విష్ణు ఫార్మసీలో ఇండో–గల్ఫ్‌ అంతర్జాతీయ సదస్సు | in vishnu pharmacy indo-gulf internationl conference | Sakshi
Sakshi News home page

విష్ణు ఫార్మసీలో ఇండో–గల్ఫ్‌ అంతర్జాతీయ సదస్సు

Published Fri, Sep 2 2016 10:49 PM | Last Updated on Fri, Nov 9 2018 4:45 PM

విష్ణు ఫార్మసీలో ఇండో–గల్ఫ్‌ అంతర్జాతీయ సదస్సు - Sakshi

విష్ణు ఫార్మసీలో ఇండో–గల్ఫ్‌ అంతర్జాతీయ సదస్సు

భీమవరం : భీమవరం విష్ణు ఫార్మసీ కళాశాల, అసోసియేషన్‌ ఆఫ్‌ ఫార్మసీ ప్రొఫెషనల్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం రెండవ ఇండో–గల్ఫ్‌ అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యవక్తగా హాజరైన సౌదీ అరేబియా జజాన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ భక్తిభూషణ్‌ బారిక్‌ నానోటెక్నాలజీ బేసెడ్‌ గ్రడ్‌ డెవివరి సిస్టమ్స్‌ అనే అంశంపై ప్రసంగించారు. అనంతరం సదస్సుకు హాజరైన వివిధ కళాశాలల విద్యార్థులకు సర్టిఫికెట్స్‌ పంపిణీ చేశారు. ఈ సదస్సులో హైదరాబాద్‌ మహేశ్వర కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మురళీధర్, ఎపీపీ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ చెన్నుపాటి సురేష్‌ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విష్ణు ఫార్మసీ కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ డి.బసవరాజు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె. ప్రసాద్, అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ ప్రసాదరాజు పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement