‘ ఎస్‌ఆర్‌కేఆర్’లో ఐ హబ్
‘ఎస్‌ఆర్‌కేఆర్’లో ఐ హబ్
Published Wed, Nov 16 2016 10:52 PM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM
భీమవరం: ఇంజినీరింగ్ విద్యార్థులు పరిశోధన, శిక్షణ, సాంకేతిక పరిజ్ఞాన్నాన్ని అందిపుచ్చుకునేందుకు తమ కళాశాలలో రూ.10 కోట్ల వ్యయంతో ఐ హబ్‌ను ఏర్పాటు చేసినట్టు భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల అధ్యక్షుడు సాగి ప్రసాద్‌రాజు అన్నారు. బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన ఐ హబ్‌ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సుమారు 500 మంది విద్యార్థులు ఒకే సమయంలో నూతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి ఐ హబ్ దోహదపడుతుందన్నారు. ఇంటర్నెట్, మొబైల్ వైఫై సౌకర్యంతోపాటు విద్యార్థులు నూతన ఉత్పత్తులు తయారు చేయడానికి సహకారం అందించేందుకు బ్యాంకులు, సాఫ్ట్‌వేర్ సంస్థలు, క్యాంటిన్‌వంటి అన్ని సదుపాయాలు హబ్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.పార్థసారథివర్మ మాట్లాడారు. అనంతరం కళాశాలలో రూ.15 కోట్లతో నిర్మించనున్న బాలికల హాస్టల్ భవనానికి అధ్యక్షుడు ప్రసాద్‌రాజు శంకుస్థాపన చేశారు. కళాశాల చైర్మన్ గోకరాజు మురళీరంగరాజు, డైరెక్టర్ ఎస్‌వీరంగరాజు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీఎస్‌ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Advertisement