జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలు
జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలు
Published Mon, Feb 6 2017 12:03 AM | Last Updated on Tue, Sep 5 2017 2:58 AM
భీమవరం: క్లబ్‌లంటే కేవలం ప్లేయింగ్ కార్డ్స్ ఆడుకునే ప్రదేశమనే అపోహ ప్రజల్లో ఉందని అయితే భీమవరం కాస్మో పాటిలిన్ క్లబ్‌లో నిర్వహిస్తున్న క్రీడలు, సామాజిక సేవాకార్యక్రమాలు అలాంటి అపోహలు తొలగిస్తున్నాయని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) నండూరి సాంబశివరావు అన్నారు. భీమవరం కాస్మోక్లబ్ ఆధ్వర్యంలో కాస్మోపాలిటన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం అల్లూరి రవితేజ మెమోరియల్ నేషనల్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భీమవరం క్లబ్‌లలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు. ప్రముఖులను కలుసుకుని సరికొత్త ఆలోచనలు పంచుకోడానికి, సేద తీరడానికి క్లబ్‌లు వేదికగా ఉపయోగపడతాయన్నారు. భీమవరం పట్టణానికి దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు రావడానికి ఇక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమాలే కారణమని సాంబశివరావు పేర్కొన్నారు. ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ భీమవరం లాంటి చిన్న పట్టణంలో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) మాట్లాడుతూ కాస్మోక్లబ్‌లో నిర్వహిస్తున్న పలు ప్రజాహిత కార్యక్రమాలు ఆదర్శనీయమని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్పీ భాస్కర్ భూషన్, క్లబ్ గౌరవాధ్యక్షుడు యు.కృష్ణప్రసాద్, అల్లూరి పద్మనాభరాజు, కార్యదర్శి తటవర్తి కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు.
సాంబశివరావుకు సత్కారం
డీజీపీ సాంబశివరావును గజమాల, దుశ్శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. అనంతరం టెన్నిస్ కోర్టులో క్రీడాకారులను పరిచయం చేసుకున్న సాంబశివరావు బెలూన్లు వదిలి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాస్మోక్లబ్ వేదికపై ఉద్దరాజు ధర్మరాజు, అల్లూరి రవితేజ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
హోరాహోరీగా క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు
భీమవరం: భీమవరం కాస్మోక్లబ్ ఆధ్వర్యంలో కాస్మో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న అల్లూరి రవితేజ మెమోరియల్ నేషనల్ ర్యాకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు ఆదివారం హోరాహోరీగా సాగాయి. మహిళల ఫైనల్ రౌండ్‌లో సారా యాదవ్ (మధ్యప్రదేశ్), సృష్టిదాస్ (మహారాష్ట్ర)పై 6–4, 6–4 స్కోరుతో విజయం సాధించగా, అద్రిజా బిస్వాస్ (వెస్ ్టబెంగాల్) ప్రగతి ప్రసాద్ (కర్నాటక)పై 6–0, 6–1, ఆనంద్ అల్మాస్ (ఒడిశా) ఎస్.ప్రవీణ (తమిళనాడు)పై 6–2, 6–4, ఆర్.ప్రియాంక (మధ్యప్రదేశ్) గొట్టిపాటి శ్రీలక్ష్మి (కర్నాటక)పై 6–0, 6–2, అక్షయ సురేష్ (తమిళనాడు) రేష్న గణపతి (తమిళనాడు)పై 6–2, 6–0, అవిష్క గుప్త (జార్ఖండ్), ఎన్.పూర్వారెడ్డి (తెలంగాణ)పై 6–0, 6–2, తటవర్తి శ్రేయ (ఏపీ) ఎస్.సమీరపై 6–0, 6–0, షేక్ హుమేరా (తెలంగాణ) రెహానా తస్కీన్ (తెలంగాణ)పై 6–0, 6–0 తేడాతో విజయం సాధించారు.
పురుషుల విభాగం ఫైనల్ రౌండ్‌లో పి.జయేష్ (మహారాష్ట్ర), ఎస్.దుర్గ (తెలంగాణ)పై 7–5, 6–4 తేడాతో విజయం సాధించగా, షేక్ ఓస్మా (ఏపీ) రాజేంద్రప్రసాద్‌రాయ్ (ఉత్తరప్రసాద్)పై 6–4, 6–1 తేడాతో, త్యేజో ఓజెస్ (తమిళనాడు) అంకం కృష్ణతేజ (తెలంగాణ)పై 4–6, 7–5, 6–4 తేడాతో, చిలకలపూడి తరుణ్ (ఏపీ) ఓజెస్ రాతే (హరియాణ)పై 6–2, 6–0 తేడాతో, చిన్మయ్ ప్రధా¯ŒS (ఒడిశా) యాష్‌వర్దన్(హరియాణ)పై 6–4, 6–2 తేడాతో, గంటా సాయికార్తీక్ (తెలంగాణ) ఒమిందర్ బాయ్‌సోయా (హరియాణ)పై 6–3, 6–4 తేడాతో, ఇషాన్ హుస్సేన్ (తమిళనాడు) అజయ్ పృథ్వీ (తెలంగాణ)పై 6–4, 7–5 తేడాతో విజయం సాధించారు.
Advertisement