అథ్లెటిక్స్ చాంప్ ‘డీఎన్నార్’
అథ్లెటిక్స్ చాంప్ ‘డీఎన్నార్’
Published Thu, Dec 22 2016 9:53 PM | Last Updated on Mon, Sep 4 2017 11:22 PM
భీమవరం టౌన్: ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ను భీమవరం డీఎన్నార్ కళాశాల విద్యార్థులు కైవసం చేసుకున్నారని ప్రిన్సిపాల్ పి.రామకృష్ణంరాజు గురువారం తెలిపారు. ఉభయగోదావరి జిల్లాల్లోని 46 కళాశాలలకు చెందిన విద్యార్థులు పోటీల్లో తలపడగా డీఎన్నార్ విద్యార్థులు సత్తాచాటారని చెప్పారు. ఆరేళ్ల తర్వాత డీఎన్నార్ కళాశాల చాంపియన్‌షిప్‌ను సాధించిందన్నారు. పీడీ నర్సింహరాజు మాట్లాడుతూ తమ విద్యార్థులు 800 మీటర్లు, 1,500 మీటర్లు పరుగు, 4 టు 400 రిలేలో మొదటి స్థానాలు, 1,500 మీటర్లు డిస్కస్‌త్రో, 400 మీటర్ల పరుగు, హాల్ట్ మార్తాన్, జావెలిన్‌త్రో 4 టు 100 రిలేలో ద్వితీయ స్థానాలు, 200 మీటర్లు, 1,000 మీటర్ల పరుగులో మూడో స్థానంలో నిలిచి మొత్తంగా 42 పాయింట్లతో చాంపియన్‌షిప్ సాధించిందన్నారు. తమ విద్యార్థులు ఎన్.జగన్మోహనరావు, కె.దుర్గానటరాజ్, సీహెచ్ రవీంద్రబాబు, డి.వెంకటేష్ వచ్చేనెల 11వ తేదీ నుంచి తమళినాడు కోయంబత్తూరులో జరిగే ఆల్‌ఇండియా ఇంటర్ యూనివర్సిటీ అథ్లెటిక్స్ మీట్‌లో పాల్గొంటారని చెప్పారు. వీరిని కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు జీవీ నర్సింహరాజు, కార్యదర్శి జి.సత్యనారాయణరాజు అభినందించారు.
Advertisement
Advertisement