ఎయిమ్స్‌కు ‘యల్లా ప్రగడ’ పేరు పెట్టాలి
ఎయిమ్స్‌కు ‘యల్లా ప్రగడ’ పేరు పెట్టాలి
Published Thu, Mar 23 2017 12:03 AM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM
భీమవరం : రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఎయిమ్స్ భవనానికి వైద్యశాస్త్ర పరిశోధకుడు డాక్టర్ యల్లా ప్రగడ సుబ్బారావు పేరు పెట్టాలని భీమవరం కేజీఆర్‌ఎల్ కళాశాల కోశాధికారి గన్నాబత్తుల వెంకట శ్రీనివాస్ ఆదికవి నన్నయ యూనివర్శిటీ సభ్యుడు డాక్టర్ ఎస్.సాయి దుర్గాప్రసాద్ కోరారు. ప్లేగు వ్యాధికి మందును కనిపెట్టిన డాక్టర్ సుబ్బారావు పేరును ఎయిమ్స్ భవనానికి పెట్టడం సముచితమన్నారు. సుబ్బారావు నామకరణ సాధన సమితి కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ప్రపంచంలోని అనేక దేశాల్లో వివిధ భవనాలకు సుబ్బారావు పేరుపెట్టి గౌరవిస్తుంటే స్వరాష్ట్రంలో ఆయన పేరు పెట్టకపోవడం బాధాకరమన్నారు. ఎయిమ్స్ భవనానికి సుబ్బారావు పేరుపెట్టాలని కలెక్టర్ కె.భాస్కర్‌కు వినతిపత్రం అందించినట్టు చెప్పారు. డాక్టర్ సుబ్బారావు భీమవరంలో జన్మించినా ఆయన విగ్రహం లేకపోవడం దురదృష్టకరమని, భీమవరం ప్రభుత్వాసుపత్రిలో విగ్రహాన్ని నెలకొల్పాలని కోరినట్టు తెలిపారు. ప్రిన్సిపాల్ ఆర్.సూర్యనారాయణరాజు, వైస్ ప్రిన్సిపాల్ మెంటే త్రినాథ్, తోట వరప్రసాద్, జవ్వాది ప్రభాకర్, కట్రెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.
Advertisement
Advertisement