపు చేసే సదుపాయం ఉందన్నారు. -
ఘనంగా మావుళ్లమ్మ ఉత్సవాలు ప్రారంభం
భీమవరం(ప్రకాశం చౌక్) : మావుళ్లమ్మ అమ్మవారి 53 వార్షికోత్సవ ఉత్సవాలు శుక్రవారం కలశస్థాపన పూజతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 6.30 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి దర్శన భాగ్యం భక్తులకు కల్పించారు. స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి గ్రామోత్సవంను ప్రారంభించారు. పురవీధుల్లో గ్రామోత్సవం కనుల పండువగా సాగింది. సుమారు 30 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయ ప్రధాన అర్చకులు కొడమంచిలి సుబ్రహ్మణ్యం, కొడమంచిలి కొప్పేశ్వరరావు, మద్దిరాల మల్లికార్జునరావు అమ్మవారికి కుంకుమపూజలు నిర్వహించారు. నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రవీంద్రనా«థ్‌రెడ్డి మావుళ్లమ్మ అమ్మవారిని శుక్రవారం కమలాపురం ఎమెల్యే ఎల్ రవీంద్రనాథ్‌రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో నేడు మావుళ్లమ్మ అమ్మవారి 53 వార్షికోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం 4 గంటలకు బల్లిపాడుకు చెందిన ఆధ్మాత్మిక వేత్త ఆకుల ఆప్పారావు ఉపన్యాసం, 5 గంటలకు తాడేపల్లి గూడెంకు చెందిన యడమిల్లి బ్రదర్స్ బుర్రకథ, రాత్రి 8 గంటలకు తణుకుకు చెందిన గీతామందిరి వారి దేవీ కటాక్షం నాటకం ప్రదర్శితం కానున్నాయి. -
మావుళ్లమ్మ సన్నిధిలో తెలంగాణ ఐజీ
భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం మావుళ్లమ్మవారిని గురువరం తెలంగాణ ఐజీ వీసీ సజ్జనార్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. నరసాపురం డీఎస్పీ పూర్ణచంద్రరావు, వన్‌టాన్ సీఐ వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్ఐ శ్యామ్‌సుందర్, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు. సోమేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు పంచారామక్షేత్రం గునుపూడి ఉమాసోమేశ్వర జనార్దనస్వామి ఆలయాన్ని ఐజీ సజ్జనార్ సందర్శించారు. స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. -
అథ్లెటిక్స్ చాంప్ ‘డీఎన్నార్’
భీమవరం టౌన్: ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ను భీమవరం డీఎన్నార్ కళాశాల విద్యార్థులు కైవసం చేసుకున్నారని ప్రిన్సిపాల్ పి.రామకృష్ణంరాజు గురువారం తెలిపారు. ఉభయగోదావరి జిల్లాల్లోని 46 కళాశాలలకు చెందిన విద్యార్థులు పోటీల్లో తలపడగా డీఎన్నార్ విద్యార్థులు సత్తాచాటారని చెప్పారు. ఆరేళ్ల తర్వాత డీఎన్నార్ కళాశాల చాంపియన్‌షిప్‌ను సాధించిందన్నారు. పీడీ నర్సింహరాజు మాట్లాడుతూ తమ విద్యార్థులు 800 మీటర్లు, 1,500 మీటర్లు పరుగు, 4 టు 400 రిలేలో మొదటి స్థానాలు, 1,500 మీటర్లు డిస్కస్‌త్రో, 400 మీటర్ల పరుగు, హాల్ట్ మార్తాన్, జావెలిన్‌త్రో 4 టు 100 రిలేలో ద్వితీయ స్థానాలు, 200 మీటర్లు, 1,000 మీటర్ల పరుగులో మూడో స్థానంలో నిలిచి మొత్తంగా 42 పాయింట్లతో చాంపియన్‌షిప్ సాధించిందన్నారు. తమ విద్యార్థులు ఎన్.జగన్మోహనరావు, కె.దుర్గానటరాజ్, సీహెచ్ రవీంద్రబాబు, డి.వెంకటేష్ వచ్చేనెల 11వ తేదీ నుంచి తమళినాడు కోయంబత్తూరులో జరిగే ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ అథ్లెటిక్స్ మీట్లో పాల్గొంటారని చెప్పారు. వీరిని కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు జీవీ నర్సింహరాజు, కార్యదర్శి జి.సత్యనారాయణరాజు అభినందించారు. -
వడ్డీ లేని పంట రుణాలివ్వాలి
భీమవరం : దాళ్వా పంటకు కౌలు రైతులందరికీ వడ్డీలేని పంట రుణాలు ఇవ్వాలంటూ ఈ నెల 8న గుంటూరులోని వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ చెప్పారు. శుక్రవారం భీమవరం సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన కౌలు రైతుల సంఘం జిల్లా నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు కారణంగా రైతులకు గ్రామాల్లో అప్పు పుట్టే పరిస్థితి లేదని, సార్వా పంట ధాన్యాన్ని అమ్మినా డబ్బులు చేతికిరావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కౌలు చెల్లింపు, ఎరువులు, పురుగుమందులు అరువుపై తెచ్చిన వ్యాపారులకు డబ్బు చెల్లించలేక రైతులు అయోమయానికి గురవుతున్నారని చెప్పారు. రైతులను ఆదుకోవడానికి వడ్డీ లేని పంట రుణాలు అందించాలని, లేకుంటే బ్యాంకుల వద్ద ఆందోళన చేపడతామని శ్రీనివాస్ హెచ్చరించారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జుత్తిగ నర్సింహమూర్తి, ఎ¯ŒS.రామాంజనేయులు, కె.శ్రీనివాస్, జి.రామారావు, ధనికొండ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కబడ్డీ పోటీల విజేతలు వీరే
భీమవరం టౌన్ : ఆదికవి నన్నయ యూనివర్శిటీ అంతర కళాశాలల మహిళల కబడ్డీ పోటీల్లో గోపన్నపాలెం వ్యాయామ కళాశాల జట్టు విజేతగా నిలిచింది. భీమవరం కేజీఆర్ఎల్ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలు శనివారం ముగిశాయి. రెండో స్థానంలో ఏలూరు సెయింట్ థెరిస్సా మహిళా కళాశాల, మూడో స్థానంలో తణుకు ఎస్కెఆస్ఎడీ మహిళా కళాశాల, నాలుగో స్థానంలో పెనుగొండ ఎస్వీకేపీ డాక్టర్ కేఎస్ రాజు కళాశాల జట్లు నిలిచాయి. ఉభయ గోదావరి జిల్లాలోని 10 కళాశాలల నుంచి 120 మంది విద్యార్థులు కబడ్డీ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు, బహుమతులను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాడెంట్ మెంటే రామ్మనోహర్, పీజీ కోర్సుల డైరక్టర్ డాక్టర్ మెంటే లక్ష్మణరావు, ప్రిన్సిపాల్ మెంటే రాణి రత్నకుమారి అందచేశారు. కార్యక్రమంలో నన్నయ్య యూనివర్శిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ బోర్డ్ డైరెక్టర్ ఎ.సత్యనారాయణ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ ఆదిరెడ్డి సత్యనారాయణ, పీడీ టి.నర్సింహమూర్తి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మెంటే త్రినాథ్, డాక్టర్ కె.గౌతమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.