యంత్రం.. నైపుణ్య మంత్రం
యంత్రం.. నైపుణ్య మంత్రం
Published Sun, Jan 29 2017 12:16 AM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM
భీమవరం : భీమవరం విష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న గోకార్టింగ్ చాంపియ న్‌షిప్–2017 పోటీల్లో భాగంగా రెండో రోజు శనివారం వాహనాలకు సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. దేశం లోని ఆరు రాష్ట్రాల నుంచి సుమారు 700 మంది విద్యార్థులు 31 బృందాలుగా ఏర్పడి నూతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన వాహనాలను ప్రదర్శించారు. సాంకేతిక పరీక్షల రెండో భాగంలో వాహనం దృఢత్వం, బరువుకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొనే వాహనాలు 120 కిలోల బరువు మించి ఉండకూడదనే నిబంధన విధించారు. రై న్ టెస్ట్ పరీక్షలో వాహనాలను ప్రత్యేకంగా నిర్మించిన వాటర్ చాంబర్‌లో నిర్ణీత సమయం ఉంచి ఇంజి న్‌తో పనిచేయించి పని తీరును, ఎలక్ట్రికల్ వైరింగ్‌ను పరిశీ లించారు. బ్రేక్ టెస్ట్‌లో వాహనం నిర్ణీత వేగం పుంజుకున్న తర్వాత బ్రేక్‌ను ఉపయోగించి వాహనాన్ని ఆరుమీటర్ల లోపు నిలపాల్సి ఉంటుంది. పరీక్షలను నిపుణులైన న్యాయనిర్ణేతలతో నిర్వహించినట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ జి.శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాసరాజు చెప్పారు. పోటీలకు హాజరైన పలువురు విద్యార్థులు వాహనాల పనితీరును వివరించారు.
కళాశాల ప్రోత్సాహంతోనే..
మా కళాశాల ఫ్యాకల్టీ ప్రోత్సాహం ఎంతగానో ఉంది. వాహనాల తయారీకి అవసరమైన సదుపాయాలు కల్పించారు. దీంతో సొంతంగా వాహనాలు తయారు చేసి పోటీల్లో పాల్గొంటున్నాం. ప్రస్తుతం మేం ఈ వాహనానికి వాడిన ఇన్నోవేష న్స్ ను మరింత అభివృద్ధి చేసి పటిష్టంగా తయారు చేయడానికి అవకాశం కలిగింది.
– విష్ణు ఉమె న్స్ ఇంజినీరింగ్ కళాశాల, భీమవరం
సాంప్రదాయేతర వనరులతో.. ఇటువంటి పోటీల ద్వారా సాంప్రదాయేతర ఇంధన వనరులను ఉపయోగించి వాహనాలు తయారు చేయడం తెలుసుకున్నాం. నిర్ణీత సమయంలో తక్కువ వ్యయంతో రక్షణాత్మకంగా ఉండే విధంగా వాహనాన్ని తయారు చేశాం. ఈ పోటీల్లో మా వాహనం ప్రథమ బహుమతి గెలుచుకుంటుందని ఆశిస్తున్నాం. – ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కాలేజ్, విజయనగరం
భవిష్యత్‌లో మరిన్ని పోటీలకు.. వాహన తయారీకి మా కళాశాలలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ప్రత్యేకంగా వసతిని ఏర్పాటు చేసింది. ఫ్యాకల్టీస్ పూర్తి సహాయ సహకారాలు అందించడం వల్లే వాహనం తయారు చేశాం. భవిష్యత్‌లో మరిన్ని పోటీలకు సన్నద్ధం కావడానికి వాహనాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి పోటీలు దోహదపడతాయి. – జగన్నాథం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఒడిసా
ప్రయోగాలే మిన్న
ఇటువంటి పోటీల్లో పాల్గొనడం ద్వారా పారిశ్రామికంగా నూతన టెక్నాలజీతో సరికొత్త వాహనాలు తయారు చేయడానికి అనుభవం పొందవచ్చు. మేం తయారు చేసిన వాహనం విమానాశ్రయాలు, మిలట్రీలో వాహనాలు తరలించడానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాం. – ఇందూర్ ఇనిస్టిట్యూట్‌ఆఫ్ టెక్నాలజీ, సిద్ధిపేట
Advertisement