కబడ్డీ పోటీల విజేతలు వీరే
కబడ్డీ పోటీల విజేతలు వీరే
Published Sun, Nov 27 2016 1:00 AM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM
భీమవరం టౌన్ : ఆదికవి నన్నయ యూనివర్శిటీ అంతర కళాశాలల మహిళల కబడ్డీ పోటీల్లో గోపన్నపాలెం వ్యాయామ కళాశాల జట్టు విజేతగా నిలిచింది. భీమవరం కేజీఆర్‌ఎల్ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలు శనివారం ముగిశాయి. రెండో స్థానంలో ఏలూరు సెయింట్ థెరిస్సా మహిళా కళాశాల, మూడో స్థానంలో తణుకు ఎస్‌కెఆస్‌ఎడీ మహిళా కళాశాల, నాలుగో స్థానంలో పెనుగొండ ఎస్వీకేపీ డాక్టర్ కేఎస్ రాజు కళాశాల జట్లు నిలిచాయి. ఉభయ గోదావరి జిల్లాలోని 10 కళాశాలల నుంచి 120 మంది విద్యార్థులు కబడ్డీ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు, బహుమతులను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాడెంట్ మెంటే రామ్‌మనోహర్, పీజీ కోర్సుల డైరక్టర్ డాక్టర్ మెంటే లక్ష్మణరావు, ప్రిన్సిపాల్ మెంటే రాణి రత్నకుమారి అందచేశారు. కార్యక్రమంలో నన్నయ్య యూనివర్శిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ బోర్డ్ డైరెక్టర్ ఎ.సత్యనారాయణ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ ఆదిరెడ్డి సత్యనారాయణ, పీడీ టి.నర్సింహమూర్తి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మెంటే త్రినాథ్, డాక్టర్ కె.గౌతమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement