in dnr collage
-
డీఎన్నార్ కళాశాలలో మోడల్ ఆన్లైన్ ఎంసెట్ పరీక్ష
భీమవరం:పోటీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు మోడల్ పరీక్షలు ఎంతగానో ఉపకరిస్తాయని భీమవరం డీఎన్నార్ కళాశాల పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకటనర్సింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) అన్నారు. కళాశాలలో ఆదివారం నిర్వహించిన మోడల్ ఆన్లైన్ ఎంసెట్ పరీక్షను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. ఎంసెట్ పరీక్షకు నూతనంగా ఆన్లైన్ విధానం చేపడుతున్నందున దానిపై విద్యార్థులకు అవగాహన కల్పించుట కోసం తమ కళాశాలలో ఆన్లైన్ ఎంసెట్ నమూనా పరీక్ష ఏర్పాటు చేశారన్నారు. ఈ పరీక్షలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వంద మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షా ఫలితాలను విద్యార్థుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా తెలియచేస్తామని ప్రిన్సిపాల్ యు.రంగరాజు చెప్పారు. అలాగే ఈ నెల 14వ తేదిన మరోసారి ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తామని మోడల్ ఎంసెట్ కోఆర్డినేటర్ డీడీడీ సూరిబాబు చెప్పారు. దీనికిగాను ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు.ఈ పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందిస్తామన్నారు. -
ముగిసిన బ్యాడ్మింటన్ పోటీలు
భీమవరం టౌన్ : స్థానిక డీఎన్నార్ కళాశాల ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన జేఎ¯Œæటీయూకే అంతర కళాశాలల బ్యాడ్మింటన్ పోటీలు గురువారం ముగిశాయి. బాలుర విభాగంలో పి.సుమంత్(వీఆర్ఎస్ వైఎన్నార్ కళాశాల, ఒంగోలు), జీవీ సురేంద్ర (కైట్, కోరంగి), పి.రాహుల్ కిశోర్ (వీఈడీ, విజయనగరం), డి.అనిల్‌కుమార్ (డీఎన్నార్, భీమవరం), బీహెచ్ వీఎస్‌ఎస్‌ఎన్ ప్రవీణ్(పొట్టి శ్రీరాములు, విజయవాడ) ఎస్కే కార్తిముల్‌్బ(కైట్, కోరంగి), జి.అనిల్ కుమార్ (సెయింట్ ఆన్స్, చీరాల) గెలుపొందినట్టు నిర్వాహకులు ప్రకటించారు. టోర్నమెంట్‌కు జెఎన్టీయూకే అసిస్టెంట్ ప్రొఫెసర్ డి.శ్యామ్‌కుమార్ నాని ప్రసాద్(విజయవాడ), చంద్రశేఖర్ (వైజాగ్) సెలక్షన్ కమిటీ మెంబర్లుగా వ్యవహరించారు. విజేతలను డీఎన్నార్ అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకట నర్సింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు, సభ్యులు అభినందించారు.