ముగిసిన టెన్నిస్ టోర్నీ
ముగిసిన టెన్నిస్ టోర్నీ
Published Sat, Feb 11 2017 12:26 AM | Last Updated on Tue, Sep 5 2017 3:23 AM
భీమవరం : క్రీడల నిర్వహణపై వివిధ సంస్థలు చూపిస్తున్న ఆసక్తి ప్రశంసనీయమని ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేష న్ సీఈవో, గౌరవ ప్రధాన కార్యదర్శి హెచ్.చటర్జీ పేర్కొన్నారు. భీమవరం కాస్మోపాలిట న్ క్లబ్, స్పోర్ట్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అల్లూరి రవితేజ మెమోరియల్ నేషనల్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. ఫైనల్స్‌లో క్రీడాకారులు నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రదానోత్సవ సభ జరిగింది. సభలో ముఖ్యఅతిథిగా చటర్జీ మాట్లాడారు. దాతల సహకారంతో మరిన్ని క్రీడలు నిర్వహించాలని ఆకాంక్షించారు. పోటీలకు అల్లూరి పద్మరాజు అందించిన సహకారం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు రామరాజు, తట వర్తి కృష్ణబాబు, గౌరవాధ్యక్షుడు రుద్రరాజు కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చటర్జీని క్లబ్ ఆధ్వర్యంలో సత్కరించారు. విజేతలకు బహుమతులు ఇచ్చారు.
విజేతలు వీరే :
పురుషుల సింగిల్స్ ఫైనల్స్ : కునాల్ విజ్రాని (మహారాష్ట్ర)పై దక్షిణేశ్వర్ సురేష్ (తమిళనాడు) 6–1, 7–5 తేడాతో గెలుపొందారు.
డబుల్స్ : కునాల్ విజ్రాని (మహరాష్ట్ర), యాష్ యాదవ్ (మధ్యప్రదేశ్) జోడిపై అనురాగ్ నెన్వాని (ఢిల్లీ), రోహ న్ భాటియా (మహారాష్ట్ర) జోడి 6–2, 6–3 స్కోరుతో గెలిచింది.
మహిళల సింగిల్స్ ఫైనల్స్ : నిత్యరాజ్‌బాబు (తమిళనాడు)పై ఈటె మెహతా (గుజరాత్) 6–1, 6–1 తేడాతో గెలిచింది.
డబుల్స్ : సాయిదీప్య (తెలంగాణ), యమలపల్లి సహజ (ఏపీ) జోడిపై ఈటె మెహతా (గుజరా త్), వి.సౌమ్య (గుజరాత్) జోడి 6–0, 6–2 తేడాతో గెలిచింది.
Advertisement