11 నుంచి అంతర్జాతీయ ఆక్వా సదస్సు
11 నుంచి అంతర్జాతీయ ఆక్వా సదస్సు
Published Thu, Jan 26 2017 12:10 AM | Last Updated on Tue, Sep 5 2017 2:06 AM
భీమవరం: వచ్చేనెల 11 నుంచి మూడు రోజులపాటు భీమవరం విష్ణు కళాశాల ఆవరణలో ఆక్వాకల్చర్‌పై అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు కేరళ యూని వర్సిటీ వీసీ డాక్టర్ మోహనకుమార్ నా యర్ చెప్పారు. భీమవరంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర మత్స్యశాఖ, వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, ఆసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ సం యుక్త ఆధ్వర్యంలో సదస్సు నిర్వహి స్తామ న్నారు. సీఎం చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉందని, కేంద్ర మంత్రులు రాధామోహన్‌సింగ్, ఎం.వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారన్నారు. ఆక్వాకల్చర్‌కు చెందిన 50 మంది సైంటిస్టులు, సుమారు 1,200 మంది రైతులు, విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. సదస్సులో ఒకరోజు ప్రధానంగా చైనాలో జరిగే చేపల పెంపకంపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. నెల్లూరు ఫిషరీస్ కళాశాలకు చెందిన డాక్టర్ కె.గోపాలరావు మాట్లాడుతూ చేపల పెంపకంలో కొత్త సాగు విధానాలను వివరిస్తామన్నారు. ఆనంద గ్రూప్ చైర్మన్ ఉద్దరాజు ఆనందరాజు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కొరమీను, పండుగప్ప చేపల హేచరీలు ఏర్పాటుచేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. చేపలను ఎగుమతి చే సేందుకు అనువైన టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఆక్వా సదస్సు బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
Advertisement