vishnu collage
-
ఉత్సాహంగా గోకార్టింగ్ పోటీలు
భీమవరం: భీమవరం విష్ణు ఇంజినీరింగ్ మహిళా కళాశాలలో మూడురోజులుగా నిర్వహిస్తున్న గోకార్టింగ్ చాంపియన్‌షిప్–2017 పోటీల్లో భాగంగా ఆదివారం విద్యార్థులు రూపొందించిన వాహనాలకు వివిధ రకాల సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. పోటీలను భీమవరం మున్సిపల్ కమిషనర్ సీహెచ్ నాగనర్సింహరావు జెండా ఊపి ప్రారంభించి మాట్లాడుతూ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు వ్యయప్రయాలకోర్చి పాల్గొనడం అభినందనీయమన్నారు. స్కిడ్ పాడ్ పరీక్షల్లో భాగంగా వాహనాలను ఎనిమిది అంకె ఆకారంలో ప్రత్యేకంగా నిర్మించిన దారిలో నిర్ణీత సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకుండా నడిపి విజయం సా«ధించాలి. ఆటోక్రాస్ టెస్ట్‌లో క్లిష్టమైన మలుపులు గల రహదారిలో తక్కువ సమయంలో పూర్తిచేసి విజయం సాధించాల్సి ఉంటుంది. గరిష్ట వేగ నిర్ధారణ పరీక్షల్లో వాహనాలు నిర్దేశించిన 50 కిలోమీటర్ల దూరాన్ని ఎంత తక్కువ సమయంలో పూర్తిచేస్తాయో నిర్ధారిస్తారు. తక్కువ సమయంలో పూర్తి చేసిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. వాహనాల పరీక్షల అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి. ప్రిన్సిపాల్ డాక్టర్ జి.శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాసరాజు పాల్గొన్నారు. -
యంత్రం.. నైపుణ్య మంత్రం
భీమవరం : భీమవరం విష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న గోకార్టింగ్ చాంపియ న్షిప్–2017 పోటీల్లో భాగంగా రెండో రోజు శనివారం వాహనాలకు సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. దేశం లోని ఆరు రాష్ట్రాల నుంచి సుమారు 700 మంది విద్యార్థులు 31 బృందాలుగా ఏర్పడి నూతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన వాహనాలను ప్రదర్శించారు. సాంకేతిక పరీక్షల రెండో భాగంలో వాహనం దృఢత్వం, బరువుకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొనే వాహనాలు 120 కిలోల బరువు మించి ఉండకూడదనే నిబంధన విధించారు. రై న్ టెస్ట్ పరీక్షలో వాహనాలను ప్రత్యేకంగా నిర్మించిన వాటర్ చాంబర్లో నిర్ణీత సమయం ఉంచి ఇంజి న్‌తో పనిచేయించి పని తీరును, ఎలక్ట్రికల్ వైరింగ్‌ను పరిశీ లించారు. బ్రేక్ టెస్ట్‌లో వాహనం నిర్ణీత వేగం పుంజుకున్న తర్వాత బ్రేక్‌ను ఉపయోగించి వాహనాన్ని ఆరుమీటర్ల లోపు నిలపాల్సి ఉంటుంది. పరీక్షలను నిపుణులైన న్యాయనిర్ణేతలతో నిర్వహించినట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ జి.శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాసరాజు చెప్పారు. పోటీలకు హాజరైన పలువురు విద్యార్థులు వాహనాల పనితీరును వివరించారు. కళాశాల ప్రోత్సాహంతోనే.. మా కళాశాల ఫ్యాకల్టీ ప్రోత్సాహం ఎంతగానో ఉంది. వాహనాల తయారీకి అవసరమైన సదుపాయాలు కల్పించారు. దీంతో సొంతంగా వాహనాలు తయారు చేసి పోటీల్లో పాల్గొంటున్నాం. ప్రస్తుతం మేం ఈ వాహనానికి వాడిన ఇన్నోవేష న్స్ ను మరింత అభివృద్ధి చేసి పటిష్టంగా తయారు చేయడానికి అవకాశం కలిగింది. – విష్ణు ఉమె న్స్ ఇంజినీరింగ్ కళాశాల, భీమవరం సాంప్రదాయేతర వనరులతో.. ఇటువంటి పోటీల ద్వారా సాంప్రదాయేతర ఇంధన వనరులను ఉపయోగించి వాహనాలు తయారు చేయడం తెలుసుకున్నాం. నిర్ణీత సమయంలో తక్కువ వ్యయంతో రక్షణాత్మకంగా ఉండే విధంగా వాహనాన్ని తయారు చేశాం. ఈ పోటీల్లో మా వాహనం ప్రథమ బహుమతి గెలుచుకుంటుందని ఆశిస్తున్నాం. – ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కాలేజ్, విజయనగరం భవిష్యత్‌లో మరిన్ని పోటీలకు.. వాహన తయారీకి మా కళాశాలలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రత్యేకంగా వసతిని ఏర్పాటు చేసింది. ఫ్యాకల్టీస్ పూర్తి సహాయ సహకారాలు అందించడం వల్లే వాహనం తయారు చేశాం. భవిష్యత్‌లో మరిన్ని పోటీలకు సన్నద్ధం కావడానికి వాహనాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి పోటీలు దోహదపడతాయి. – జగన్నాథం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఒడిసా ప్రయోగాలే మిన్న ఇటువంటి పోటీల్లో పాల్గొనడం ద్వారా పారిశ్రామికంగా నూతన టెక్నాలజీతో సరికొత్త వాహనాలు తయారు చేయడానికి అనుభవం పొందవచ్చు. మేం తయారు చేసిన వాహనం విమానాశ్రయాలు, మిలట్రీలో వాహనాలు తరలించడానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాం. – ఇందూర్ ఇనిస్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీ, సిద్ధిపేట -
గోకార్టింగ్ చాంపియ న్ షిప్ పోటీలు ప్రారంభం
భీమవరం : భీమవరం శ్రీవిష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయస్థాయి గోకార్టింగ్ చాంపియ న్ షిప్ పోటీలు శుక్రవారం ఎంతో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ భాస్కర్ భూషణ్ మాట్లాడుతూ నేటితరం విద్యార్థులు కేవలం తరగతి గదుల్లో విద్యాభ్యాసానికే పరిమితం కాకుండా వివిధ నూతన ఆవిష్కరణలకు నాంది పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శ్రీవిష్ణు ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు తమలో దాగి ఉన్న ప్రతిభాపాటవాలను ప్రదర్శించడానికి ఈ పోటీలు వేదిగా నిలుస్తాయననారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాసరాజు మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ పోటీలలో ఆరు రాష్ట్రాల నుంచి 31 జట్లు పాల్గొంటున్నాయన్నారు. అనంతరం ఎస్పీని దుశ్శాలువాతో సత్కరించారు. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఆరిఫ్, విష్ణు విద్యా సంస్థల డైరెక్టర్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
11 నుంచి అంతర్జాతీయ ఆక్వా సదస్సు
భీమవరం: వచ్చేనెల 11 నుంచి మూడు రోజులపాటు భీమవరం విష్ణు కళాశాల ఆవరణలో ఆక్వాకల్చర్‌పై అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు కేరళ యూని వర్సిటీ వీసీ డాక్టర్ మోహనకుమార్ నా యర్ చెప్పారు. భీమవరంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర మత్స్యశాఖ, వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, ఆసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ సం యుక్త ఆధ్వర్యంలో సదస్సు నిర్వహి స్తామ న్నారు. సీఎం చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉందని, కేంద్ర మంత్రులు రాధామోహన్‌సింగ్, ఎం.వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారన్నారు. ఆక్వాకల్చర్‌కు చెందిన 50 మంది సైంటిస్టులు, సుమారు 1,200 మంది రైతులు, విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. సదస్సులో ఒకరోజు ప్రధానంగా చైనాలో జరిగే చేపల పెంపకంపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. నెల్లూరు ఫిషరీస్ కళాశాలకు చెందిన డాక్టర్ కె.గోపాలరావు మాట్లాడుతూ చేపల పెంపకంలో కొత్త సాగు విధానాలను వివరిస్తామన్నారు. ఆనంద గ్రూప్ చైర్మన్ ఉద్దరాజు ఆనందరాజు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కొరమీను, పండుగప్ప చేపల హేచరీలు ఏర్పాటుచేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. చేపలను ఎగుమతి చే సేందుకు అనువైన టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఆక్వా సదస్సు బ్రోచర్‌ను ఆవిష్కరించారు. -
ఈ–మోటో పోటీలకు సర్వం సిద్ధం
భీమవరం: మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విద్యార్థుల సమన్వయంతో భీమవరం శ్రీ విష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం నుంచి 26వ తేదీ వరకు జాతీయస్థాయి విష్ణు ఈ–మోటో ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్న ట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ జి.శ్రీనివాసరావు చెప్పారు. పోటీల ద్వారా ఈ–బైక్ రూపకల్పన, తయారీ అంశాలపై యువ ఇంజినీర్లకు అవగాహన పెరుగుతుందన్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రికల్ బైక్‌ల వాడకం, వాటి సామర్థ్యాన్ని తెలియజేయడమే పోటీల ముఖ్య ఉద్దేశమన్నారు. పోటీలకు 13 రాష్ట్రాల నుంచి 45 బృందాలు దరఖాస్తు చేసుకోగా ప్రాథమిక పరిశీలన అనంతరం 25 బృందాలు ఎంపికయ్యాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల కు చెందిన బృందాలు పోటీల్లో పాల్గొంటాయన్నారు. పోటీల్లో టెక్నికల్, డిజైన్, బ్రేక్, యాక్సిలరేషన్, వాన, ఆటోక్రాస్ పరీక్షలు నిర్వహిం చి అర్హత సాధించిన బృందాలు పోటీల్లో పాల్గొంటాయని చెప్పారు. ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాసరాజు, సమన్వయకర్తలు మనోనీత్‌కుమార్, సాగర్, వికాస్కుమార్ పోటీలను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు.