ఈ–మోటో పోటీలకు సర్వం సిద్ధం
Published Fri, Sep 23 2016 12:27 AM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM
భీమవరం: మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విద్యార్థుల సమన్వయంతో భీమవరం శ్రీ విష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం నుంచి 26వ తేదీ వరకు జాతీయస్థాయి విష్ణు ఈ–మోటో ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్న ట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ జి.శ్రీనివాసరావు చెప్పారు. పోటీల ద్వారా ఈ–బైక్ రూపకల్పన, తయారీ అంశాలపై యువ ఇంజినీర్లకు అవగాహన పెరుగుతుందన్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రికల్ బైక్‌ల వాడకం, వాటి సామర్థ్యాన్ని తెలియజేయడమే పోటీల ముఖ్య ఉద్దేశమన్నారు. పోటీలకు 13 రాష్ట్రాల నుంచి 45 బృందాలు దరఖాస్తు చేసుకోగా ప్రాథమిక పరిశీలన అనంతరం 25 బృందాలు ఎంపికయ్యాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల కు చెందిన బృందాలు పోటీల్లో పాల్గొంటాయన్నారు. పోటీల్లో టెక్నికల్, డిజైన్, బ్రేక్, యాక్సిలరేషన్, వాన, ఆటోక్రాస్ పరీక్షలు నిర్వహిం చి అర్హత సాధించిన బృందాలు పోటీల్లో పాల్గొంటాయని చెప్పారు. ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాసరాజు, సమన్వయకర్తలు మనోనీత్‌కుమార్, సాగర్, వికాస్‌కుమార్ పోటీలను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు.
Advertisement