ఘనంగా మావుళ్లమ్మ ఉత్సవాలు ప్రారంభం
ఘనంగా మావుళ్లమ్మ ఉత్సవాలు ప్రారంభం
Published Fri, Jan 13 2017 11:59 PM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM
భీమవరం(ప్రకాశం చౌక్) : మావుళ్లమ్మ అమ్మవారి 53 వార్షికోత్సవ ఉత్సవాలు శుక్రవారం కలశస్థాపన పూజతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 6.30 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి దర్శన భాగ్యం భక్తులకు కల్పించారు. స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి గ్రామోత్సవంను ప్రారంభించారు. పురవీధుల్లో గ్రామోత్సవం కనుల పండువగా సాగింది. సుమారు 30 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయ ప్రధాన అర్చకులు కొడమంచిలి సుబ్రహ్మణ్యం, కొడమంచిలి కొప్పేశ్వరరావు, మద్దిరాల మల్లికార్జునరావు అమ్మవారికి కుంకుమపూజలు నిర్వహించారు. నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రవీంద్రనా«థ్‌రెడ్డి
మావుళ్లమ్మ అమ్మవారిని శుక్రవారం కమలాపురం ఎమెల్యే ఎల్ రవీంద్రనాథ్‌రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉత్సవాల్లో నేడు
మావుళ్లమ్మ అమ్మవారి 53 వార్షికోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం 4 గంటలకు బల్లిపాడుకు చెందిన ఆధ్మాత్మిక వేత్త ఆకుల ఆప్పారావు ఉపన్యాసం, 5 గంటలకు తాడేపల్లి గూడెంకు చెందిన యడమిల్లి బ్రదర్స్ బుర్రకథ, రాత్రి 8 గంటలకు తణుకుకు చెందిన గీతామందిరి వారి దేవీ కటాక్షం నాటకం ప్రదర్శితం కానున్నాయి.
Advertisement