from today
-
ఆక్వాపార్క్‌పై వైఎస్సార్ సీపీ సమరశంఖం
నరసాపురం : తుందుర్రు గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది. మొగల్తూరు ఆక్వా ఫ్యాక్టరీలో విషవాయువు కారణంగా ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయినా తుందుర్రు ఆక్వా పార్క్ నిర్మాణంపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంపై ప్రతిపక్ష పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షల మంది ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపించే ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకోవడానికి వైఎస్సార్ సీపీ నరసాపురం నియోజకవర్గ కన్వీనర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి ప్రసాదరాజు నిరవధిక నిరాహారదీక్షకు సిద్ధమయ్యారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో ఆయన నిరాహారదీక్షకు కూర్చోనున్నారు. ఫుడ్‌పార్కు పనులు నిలిపివేయాలంటూ ఏడాదిన్నరగా ప్రజలు, ప్రతిపక్షపార్టీలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఫ్యాక్టరీ విషయంలో ముందుకెళుతోంది. ప్రభుత్వ విధానాన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న వైఎస్సార్ సీపీ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటూ వస్తోంది. తాము పరిశ్రమలను వ్యతిరేకించడంలేదని, తుందుర్రు ఆక్వాపార్కును సముద్రతీర ప్రాంతంలో నిర్మించాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోంది. విషప్రచారం చేస్తున్న ప్రభుత్వం తాము పరిశ్రమలకు వ్యతిరేకం కాదని వైఎస్సార్ సీపీ స్పష్టంగా చెబుతున్నా ప్రభుత్వం ప్రతిపక్షంపై విషప్రచారం చేస్తోంది. తుందురు ఫ్యాక్టరీ వద్దంటూ అభివృద్ధిని అడ్డుకుంటుందని ప్రభుత్వం విమర్శలకు దిగుతోంది. ఈ తరుణంలో మొగల్తూరు నల్లంవారితోటలోని ఆనందా ప్రా¯Œ్స ప్రాసెసింగ్ యూనిట్లో గత నెల 30న జరిగిన ఘోర ప్రమాదంతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఈ చిన్న ఫ్యాక్టరీలో విషవాయువు కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మొగల్తూరు ఫ్యాక్టరీ కంటే తుందుర్రు ఫుడ్ పార్క్ 10 రెట్లకు పైగా పెద్దది కావడం గమనార్హం. అంత పెద్ద ఫ్యాక్టరీలో ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ప్రాంతంలో తీవ్ర ప్రాణనష్టం తప్పదు. మొగల్తూరు ఫ్యాక్టరీ యాజమాన్యమే తుందుర్రు ఆక్వాపార్క్‌ను నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో తుందుర్రు ఫుడ్ పార్క్‌ను సముద్ర తీర ప్రాంతానికి తరలించాలి్సందేనని ఈ నెల 1న ముదునూరి ప్రసాదరాజు ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు. 6వ తేదీలోగా దీనిపై ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ముందుగా ప్రకటించిన విధంగా శుక్రవారం నుంచి నిరవధిక దీక్షకు కూర్చోనున్నారు. ఆళ్ల నాని సహా పలువురు నేతల రాక ముదునూరి చేపట్టిన దీక్షకు సంఘీభావంగా శుక్రవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నానితో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కన్వీనర్లు, ముఖ్యనేతలు హాజరవుతున్నారు. పలువురు రాష్ట్రస్థాయి నేతలు కూడా వస్తున్నారు. గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్కు నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులతో పాటు, బాధిత గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. -
నేటి నుంచి ‘చైల్డ్ లైన్ సే దోస్తీ వీక్’
అనంతపురం సప్తగిరి సర్కిల్ : బాలల సంరక్షణకు సమాజ సహకారం ఎంతైనా అవసరమని, ఈ విషయంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు సోమవారం నుంచి ఏడు రోజుల పాటు ‘చైల్డ్ లైన్ సే దోస్తీ వీక్’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు 1098 జిల్లా సహాయ కార్యకర్త కృష్ణమాచారి తెలిపారు. అనంతపురంలోని పెన్షనర్ల భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాలల హక్కుల పరిరక్షణలో భాగంగా విద్యాలయాల్లో అవగాహన కల్పించేందుకు యానిమేష¯ŒS చిత్రాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. పిల్లల హక్కులు, వారిపై జరుగుతున్న అత్యాచారాలపై ఎంపిక చేసిన పాఠశాలల్లో వ్యాసరచన పోటీలు ఉంటాయన్నారు. చివరి రోజు బాలల హక్కుల దినోత్సవం, వారి హక్కుల గురించి ప్లకార్డుల ప్రదర్శన ఉంటుందన్నారు. సమావేశంలో 1098 జిల్లా కో–ఆర్డినేటర్ ఆదినారాయణ, టీం సభ్యులు అశోక్‌కుమార్, రామాంజినేయులు, కమలాక్షి, నాగవేణి, నారాయణస్వామి పాల్గొన్నారు. -
నేటి నుంచి ఎంపీ నార్త్ కెనాల్‌కు నీరు విడుదల
అనంతపురం సెంట్రల్ : మిడ్‌పెన్నార్ నార్త్ కెనాల్‌కు బుధవారం నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు హెచ్చెల్సీ ఎస్ఈ టి.వి. శేషగిరిరావు తెలిపారు. ప్రస్తుతం ఆయకట్టు కింద సాగులో ఉన్న పంటలను కాపాడడంతో పాటు భూగర్భ జలాలు పెంచెందుకు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు. అందువల్ల రైతులు కొత్తగా పంటలు వేయకూడదని సూచించారు. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చే స్తామని వివరించారు. -
నేటి నుంచి ర్యాటిఫికేషన్ ఇంటర్వ్యూలు
జేఎన్టీయూ: జేఎన్టీయూ అనంతపురం అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు ర్యాటిఫికేషన్ ఇం టర్వూ్యలు సోమవారం నుంచి నిర్వహించనున్నారు. ఈసీఈ, ఈఈఈ, సీఎస్ఈ, ఎంఈ, ఎంబీఏ, సివిల్ ఇంజినీరింగ్ బ్రాం చులకు సంబంధించి 26 ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకులు హాజరు కానున్నారు. 5న ఇంటర్వ్యూలు ముగియనున్నాయి. -
నేటి నుంచి జమలాపురంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
ఉత్సవాలకు ఆలయం ముస్తాబు భక్తుల వసతుల కల్పనకు ఏర్పాట్లు పూర్తి జమలాపురం(ఎర్రుపాలెం): తెలంగాణ తిరుపతి జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అక్టోబర్ 1నుంచి 11వరకు నిర్వహించే శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆలయాన్ని రంగులతో ముస్తాబు చేశారు. 1న సాయంత్రం 4.40 గంటలకు తీర్థపు బిందెను తెచ్చిన అనంతరం కలశ స్థాపన పూజలతో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈఓ ఏవీ రమణ మూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస శర్మలు తెలిపారు. 2న ఆలయ ప్రాంగణంలోని గోశాలలో గోమాతకు ప్రత్యేక పూజలు, ఉదయం 10గంటలకు శ్రీవేంకటేశ్వర స్వామివారికి లక్ష పుష్పార్చన నిర్వహిస్తామన్నారు. 3న ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో శ్రీసోమేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, 4న ప్రసన్నాంజనేయ స్వామివారికి ప్రత్యేక ఆకు పూజ, 5న లక్ష తులసి అర్చన, 6న చండీహోమం, 7న శ్రీ అలివేలు మంగ, శ్రీ పద్మావతి అమ్మవార్లకు సామూహిక కుంకుమార్చన, హోమాలు వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 8న సరస్వతీ పూజలు, 9న దుర్గా పూజలు, 10న చండీహోమం, పూర్ణాహుతి, 11న విజయ దశమి పర్వదినం సందర్బంగా దసరా వేడుకలు, శమీ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. శ్రీదేవి శరన్నవ రాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన వసతులు కల్పించినట్లు ఆలయ ఈఓ రమణమూర్తి తెలిపారు. ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చి శ్రీ స్వామివారి, అమ్మవార్లను దర్శించుకోవాలన్నారు. -
ఈ–మోటో పోటీలకు సర్వం సిద్ధం
భీమవరం: మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విద్యార్థుల సమన్వయంతో భీమవరం శ్రీ విష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం నుంచి 26వ తేదీ వరకు జాతీయస్థాయి విష్ణు ఈ–మోటో ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్న ట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ జి.శ్రీనివాసరావు చెప్పారు. పోటీల ద్వారా ఈ–బైక్ రూపకల్పన, తయారీ అంశాలపై యువ ఇంజినీర్లకు అవగాహన పెరుగుతుందన్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రికల్ బైక్‌ల వాడకం, వాటి సామర్థ్యాన్ని తెలియజేయడమే పోటీల ముఖ్య ఉద్దేశమన్నారు. పోటీలకు 13 రాష్ట్రాల నుంచి 45 బృందాలు దరఖాస్తు చేసుకోగా ప్రాథమిక పరిశీలన అనంతరం 25 బృందాలు ఎంపికయ్యాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల కు చెందిన బృందాలు పోటీల్లో పాల్గొంటాయన్నారు. పోటీల్లో టెక్నికల్, డిజైన్, బ్రేక్, యాక్సిలరేషన్, వాన, ఆటోక్రాస్ పరీక్షలు నిర్వహిం చి అర్హత సాధించిన బృందాలు పోటీల్లో పాల్గొంటాయని చెప్పారు. ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాసరాజు, సమన్వయకర్తలు మనోనీత్‌కుమార్, సాగర్, వికాస్కుమార్ పోటీలను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. -
నేటి నుంచి జియో పూర్తి సేవలు
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అనుబంధ సంస్థ రిలయన్స్ జియో 4జీ సేవలు నేటి(సోమవారం) నుంచి దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా 4జీ సదుపాయం ఉన్న ఏ స్మార్ట్‌ఫోన్‌లోనైనా జియో సిమ్‌ను ఉపయోగించుకునే అవకాశం యూజర్లకు కల్పిస్తోంది. వాయిస్ కాలింగ్‌ను పూర్తిగా ఉచితంగా అందించడంతోపాటు అత్యంత చౌక రేట్లకు డేటా ప్లాన్లను తాజాగా ఆర్ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీ కంపెనీ ఏజీఎంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 5 నుంచి ప్రివ్యూ సేవలు, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పూర్తిస్థాయి వాణిజ్య సేవలు ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. సాధ్యమైనంత వేగంగా 10 కోట్ల మంది సబ్స్క్రయిబర్లను జియో నెట్‌వర్క్‌లోకి తీసుకురావడమే తమ లక్ష్యమని కూడా ఆయన చెప్పారు. కాగా, ప్రస్తుతం జియో సిమ్‌లు రిలయన్స్ డిజిటల్ స్టోర్స్‌లోనే లభ్యమవుతుండగా.. నేటి నుంచి మల్టీ బ్రాండ్ అవుట్లెట్లు, మొబైల్ ఫోన్ షాప్‌లలోనూ తీసుకోవచ్చనేది సంబంధిత వర్గాల సమాచారం. ప్రివ్యూ సేవల్లో భాగంగా డిసెంబర్ 31 వరకూ జియో వాయిస్, డేటా, యాప్స్ ఇతరత్రా సేవలన్నీ పూర్తిగా ఉచితంగా పొందొచ్చు. ఆతర్వాత 4జీ డేటా రూ.149 నుంచి రూ.4,999 వరకూ 10 రకాల ప్లాన్లు యూజర్లకు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు అన్లిమిటెడ్ వాయిస్, ఎస్ఎంఎస్, ఏడాది పాటు యాప్స్ సబ్స్క్రిప్షన్ వంటివి జియో ఆఫర్ చేస్తోంది. -
నేటి అర్ధరాత్రి నుంచి ఈహెచ్ఎస్ సేవలు బంద్
ఎంజీఎం : నెట్వర్క్ ఆస్పత్రుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ పథకం ద్వారా అందించే సేవలను శనివారం అర్ధరాత్రి నుంచి నిలిపివేస్తున్నట్లు ఆస్పత్రుల యాజమాన్యాలు ఒక ప్రకటనలో తెలిపాయి. గత ఏడాది జూలై నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి అందాల్సిన బకాయిలు రాకపోవడంతో తాము ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు సేవలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
నేటి నుంచి మోదీ విదేశీ పర్యటన
-
నేటి నుంచి నామినేషన్ల ఉపసంహరణ
-
నేటి నుంచి శ్రీవారికి సుప్రభాతం
-
సర్వీస్ ట్యాక్స్ పెంపు నేటినుంచి అమలు
మూడు నెలల క్రితం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో పేర్కొన్నట్లు జూన్ 1 (సోమవారం) నుంచి సర్వీస్ ట్యాక్స్ (సేవల పన్ను) 14 శాతం పెరగనుంది. గతంలో ఇది 12.36 శాతంగా ఉండేది. రైలు, విమానం టికెట్లు, బ్యాంకు సేవలు, క్రెడిట్ కార్డులు, బీమా, ప్రకటనలు, టూర్, ఈవెంట్ మేనేజర్స్ తదితరాలు 14 శాతం సేవల పన్ను కిందికి వస్తుండటంతో ఆయా సర్వీసులు ఇక మరింత ప్రియం కానున్నాయి. రైలులో ఏసీ బోగీలో ప్రాయాణం, సరుకు రవాణాల రుసుము నేటి నుంచి 0.5 శాతం పెరిగాయి. ఇప్పటివరకు టికెట్ విలువలో 30 శాతంపై 12.36 శాతం సేవపన్ను వసూలు చేస్తోన్న సంగతి తెలిసిందే. నికరంగా 3.7 శాతం ఉన్న పన్ను.. ఇకపై 4.2 శాతానికి పెరగనుంది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను సజావుగా అమలుచేసేందుకు వీలుగా సేవల పన్ను పెంచక తప్పదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. కొన్నిరకాల సేవలపై 2 శాతం స్వచ్ఛ భారత్ సెస్ ను కూడా విధించనున్న ప్రభుత్వం.. ఆ నిర్ణయం ఎప్పటినుంచి అమలవుతుందో పేర్కొనలేదు.