నేడు సబ్‌ జూనియర్స్‌ చెస్‌ పోటీలు | form today sub junior chess games | Sakshi
Sakshi News home page

నేడు సబ్‌ జూనియర్స్‌ చెస్‌ పోటీలు

Published Wed, Oct 26 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM

form today sub junior chess games

భీమవరం: జిల్లా చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అనసూయ చెస్‌ అకాడమీ నేతృత్వంలో భీమవరం విశ్వకవి పబ్లిక్‌ స్కూల్‌లో బుధవారం జిల్లా సబ్‌జూనియర్స్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహించనున్నట్టు అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు తోట భోగయ్య తెలిపారు. ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని, పోటీల్లో పాల్గొనే వారు 2001 తర్వాత పుట్టిన వారై ఉండాలన్నారు. మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు వచ్చేనెల 4 నుంచి కడపలో జరిగే రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని తోట భోగయ్య చెప్పారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement