29న ఘంటసాల కాంస్య విగ్రహావిష్కరణ | on 29 ghantasala bronze statue | Sakshi
Sakshi News home page

29న ఘంటసాల కాంస్య విగ్రహావిష్కరణ

Published Sat, Mar 25 2017 9:44 PM | Last Updated on Tue, Sep 5 2017 7:04 AM

29న ఘంటసాల కాంస్య విగ్రహావిష్కరణ

29న ఘంటసాల కాంస్య విగ్రహావిష్కరణ

 భీమవరం: భీమవరం  కాస్మోపాలిటన్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాటన్‌పార్క్‌లో ఈనెల 29న పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని  ఆవిష్కరిస్తున్నట్టు   విగ్రహావిష్కరణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కొత్తపల్లి కోదండరామ గాంధీరాజు, వల్లూరు వెంకట రాధాకృష్ణమూర్తి తెలిపారు. శనివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జేపీ రోడ్డులో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని  ఆకాశవాణి రిటైర్డ్‌ సంచాలకుడు మంగళగిరి ఆదిత్యప్రసాద్‌ చేతులు మీదుగా ఆవిష్కరించనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా  ఏఎస్‌ఆర్‌ నగర్‌లోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో ఏర్పాటు చేసే సభా కార్యక్రమంలో  ఎంపీలు తోట సీతారామలక్ష్మి, గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు), ఎమ్మెల్సీ కంతేటి సత్యనాయణరాజు  తదితరులు పాల్గొంటారన్నారు. సాయంత్రం 6  గంటలకు ఘంటసాల సంగీత సుధావర్షిణి  సంగీత కార్యక్రమం, 30 సాయంత్రం ఆరు గంటలకు రాష్ట్రపతి అవార్డు బాలశ్రీ  గ్రహీత లలితా సింధూరి నాట్య ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. దానికి సంబంధించిన విగ్రహావిష్కరణ ఫ్లెక్సీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాతపాటి సీతారామరాజు, చెరుకువాడ రంగసాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement