డీఎన్నార్ కళాశాలలో మోడల్ ఆన్‌లైన్ ఎంసెట్ పరీక్ష
డీఎన్నార్ కళాశాలలో మోడల్ ఆన్‌లైన్ ఎంసెట్ పరీక్ష
Published Sun, Apr 9 2017 10:44 PM | Last Updated on Tue, Sep 5 2017 8:22 AM
భీమవరం:పోటీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు మోడల్ పరీక్షలు ఎంతగానో ఉపకరిస్తాయని భీమవరం డీఎన్నార్ కళాశాల పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకటనర్సింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) అన్నారు. కళాశాలలో ఆదివారం నిర్వహించిన మోడల్ ఆన్‌లైన్ ఎంసెట్ పరీక్షను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. ఎంసెట్ పరీక్షకు నూతనంగా ఆన్‌లైన్ విధానం చేపడుతున్నందున దానిపై విద్యార్థులకు అవగాహన కల్పించుట కోసం తమ కళాశాలలో ఆన్‌లైన్ ఎంసెట్ నమూనా పరీక్ష ఏర్పాటు చేశారన్నారు. ఈ పరీక్షలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వంద మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షా ఫలితాలను విద్యార్థుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియచేస్తామని ప్రిన్సిపాల్ యు.రంగరాజు చెప్పారు. అలాగే ఈ నెల 14వ తేదిన మరోసారి ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తామని మోడల్ ఎంసెట్ కోఆర్డినేటర్ డీడీడీ సూరిబాబు చెప్పారు. దీనికిగాను ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు.ఈ పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందిస్తామన్నారు.
Advertisement
Advertisement