వడ్డీ లేని పంట రుణాలివ్వాలి
వడ్డీ లేని పంట రుణాలివ్వాలి
Published Sat, Dec 3 2016 12:41 AM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM
భీమవరం : దాళ్వా పంటకు కౌలు రైతులందరికీ వడ్డీలేని పంట రుణాలు ఇవ్వాలంటూ ఈ నెల 8న గుంటూరులోని వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ చెప్పారు. శుక్రవారం భీమవరం సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన కౌలు రైతుల సంఘం జిల్లా నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు కారణంగా రైతులకు గ్రామాల్లో అప్పు పుట్టే పరిస్థితి లేదని, సార్వా పంట ధాన్యాన్ని అమ్మినా డబ్బులు చేతికిరావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కౌలు చెల్లింపు, ఎరువులు, పురుగుమందులు అరువుపై తెచ్చిన వ్యాపారులకు డబ్బు చెల్లించలేక రైతులు అయోమయానికి గురవుతున్నారని చెప్పారు. రైతులను ఆదుకోవడానికి వడ్డీ లేని పంట రుణాలు అందించాలని, లేకుంటే బ్యాంకుల వద్ద ఆందోళన చేపడతామని శ్రీనివాస్ హెచ్చరించారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జుత్తిగ నర్సింహమూర్తి, ఎ¯ŒS.రామాంజనేయులు, కె.శ్రీనివాస్, జి.రామారావు, ధనికొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement