engineering collage
-
సగం కోర్సు ఇంటర్న్ షిప్ లే
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కోర్సుల స్వరూపాన్ని పూర్తిగా మార్చేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు మొదలు పెట్టింది. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్ద డమే లక్ష్యంగా సిలబస్‌లో మార్పులు చేయాలని సంకల్పించింది. డిగ్రీ కోర్సుల్లోనూ మార్పులు చేయాలని నిర్ణయించింది. ఈ దిశగా కొత్త సిలబస్ రూపకల్పనకు ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేసింది. కొత్త సిలబస్‌లో ఫీల్డ్ అనుభవానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.తరగతి గది బోధనను 50 శాతానికే పరిమితం చేసి.. మిగతా 50 శాతం కోర్సు కాలమంతా ఇంటర్స్‌షిప్‌లకు కేటాయించాలని భావిస్తున్నారు. ఇంటర్న్‌షిప్‌లు కూడా పేరెన్నికగన్న సంస్థల్లోనే చేయాలన్న నిబంధన తీసుకురాబోతున్నట్లు అధికారులు తెలిపారు. సామాజిక అవగాహనకు కూడా కొత్త సిల బస్‌లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సైన్స్ కోర్సు ల్లో సీట్లు పెరుగుతుండటంతో ఐటీ కంపెనీల్లో వృత్తి పరమైన అనుభవానికి పెద్ద పీట వేయా లని భావిస్తున్నారు.ఆయా సంస్థలతో కాలేజీ లు అవగాహన ఒప్పందాలు చేసుకోవడం తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా బోధనా ప్రణాళికను సమగ్రంగా మార్చాలని నిర్ణయించినట్టు ఉన్నత విద్యా మండలి వర్గాలు తెలిపాయి. పోటీకి తగ్గట్టుగా డిగ్రీ కోర్సులుసంప్రదాయ డిగ్రీ కోర్సుల స్థానంలో కాంబినేషన్ కోర్సులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సిలబస్‌పై అధ్యయనానికి నియమించిన కమిటీలకు మండలి సూచించింది. ప్రస్తుతం డిగ్రీ ఆర్ట్స్ కోర్సుల్లో 30 శాతం, సైన్స్ కోర్సుల్లో 20 శాతం సిలబస్‌ను మార్చాలని నిర్ణయించారు. ఏటా అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా కొత్త సిలబస్‌ను పరిచయం చేయాలని భావిస్తున్నారు. జాతీయ పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని సిలబస్‌ను రూపొందిస్తున్నారు.డిగ్రీ విద్యార్థులకు క్షేత్రస్థాయి పర్యటనలు (ఫీల్డ్ వర్క్స్), ప్రాజెక్టు రిపోర్టులు రూపొందించడాన్ని తప్పనిసరి చేయాలని మండలి నిర్ణయించింది. ఆర్థిక రంగంలో ఈ–కామర్స్ శరవేగంగా దూసుకుపోతుండటంతో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. వీటిని గుర్తించి, నివారణ మార్గాలను కనుగొనేటమే లక్ష్యంగా డిగ్రీ బీకాం కోర్సుల్లో సైబర్ నేరాలపై పాఠ్యాంశాలను చేర్చబోతున్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రాణించే విధంగా డిగ్రీ కోర్సులు రూపొందించాలని భావిస్తున్నారు.మార్చి నాటికి సిలబస్‌పై సమగ్ర అధ్యయనంఇంజనీరింగ్, డిగ్రీ కోర్సుల సిలబస్ మార్పు ను వేగంగా పూర్తి చేయా లని కమిటీలను కోరాం. 2025 మార్చి నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్‌ను అమల్లోకి తేవాలన్నది లక్ష్యం. – ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్. -
కాలేజీలు తగ్గినా.. సీట్లు పైకే
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య తగ్గుతున్నా, సీట్లు మాత్రం ఏటా పెరుగుతున్నాయి. ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థుల సంఖ్యా ఏయేటికాయేడు పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో 2020–21లో 186 ఇంజనీరింగ్ కాలేజీలుంటే, 2024–25 విద్యా సంవత్సరానికి అవి 174కు తగ్గాయి. 20–21లో 98,988 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, ఈ ఏడాది సీట్లు 1,12,069కు పెరిగాయి. ఇంజనీరింగ్‌లో చేరేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ, ఇది ఈ సంవత్సరం లక్ష దాటింది. చిన్న పట్టణాల్లో కాలేజీలు క్రమంగా మూతపడుతున్నాయి. ఇక్కడ విద్యార్థులు చేరేందుకు ఇష్టపడటం లేదని ప్రవేశాల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విద్యార్థులు ఇంటర్ నుంచే హైదరాబాద్‌లో చదివేందుకు వస్తున్నారు. ఇదే ట్రెండ్ ఇంజనీరింగ్‌లోనూ కొనసాగుతోంది. దీంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీల్లో ఎక్కువగా సీట్లు భర్తీ అవుతున్నాయి.ఎక్కువ మంది ఇంజనీరింగ్ వైపే..రాష్ట్రవ్యాప్తంగా ఏటా 4.5 లక్షల మంది ఇంటర్మిడియట్ పాసవుతున్నారు. ఇందులో 75 శాతంపైగా ఎంపీసీ గ్రూపు విద్యార్థులే ఉంటున్నారు. వీరిలో లక్ష మంది వరకూ రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరుతున్నారు. ఎన్ఐటీలు, అడ్వాన్స్డ్ ద్వారా ఐఐటీల్లో చేరేవాళ్లు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర సంస్థల్లో చేరేవాళ్లు మరో 10 వేల మంది వరకూ ఉంటారని అంచనా. ఈ ఏడాది ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగానికి 2.40 లక్షల మంది దరఖాస్తు చేశారు. వీరిలో 1.80 లక్షల మంది పాసయ్యారు. కనీ్వనర్ కోటా కింద 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు కలిపి మొత్తం 86,943 సీట్లు ఉన్నాయి. వీటిలో 75,107 సీట్లు భర్తీ చేశారు. దాదాపు 31 వేల బీ కేటగిరీ సీట్లు భర్తీ అయ్యాయి. రాష్ట్రంలోని ఇప్పటికే ఉన్న ప్రైవేటు వర్సిటీలు, కొత్తగా మంజూరైన మరో ఐదు ప్రైవేటు వర్సిటీలు, డీమ్డ్ వర్సిటీల క్యాంపస్‌లలో కనీసం 10 వేల మంది చేరినట్టు అంచనా. బాసర ఆర్జీయూకేటీ, హెచ్‌సీయూలోని సీఆర్‌రావు విద్యా సంస్థతో పాటు తమిçళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని డీమ్డ్ వర్సిటీల్లో మరో 10 వేల మంది చేరే వీలుంది. ఎందుకీ క్రేజ్ఇంజనీరింగ్ తర్వాత ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడాలని విద్యార్థులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను బట్టి చూస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో చేరే వారే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, దాని అనుబంధ కోర్సుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలో ఐటీ కంపెనీల నియామకాలన్నీ కంప్యూటర్ కోర్సులు చేసినవారితోనే జరుగుతున్నాయి. డిగ్రీ, ఇతర కోర్సుల్లోనూ కంప్యూటర్ అనుబంధం ఉంటే తప్ప ఐటీ ఉద్యోగాలకు వెళ్లలేని పరిస్థితి ఉంది.దీంతో విద్యార్థుల డిమాండ్‌కు తగ్గట్టుగా ప్రైవేటు కాలేజీలు కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో సీట్లు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాగా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీల్లోనే మంచి ఫ్యాకల్టీ ఉంటుందని విద్యార్థులు భావిస్తున్నారు. దీంతో పాటు అన్ని బ్రాంచీల్లోనూ మార్పు అనివార్యమవుతోంది. ఐటీ ఆధారిత బోధన విధానం తప్పనిసరి అవుతోంది. అందుకే విద్యార్థుల్లో ఇంజనీరింగ్‌పై క్రేజ్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ ప్రభావమే మార్చేస్తోంది ఇంజనీరింగ్‌లోని అన్ని బ్రాంచీల్లోనూ ఆరి్టఫిíÙయల్ టెక్నా లజీ దూసుకొస్తోంది. కంప్యూటర్ సైన్స్‌లోనే కాదు... సివిల్, మెకానికల్, ఎలక్రి్టకల్‌లోనూ ఏఐ లేకుండా ముందుకెళ్లడం కష్టం. అందుకే బ్రాంచీ ఏదైనా ఏఐ మీద విద్యార్థులు దృష్టి పెడుతున్నారు. ఇంజనీరింగ్ చేస్తూనే... ఏఐ నేర్చుకుంటున్నారు. దీనిద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. అందుకే ఎక్కువ మంది ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. – డాక్టర్ కె.విజయకుమార్‌రెడ్డి రెక్టార్, జేఎన్టీయూహెచ్ -
జాతి గర్వించే ఇంజినీర్ (ఫొటోలు)
-
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల కలకలం
-
కంప్యూటర్ కోర్సులు ‘కేక’
సాక్షి, హైదరాబాద్: తొలి విడత ఇంజనీరింగ్ సీట్లను ఆదివారం కేటాయించారు. మొత్తం 82,666 సీట్లు అందుబాటులో ఉంటే, 70,665 భర్తీ చేసినట్టు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ వెల్లడించారు. 12,001 సీట్లు ఇంకా ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. ఈ ఏడాది ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో 1,56,879 మంది అర్హత సాధించారు. 76,821 మంది ఎంసెట్ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. 75,708 మంది వివిధ కాలేజీలు, వివిధ బ్రాంచీలకు ఆప్షన్లు ఇచ్చారు. మొత్తం 50,44,634 ఆప్షన్లు అందాయి. 5,043 మంది ఎలాంటి ఆప్షన్లు ఇవ్వలేదు. 5,576 మందికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటాలో సీట్లు వచ్చాయి. ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు 173 పాల్గొన్నాయి. 28 కాలేజీల్లో వందశాతం సీట్ల కేటాయింపు మూడు యూనివర్సిటీలు, 28 ప్రైవేటు కాలేజీల్లో వందశాతం సీట్ల కేటాయింపు జరిగినట్టు సాంకేతిక విద్యాశాఖ తెలిపింది. మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 22లోగా సెల్ఫ్ రిపోరి్టంగ్ చేయాలని ఎంసెట్ క్యాంప్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. ఆగస్టు 9 నుంచి 11 వరకూ కాలేజీలో రిపోర్టు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. సగానికిపైగా కంప్యూటర్ కోర్సులే మొదటి దశ ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ఎక్కువగా కంప్యూటర్ కోర్సులనే విద్యార్థులు కోరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్రాంచీల్లో కలిపి 82,666 సీట్లుంటే, కంప్యూటర్ కోర్సుల్లోనే 55,876 సీట్లున్నాయి. వీటిల్లో భర్తీ అయిన సీట్లు 52,637. అన్ని బ్రాంచీలకు కలిపి ఉన్న సీట్లలో 67.5 శాతం కంప్యూటర్ కోర్సులవైతే, 32.5 శాతం ఇతర బ్రాంచీలకు చెందినవి ఉన్నాయి. కంప్యూటర్ కోర్సుల్లో సీఎస్సీ, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, డేటాసైన్స్, ఐటీతో కలుపుకుని మొత్తం 18 రకాల కోర్సులున్నాయి. ఎక్కువ మంది ఈ కోర్సులకే ఆప్షన్లు ఇవ్వడంతో 94.20 శాతం సీట్లు భర్తీ చేశారు. మిగిలిపోయిన సీట్లు 3,239 ఉన్నాయి. ఇవి కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినవే. ఈ కోర్సుల్లో వందశాతం భర్తీ ఆర్టిఫిషియల్ఇంటిలిజెన్స్ కోర్సులో 137సీట్లు ఉండగా.. అన్నీ భర్తీ అయ్యాయి. కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో 91, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టంలో 318, సీఎస్సీ (సైబర్ సెక్యూరిటీ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ)లో 133, సీఎస్సీ (నెట్వర్క్)లో 91, సీఎస్సీ (ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్)లో 870 సీట్లు ఉండగా.. అన్నీ భర్తీ అయినట్టు అధికారులు వెల్లడించారు. భారీగా సీట్లు మిగిలిన సివిల్, మెకానికల్, ఈఈఈ కౌన్సెలింగ్‌లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల పట్ల విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. గత ఏడాది కూడా ఇదే విధంగా ఉండటంతో చాలా కాలేజీలు ఈ బ్రాంచీల్లో సీట్లు రద్దు చేసుకోవడంతో 7 వేల సీట్లు తగ్గాయి. అయినప్పటికీ ఈ కోర్సుల్లో సీట్లు భారీగా మిగిలిపోయాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వాటి అనుబంధ బ్రాంచీల్లో 17,274 సీట్లు అందుబాటులో ఉంటే, 13,595 సీట్లు మాత్రమే కేటాయించారు. 3,679 సీట్లు మిగిలిపోయాయి. మెకానికల్, సివిల్ సహా వాటి అనుబంధ బ్రాంచీల్లోనూ 3,642 సీట్లు మిగిలిపోయాయి. సివిల్ ఇంజనీరింగ్‌లో 44.76 శాతం, మెకానికల్ 38.50 శాతం సీట్లే భర్తీ అయ్యాయి. ఈఈఈలోనూ 58.38 శాతం సీట్లు భర్తీ చేశారు. -
ఇంజనీరింగ్‌లో 1.42 లక్షల సీట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌కు కాలేజీలు, సీట్ల సంఖ్య దాదాపు ఖరారైంది. రాష్ట్రంలో 375 ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లోని 1,50,837 సీట్లు కౌన్సెలింగ్‌కు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చింది. ఈ కాలేజీలను తనిఖీలు చేసి నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నాయో, లేదో పరిశీలించాక ఆయా యూనివర్సిటీలు వాటికి అఫ్లియేషన్ ఇవ్వనున్నాయి. ఏపీ ఈఏపీసెట్–2022 తొలి విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఈ నెల 22 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. 30 వరకు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపునకు గడువు ఉంది. 31 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగనుంది. 28 నుంచి సెప్టెంబర్ 2 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, సెప్టెంబర్ 3న ఆప్షన్లలో మార్పులకు అవకాశం ఇచ్చారు. సెప్టెంబర్ 6న సీట్లు కేటాయించనున్నారు. ఈ ఏడాది మొత్తం 1,94,752 మంది విద్యార్థులు ఏపీఈఏపీ సెట్‌కు హాజరుకాగా 1,73,572 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరు https://sche.ap.gov.in/ APSCHEHome.aspx ద్వారా కౌన్సెలింగ్‌లో పాల్గొనొచ్చు. ఈ నెల 28 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో ఆలోగా యూనివర్సిటీల అఫ్లియేషన్‌ను పూర్తి చేసేలా సాంకేతిక విద్యాశాఖ చర్యలు చేపట్టింది. 17 వర్సిటీ కాలేజీల్లో 5 వేల ఇంజనీరింగ్ సీట్లు.. కాగా, 2022–23 విద్యా సంవత్సరానికి ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన ప్రకారం.. ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 261 కాలేజీల్లో 1,42,877 సీట్లు ఉన్నాయి. వీటిలో 17 యూనివర్సిటీ కాలేజీల్లో 5 వేల సీట్లు ఉండగా.. 244 ప్రైవేటు కాలేజీల్లో 1,37,877 సీట్లున్నాయి. ► ఫార్మసీలో 71 కాలేజీల్లో 6,670 సీట్లున్నాయి. వీటిలో ఆరు యూనివర్సిటీ కాలేజీల్లో 400 సీట్లు, 65 ప్రైవేటు కాలేజీల్లో 6,270 సీట్లు ఉన్నాయి. ► 43 ప్రైవేటు ఫార్మ్‌డీ కాలేజీల్లో 1,290 సీట్లు ఉన్నాయి. ప్రైవేటు వర్సిటీల్లో ఈసారీ 35% కోటా గతేడాది మాదిరిగానే 2022–23 విద్యా సంవత్సరంలో కూడా ప్రైవేటు వర్సిటీల్లో ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో 35 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో ఈఏపీసెట్‌లో మెరిట్ విద్యార్థులకు కేటాయించనున్నారు. ఈ 35 శాతం కోటా కింద గతేడాది వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఏపీ విట్)లో 1,509 సీట్లు, ఎస్ఆర్ఎం వర్సిటీలో 527 సీట్లు, బెస్ట్ వర్సిటీలో 1,074 సీట్లు, సెంచూరియన్ వర్సిటీలో 504 సీట్లు, క్రియా వర్సిటీలో 146 సీట్లు, సవితా వర్సిటీలో 81 సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. ఏపీ ఈఏపీసెట్‌లో ర్యాంకులు పొందిన దాదాపు 3 వేల మంది ఈ వర్సిటీల్లో చేరారు. వీరికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటుతో చదువుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. తద్వారా ఉన్నత ప్రమాణాలతో కూడిన సంస్థల్లో ఏ భారమూ లేకుండా విద్యార్థులు చదువుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బీ కేటగిరీ సీట్ల భర్తీపై వెలువడని తుది నిర్ణయం ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లయిన బీ కేటగిరీ సీట్ల భర్తీపై ఉన్నత విద్యామండలి తర్జనభర్జనలు పడుతోంది. గతంలో ఈ సీట్లు మెరిట్ విద్యార్థులకు దక్కేలా గతేడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం జీవో 48ని జారీ చేసింది. గతంలో బీ కేటగిరీ సీట్ల భర్తీని యాజమాన్యాలే చేపట్టేవి. అయితే ఈ జీవోతో మేనేజ్మెంట్ కోటా సీట్లను కూడా కన్వీనర్ ద్వారా ప్రభుత్వమే భర్తీ చేసేలా చర్యలు తీసుకున్నారు. కన్వీనర్ కోటా (ఏ కేటగిరీ) సీట్ల భర్తీతో పాటు ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా బీ కేటగిరీ సీట్ల భర్తీ చేపట్టారు. అయితే ఏ కేటగిరీ సీట్ల భర్తీ ముందుగా అయిపోతున్నందున బీ కేటగిరీ సీట్లు భర్తీ కావడం లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. అందువల్ల తామే ఆ సీట్లను భర్తీ చేసుకునేందుకు అవకాశమివ్వాలని కోరుతున్నాయి. ఈ తరుణంలో బీ కేటగిరీ సీట్ల భర్తీపై అనుసరించాల్సిన విధానం గురించి ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వం నుంచి ఇంకా దీనిపై తుది నిర్ణయం రాలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు బీ కేటగిరీ సీట్ల భర్తీపై ఉన్నత విద్యామండలి ముందుకు వెళ్లనుంది. -
శతమానం భారతి : బ్రిటిష్ ఇండియాలో తొలి ఇంజనీరింగ్ కాలేజ్ ఐ.ఐ.టి. రూర్కీ
దేశాభివృద్ధిలో సాంకేతిక విద్య కీలక పాత్ర పోషిస్తుంది. అయితే భారతీయ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఏటా పట్టభద్రులవుతున్న సుమారు 15 లక్షల మంది విద్యార్థులలో అత్యధికులకు ఉద్యోగార్హ ప్రమాణాలు కొరవడుతున్నాయన్న విమర్శ ఉంది. అంతర్జాతీయంగా వస్తున్న అధునాతన సాంకేతిక మార్పులు, ఉన్నత ప్రమాణాలను అందిపుచ్చుకోవడంలో దేశీయ ఇంజనీరింగ్ కళాశాలలు విఫలం అవుతున్నాయన్న మాటలో కొంతైనా వాస్తవం లేకపోలేదు. ప్రపంచంలో అమెరికా తరువాత ఎక్కువ మంది ఆంగ్లం మాట్లాడేది భారతదేశంలోనే. అయినా, ఉన్నత విద్య కోసం వచ్చే విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో భారత్ తీసికట్టుగా ఉంది. స్వాతంత్య్రం అనంతరం మన ఉన్నత విద్య ప్రపంచ ప్రమాణాలకు దీటుగా ఎదగకపోవడమే దీనికి కారణం. పూర్వం భారత్‌లోని నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలలో విద్యాభ్యాసానికి ఇతర దేశాల నుంచి విద్యార్థులు వచ్చేవారు. కానీ, నాటి ప్రమాణాలు నేడు లేవు. మన ఇంజినీరింగ్ విద్యాలయాలు కేవలం బోధనతోనే సరిపెట్టుకోకుండా జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలతో అనుసంధానం కావాలి. ప్రపంచంలో అమెరికా, చైనాల తరవాత మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఇండియా ధ్యేయంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని 2030–32 నాటికి అందుకోవాలని భావిస్తోంది. అప్పటికి భారత్ 10 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగితేనే అనుకున్న లక్ష్యం సాధించగలుగుతుంది. బలమైన విద్యావ్యవస్థ పునాదిపై అధునాతన విజ్ఞానాధారిత సమాజాన్ని నిర్మించడం ద్వారానే అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా ఇండియా ఎదుగుతుంది. (చదవండి: మహోజ్వల భారతి: ఆక్స్ఫర్డ్ నుంచి తొలి ముస్లిం) -
25 నుంచి ఇంజనీరింగ్ క్లాసులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫస్టియర్ క్లాసులు ఈ నెల 25 నుంచి ప్రారంభించే వీలుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను అతి త్వరలో విడుదల చేస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. ఇప్పటికే ఎంసెట్ రెండు దశల కౌన్సెలింగ్ చేపట్టారు. రెండో దశలో సీట్లు పొందిన అభ్యర్థులు గురువారం నాటికి సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. మొదటి దశలో సీట్లు పొందిన వారిలో దాదాపు 3,500 మంది జాతీయ కాలేజీలు, ఇతర ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలకు వెళ్లిపోయారు. రెండో దశలోనూ సీట్లు మిగిలితే ఈ నెల 21 తర్వాత ప్రత్యేక కౌన్సెలింగ్ చేపడతారు. దీంతో మొత్తం సీట్ల కేటాయింపు పూర్తవుతుంది. 2021 ఎంసెట్‌లో 1,21,480 మంది అర్హత పొందారు. ఇంజనీరింగ్‌లో మొత్తం కన్వీనర్ సీట్లు 79,790 సీట్లున్నాయి. రెండు దశల కౌన్సెలింగ్ ద్వారా 73,428 సీట్లు కేటాయించారు. ఇంకా 19,797 సీట్లు మిగిలిపోయాయి. విద్యార్థులు చేరకుండా మిగిలిపోయే వాటిని, ఇప్పటికే ఖాళీగా ఉన్న సీట్లకు కలిపి ఈ నెల 21 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ చేపడతారు. ఈ ప్రక్రియ ఈ నెల 22తో ముగుస్తుందని, 25 నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు. జాతీయ సాంకేతిక విద్యా మండలి కూడా ఈ నెలాఖరులో ఇంజనీరింగ్ ఫస్టియర్ క్లాసులు మొదలు పెట్టాలని సూచించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు కాలేజీలు యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేస్తున్నాయి. మొదలైన హడావుడి.. రాష్ట్రంలో మొత్తం 175 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. ఇందులో ప్రైవేటువి 158 వరకూ ఉన్నాయి. ఇంజనీరింగ్ క్లాసులు మొదలయ్యే సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని కాలేజీల్లోనూ హడావిడి మొదలైంది. టాప్ టెన్ కాలేజీల్లో ఇప్పటికే యాజమాన్య కోటా సీట్లు భర్తీ అయ్యాయి. ఇతర ఇంజనీరింగ్ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి మల్లగుల్లాలు పడుతున్నారు. ఈసారి కంప్యూటర్ సైన్స్‌లో కొత్త కోర్సులకు అనుమతి లభించింది. దీంతో సీట్లు పెరిగాయి. కాలేజీల్లో అదనపు సెక్షన్ల ఏర్పాటు అనివార్యమవుతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి కంప్యూటర్ సైన్స్ సీట్లు పెరగడంతోపాటు సివిల్, మెకానికల్ సీట్లు తగ్గాయి. ఈ రెండు విభాగాల్లో దాదాపు 2 వేల సీట్లను కొన్ని కాలేజీలు ఉపసంహరించుకున్నాయి. మరోవైపు గతేడాది కన్నా ఈ సంవత్సరం సీఎస్ఈ సీట్లను అన్ని కాలేజీలు పెంచుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ సీట్లు 19,101 ఉన్నాయి. ఇందులో ఇప్పటికీ 767 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇవి గ్రామీణ ప్రాంతాల ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్నాయి. మొత్తమ్మీద ఈసారి కంప్యూటర్ అనుబంధ కోర్సుల విద్యార్థులే ఎక్కువగా హడావిడి చేసే అవకాశముందని ఉన్నత విద్యా మండలి అధికారులు అంటున్నారు. -
బీఎస్సీ డేటా సైన్స్ ఈ కోర్సు కిరాక్
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో డేటా సైన్స్ కోసం విద్యార్థులు విపరీతంగా పోటీ పడుతున్నారు. మెరుగైన ఉపాధి కల్పించే కోర్సుగా దీనిని భావిస్తుండటమే ఇందుకు కారణం. తాజాగా చేపట్టిన మొదటి దశ ఎంసెట్ కౌన్సెలింగ్‌లో 3,229 డేటా సైన్స్ సీట్ల భర్తీకి దాదాపు 20 వేల మందికి పైగా ఆప్షన్లు ఇవ్వడం దీని డిమాండ్‌ను స్పష్టం చేస్తోంది. దీంతో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు సీటుకు రూ.10 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇంజనీరింగ్ డేటా సైన్స్ కన్నా బీఎస్సీ డేటా సైన్స్ మెరుగైనదని ఉన్నత విద్యామండలి స్పష్టం చేస్తోంది. గతేడాదే డిగ్రీలో దీన్ని ప్రవేశపెట్టగా ఈ సంవత్సరం దీనికి మరిన్ని మెరుగులు దిద్దారు. అప్పట్లోనే దాదాపు 7 వేల సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ సరైన ప్రచారం లేకపోవడంతో విద్యార్థులు ఈ కోర్సును పట్టించుకోవడం లేదని, ప్రాధాన్యతను గుర్తించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇంజనీరింగ్‌పై తరగని మోజు కూడా ఇందుకు కారణమవుతోందని అంటున్నారు. రూ.లక్షలు వెచ్చించి ఇంజనీరింగ్ చేసే బదులు బీఎస్సీ డేటా సైన్స్ చేస్తే మెరుగైన ఉపాధి పొందవచ్చని స్పష్టం చేస్తున్నారు. ఎంఎన్సీల ప్రత్యేక శిక్షణ ఇంజనీరింగ్ డేటా సైన్స్ నాలుగేళ్ల కోర్సు అయితే బీఎస్సీ డేటా సైన్స్ మూడేళ్ల కోర్సే. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన తర్వాత విద్యార్థి మార్కెట్‌కు తగినవిధంగా ఇతర అప్లికేషన్లు నేర్చుకోవాల్సి ఉంటుంది. క్యాంపస్ రిక్రూట్మెంట్ సాధ్యం కాకపోతే ఈ దిశగా విద్యార్థి కొంత శ్రమ పడాల్సి ఉంటుంది. బీఎస్సీ డేటా సైన్స్ కోర్సులో మొదటి సంవత్సరం నుంచే బహుళజాతి సంస్థల ప్రతినిధులు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ మేరకు పలు సంస్థలతో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఒప్పందం కుదుర్చుకుంది. టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ సహా మొత్తం 25 కంపెనీలు కన్సార్షియంగా ఏర్పడ్డాయి. ఆ సంస్థల్లో పనిచేసేందుకు ఎలాంటి శిక్షణ కావాలో ఆ శిక్షణను విద్యార్థి దశ నుంచే ఆయా కంపెనీలు అందిస్తాయి. మార్కెట్ ట్రెండ్‌ను అనుసరించి మాడ్యూల్స్ మార్కెట్ ట్రెండ్‌ను అనుసరించి సరికొత్త మాడ్యూల్స్‌ను కార్పొరేట్ కంపెనీలు రూపొందించి బీఎస్సీ డేటా సైన్స్ విద్యార్థులకు పంపుతాయి. జావా, పైతాన్‌తో పాటు పలు రకాల టూల్స్‌ను ఆయా సంస్థలు నేర్పిస్తాయి. వీటిపై లేబొరేటరీల్లో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తారు. దీంతో పాటు సంస్థల నేతృత్వంలోనే మూడేళ్ళ పాటు మినీ ప్రాజెక్టులు చేపడతారు. దీంతో బీఎస్సీ డేటా సైన్స్ కోర్సు పూర్తయ్యే నాటికే విద్యార్థికి పూర్తి స్థాయి నైపుణ్యం ఉంటుందని ఉన్నత విద్యా మండలి తెలిపింది. కంపెనీల అవసరాలకు సరిపడే కోర్సు బీఎస్సీ డేటా సైన్స్ కోర్సును కంపెనీల అవసరాలకు అనుగుణంగా రూపొందిం చాం. డిగ్రీని చులకన చేసే పరిస్థితులను మార్చాలన్నదే లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సాంకేతిక మార్పులను గుర్తించి, వాటిపై బహుళజాతి కంపెనీలు ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తాయి. దీంతో డిగ్రీ పూర్తవ్వడంతోనే మెరుగైన వేతనాలతో విద్యార్థులు స్థిరపడే వీలుంది. – లింబాద్రి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ బీఎస్సీ విద్యార్థుల్లో విశ్వాసం పెరిగింది గతంతో పోలిస్తే బీఎస్సీ డేటా సైన్స్ విద్యార్థుల్లో విశ్వాసం పెరిగింది. తొలిదశ నుంచే పైతాన్, జావాతో పాటు అనేక కొత్త అప్లికేషన్లపై అవగాహన పెంచుకుంటున్నారు. కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యార్థులతో ఏమాత్రం తీసిపోని రీతిలో సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకుంటున్నారు. – ప్రొఫెసర్ శ్యామల, కంప్యూటర్ సైన్స్ అధ్యాపకురాలు, ఓయూ క్యాంపస్ నియామకాల్లో వీళ్లకే చోటు బీఎస్సీ డేటా సైన్స్ విద్యార్థులను కన్సార్షియం సంస్థలు పూర్తిగా తాము తయారు చేసుకున్న మానవ వనరులుగానే భావిస్తాయి. ఉమ్మడి ప్రణాళికతో తమ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక శిక్షణ ఇవ్వడం వల్ల ఉమ్మడిగా జాతీయ స్థాయిలో పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఒక్క పరీక్షలో ర్యాంకు సాధిస్తే 25 కంపెనీల్లో ఇతర పరీక్షలు లేకుండా ఉపాధి పొందే వీలుంది. డిగ్రీ విద్యార్థులు స్థిరంగా ఒకే కంపెనీలో ఎక్కువ కాలం ఉండే వీలుందని ఇటీవలి విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. దీన్ని పరిగణనలోనికి తీసుకుని క్యాంపస్ నియామకాల్లో ఇంజనీరింగ్ డేటా సైన్స్ కన్నా, బీఎస్సీ డేటా సైన్స్ పూర్తి చేసిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలని కంపెనీల ప్రతినిధులు భావిస్తున్నారు. -
‘సెల్ఫ్’ ఫైనాన్సింగ్ సీట్లు 1,160
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,160 సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు ఉన్నట్లు లెక్క తేలింది. ఈ సీట్లను ఎంసెట్ ర్యాంకు ఆధారంగా కన్వీనర్ కోటా కింద మాత్రమే భర్తీ చేస్తారు. అయితే, ప్రైవేటు కాలేజీలతో సమానంగా ఈ కేటగిరీ సీట్లకు ఫీజులు వసూలు చేయనున్నట్లు యూనివర్సిటీలు ప్రకటించాయి. సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద సీట్ల భర్తీ ప్రక్రియ దశాబ్దం క్రితమే మొదలైనా.. ఈ స్థాయిలో ఫీజులు పెంచడం ఇదే తొలిసారి. ఈ ఫీజులు ఇంచుమించు టాప్‌టెన్ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు సమానంగా ఉన్నాయి. మూడేళ్లకోసారి ఫీజులను పెంచుతున్నారు. ఈసారి గుట్టు చప్పుడు కాకుండా ఫీజులు పెంచారు. ఈ కేటగిరీ కింద చేరిన వారికి ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. ఇప్పటివరకూ రూ.35 వేలుగా ఉన్న ఫీజులు ఇకపై రూ.70 వేలకు చేరనుంది. ఎక్కడెన్ని సీట్లు.. ►జేఎన్టీయూహెచ్, ఉస్మానియా, కాకతీయ, మహా త్మాగాంధీ, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ, పీవీ నరసింహారావు వెటర్నటీ వర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ పరిధిలో మొత్తం 15 కాలేజీలున్నాయి. వీటిల్లో 3,645 ఇంజనీరింగ్ సీట్లున్నాయి. ►వీటిలో 1,160 సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ కింద పరిగణిస్తారు. వెయ్యిలోపు ఎంసెట్ ర్యాంకు వచ్చిన వారికే ఈ సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. అయినా ప్రైవేటు కాలేజీల్లోని ఫీజులే వీళ్లూ చెల్లించాలి. 10వేల లోపు ర్యాంకు వచ్చిన వాళ్లకు కూడా ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద సీట్లు వస్తున్నయ్. అయితే, ఇందులో కొందరు రూ.1.2 లక్షల వరకూ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ►ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆర్టిఫీషియల్ ఇం టెలిజెన్స్ కోర్సు ఫీజు ఏడాదికి రూ.1.3 లక్షలు. ప్రైవేటు కాలేజీల్లో (కన్వీనర్ కోటా కింద)నూ ఇదే ఫీజు ఉండటం విశేషం. ప్రభుత్వకాలేజీలు ఆర్థికం గా పుంజుకోవడం కోస మే ఈ తరహా ఫీజులు వసూలు చేస్తున్నట్లు వర్సిటీలు పేర్కొంటున్నాయి. కానీ, మెరిట్ ఉన్న పేద లకు అన్యాయం జరుగుతోందని విద్యావేత్తలు చెబుతున్నారు. ►కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, మెటలార్జికల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను ఈ ఏడాది అధికారికంగా ప్రకటించాయి. ►జేఎన్టీయూహెచ్ అనుబంధ క్యాంపస్‌ను సిరిసిల్లలో కొత్తగా ఏర్పాటు చేశారు. దీనిలో 6 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ప్రవేశపెట్టారు. చాలాకాలం నుం చి ఉన్న జగిత్యాలలో 5 కోర్సులు, మాసబ్‌ట్యాంక్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్లో 3, కూకట్పల్లి జేఎన్టీయూహెచ్లో 7, ఐదేళ్ల ఇంటి గ్రేటెడ్ కాలేజీ ల్లో 6, సుల్తాన్‌పురలో 2012లో ప్రారంభించిన జేఎన్టీయూ అనుబంధ కాలేజీలో 4 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో ప్రవేశాలు జరుగనున్నాయి. ►కాకతీయ వర్సిటీ పరిధిలోని కొత్తగూడెం కాలేజీలో మూడు, కాకతీయ క్యాంపస్‌లో 4, మహాత్మాగాంధీ వర్సిటీలో 3 కోర్సులు, ఉస్మానియా వర్సిటీ పరిధిలో 6 కోర్సులు, ఇలా ఒక్కో బ్రాంచిలో 30 సీట్లకు తక్కువ కాకుండా, మొత్తం 1,160 సీట్లు సెల్ఫ్ ఫైనాన్సింగ్ పరిధిలోకి తెస్తున్నారు. -
ఎంసెట్ తొలి విడత కౌన్సెలింగ్ పూర్తి
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ తొలి విడత కౌన్సెలింగ్‌లో సీట్ల కేటాయింపు ముగిసింది. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొన్న విద్యార్థులకు శనివారం సీట్లు కేటాయించారు. కన్వీనర్ కోటాలో 14 యూనివర్సిటీ కాలేజీలు, 164 ప్రైవేటు కాలేజీల పరిధిలో 70,135 సీట్లు ఉన్నాయి. వీటిలో తొలివిడత కౌన్సెలింగ్ ద్వారా 50,137 సీట్లను విద్యార్థులకు కేటాయించారు. తొలివిడత సీట్ల కేటాయింపు ప్రక్రియలో కన్వీనర్ కోటాలో 71.49 శాతం సీట్లు భర్తీ కాగా, మరో 19,998 సీట్లు ఖాళీగా ఉన్నాయి. తొలివిడత కౌన్సెలింగ్‌లో 4,603 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చినా కూడా వారికి ఏ కాలేజీలోనూ సీటు రాలేదు. తొలివిడత కౌన్సెలింగ్ ద్వారా మిగిలిపోయిన సీట్లను రెండో విడత కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది. తొలి విడత కౌన్సెలింగ్ సాగిందిలా.. ఎంసెట్–20 ఇంజనీరింగ్ స్ట్రీమ్ తొలి విడత కౌన్సెలింగ్ ఈనెల 12 నుంచి 22 వరకు జరిగింది. ఈనెల 20 వరకు సర్టిఫికెట్ల పరీశీలన చేయగా, 22 వరకు విద్యార్థులు ఆప్షన్లు ఎంట్రీ చేశారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు 55,785 మంది హాజరు కాగా, 54,981 మంది విద్యార్థులు 25,20,770 ఆప్షన్లు ఎంట్రీ చేశారు. మొత్తం 50,288 సీట్లు విద్యార్థులకు కేటాయించారు. ఇంజనీరింగ్ కేటగిరీలో 50,137 సీట్లు, ఫార్మసీ కేటగిరీలో 151 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం 23,806 సీట్లు ఖాళీగా ఉండగా, వీటిలో ఇంజనీరింగ్ కేటగిరీలో 19,998 సీట్లు, ఫార్మసీ కేటగిరీలో 3,808 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వర్సిటీ కాలేజీల్లో 98.1శాతం సీట్లు భర్తీ.. ఇంజనీరింగ్ కోర్సుల సీట్ల కేటాయింపులో యూనివర్సిటీ కాలేజీలు ముందు వరుసలో ఉన్నాయి. రాష్ట్రంలో 14 వర్సిటీ కాలేజీల్లో 3,151 ఇంజనీరింగ్ సీట్లుండగా, వీటిలో తొలి విడత కౌన్సెలింగ్‌లో 3,091 సీట్లు విద్యార్థులకు కేటాయించారు. ప్రస్తుతం 60 సీట్లు మిగిలిపోయాయి. 164 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 66,984 సీట్లకుగాను 47,046 సీట్లను విద్యార్థులకు కేటాయించారు. 70.23 శాతం సీట్లు కేటాయించగా, 19,938 సీట్లు మిగిలిపోయాయి. 13 యూనివర్సిటీ కాలేజీలు, 35 ప్రైవేటు కాలేజీల్లో వంద శాతం సీట్లను విద్యార్థులకు కేటాయించారు. 3 కాలేజీల్లో ఒక్క సీటు కూడా విద్యార్థులకు కేటాయించకపోవడం గమనార్హం. ఫార్మసీ కాలేజీల్లో 4.02 శాతం కేటాయింపు.. ఫార్మసీ కాలేజీల్లో 4.02% సీట్లు భర్తీ అయ్యాయి. ఫార్మసీ కేటగిరీలో 119 కాలేజీల్లో 3,959 సీట్లకు 151 సీట్లు కేటాయించారు. 3,808 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. 3 యూనివర్సిటీ కాలేజీల్లో 80 సీట్లు ఉండగా, 56 సీట్లు కేటాయించగా, 24 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 116 ప్రైవేటు కాలేజీల్లో 3,879 సీట్లకు గాను 95 సీట్లు కేటాయించారు. ఫార్మా–డీ కేటగిరీలో 56 ప్రైవేటు కాలేజీల్లో 546 సీట్లలో 30 కేటాయించారు. మిగతా 516 ఖాళీగా ఉన్నాయి. ఈ కోర్సుల్లో 100 శాతం కేటాయింపు.. తొలి విడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో పలు కోర్సు ల్లో నూరు శాతం సీట్లు కేటాయించారు. ఇందులో కెమికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, డిజిటల్ టెక్నిక్స్ ఫర్ డిజైన్ అండ్ ప్లానింగ్, బయోమెడికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీమాటిక్స్, మెకానికల్ (మెక్‌ట్రోనిక్స్), కంప్యూటర్ ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ, అగ్రికల్చర్, ఫుడ్‌సైన్స్, డెయిరీయింగ్, బయోటెక్నాలజీ తదితర కోర్సుల్లో వంద శాతం సీట్లు కేటాయించారు. సెల్ఫ్ రిపోర్టింగ్ తర్వాతే.. ఎంసెట్ మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 28లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత లేని విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించి కాలేజీలో రిపోర్టు చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుంటే కేటాయించిన సీటు రద్దవుతుంది. ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ తేదీలు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అందులో పాల్గొనే విద్యార్థులు వెబ్సైట్ నుంచి వివరాలు పొందాలి. తొలివిడత కౌన్సెలింగ్‌కు హాజరు కాని విద్యార్థులు రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని నిర్దేశించిన తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరై వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. -
‘ఇంజనీరింగ్’కు ఐఐటీ అండ
సాక్షి, హైదరాబాద్: అత్యున్నత ప్రమాణాలతో కూడిన ల్యాబ్‌లు, విశేష అనుభవం కలిగిన అధ్యాపకులు, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు, ఆధునిక టెక్నాలజీకి సంబంధించిన జర్నల్స్, పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్రాలు మన ఐఐటీలు. అందుకే ఐఐటీలలో బీటెక్, ఎం టెక్ ఇతరత్రా కోర్సులు చదవాలన్నది విద్యార్థుల జీవిత లక్ష్యం. వాటిల్లో చదివితే చాలు అంతా సెట్ అయిపోయినట్లే. పక్కాగా క్యాంపస్ ప్లేస్మెంట్. భారీగా వేతనాలు. లేదంటే పరిశోధనలు.. అదీ కాదనుకుంటే స్టార్టప్ దిశగా అడుగులు.. ఇవీ ఐఐటీల్లో చదువుకునే విద్యార్థుల అవకాశాలు. అలాంటి ఐఐటీలు ఇకపై తమ పరిధిలోని సాధారణ ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యత ప్రమాణాల పెంపునకు తోడ్పాటు అందించనున్నాయి. ఐఐటీల్లో అమలు చేస్తున్న ప్రత్యేక సిలబస్‌తో కూడిన విద్యా బోధన, అభ్యసన పద్ధతులు, ప్రమాణాల పెంపు, పరిశోధనల వైపు విద్యార్థులు మళ్లేలా ప్రోత్సహించడం వంటి అనేక కార్యక్రమాలను ఇక సాధారణ కాలేజీల్లోనూ అందించేందుకు చర్యలు చేపట్టనున్నాయి. ప్రతి ఐఐటీ.. తమ పరిధిలోని 10 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఐఐటీల ఎక్స్టెన్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి నాణ్యత ప్రమాణా పెంపునకు చర్యలు చేపట్టనున్నాయి. ఐఐటీల కౌన్సిల్ ఇటీవల తీసుకున్న నిర్ణయం మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇదీ అమల్లోకి రానుంది. తమ విద్యార్థుల్లాగే వారికీ.. దేశవ్యాప్తంగా 23 ఐఐటీలు ఉన్నాయి. అవన్నీ తమ ఎక్స్టెన్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఐఐటీల కౌన్సిల్ నిర్ణయించింది. ఒక్కో ఐఐటీ తమ పరిధిలోని 10 ఇంజనీరింగ్ కాలేజీలను ఎంచుకొని ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత ప్రమాణాల పెంపునకు సహకారం అందించాలని పేర్కొంది. అందుకు ఎంపిక చేసిన 230 సాధారణ ఇంజనీరింగ్ కాలేజీల్లోని అధ్యాపకుల్లో బోధన నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు తగిన శిక్షణ అందించనున్నాయి. తద్వారా ఆయా కాలేజీల్లో చదివే ఇంజనీరింగ్ విద్యార్థులను ఐఐటీల్లో చదివే విద్యార్థుల తరహాలో తీర్చిదిద్దనున్నాయి. ఈ ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతను ఐఐటీ మద్రాసుకు (నోడల్ ఇన్స్టిట్యూట్గా) ఐఐటీల కౌన్సిల్ అప్పగించింది. ఐఐటీల పరిధిలోని కాలేజీల ఎంపికలో ఏఐసీటీఈ తగిన సహకారం అందించనుంది. ల్యాబ్‌లతోనూ అనుసంధానం.. దేశంలోని అత్యున్నత ల్యాబరేటరీలతో ఐఐటీలను అనుసంధానం చేయాలని ఐఐటీల కౌన్సిల్ నిర్ణయించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) వంటి అనేక జాతీయ స్థాయి సంస్థలతో ఆయా ప్రాంతాల్లోని ఐఐటీలను అనుసంధానం చేయనుంది. వివిధ పరిశోధనల్లో డీఆర్డీవో శాస్త్రవేత్తలు, ఐఐటీల ఫ్యాకల్టీ కలసి పనిచేయాలని డీఆర్డీవో సెక్రటరీ సూచన మేరకు ఆ దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఎలక్ట్రానిక్స్, సైబర్ డిఫెన్స్ రంగాల్లో డీఆర్డీవోతో కలసి ఐఐటీలు జూనియర్ రీసెర్చ్ ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించింది. డీఆర్డీవో శాస్త్రవేత్తలకు పీహెచ్డీ లేకపోయినా వారితో బోధన నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలో పథకంలో కొన్ని మార్పులు చేయాలని కౌన్సిల్ నిర్ణయించింది. ఆ బాధ్యతను నేషనల్ కోఆర్డినేటర్‌గా ఐఐటీ ఢిల్లీకి అప్పగించింది. 2020 ఫిబ్రవరి నాటికి నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది. అలాగే ఐఐటీల్లో విదేశీ విద్యార్థులు చేరేలా ప్రోత్సహించేందుకు నేరుగా జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఐఐటీల్లో విదేశీ అధ్యాపకులను నియమించాలని ప్రాథమికంగా అంగీకారానికి వచ్చినా, ఈ అంశాన్ని ప్రత్యేకంగా పరిశీలించాలని నిర్ణయించింది. అలాగే కొత్తగా నిర్మించే ఐఐటీ క్యాంపస్‌లలో ఒక్కో విద్యార్థికి 75 స్క్వేర్ మీటర్లు కాకుండా 108 స్క్వేర్ మీటర్ల చొప్పున స్థలాన్ని కేటాయించాలని నిర్ణయించింది. బీటెక్ స్థాయిలోనే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రాం ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన రంగాలను గుర్తించాలని పేర్కొంది. -
ఇంజినీరింగ్ పల్టీ
జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల ఆశలు గల్లంతయ్యాయి. మూడేళ్లుగా కళాశాలల్లో పూర్తి స్థాయిలో సీట్లు భర్తీకాక నానా తంటాలు పడుతున్నారు. ఈ ఏడాది పరిస్థితి మరింత దారుణంగా మారింది. తొలి విడతలో కన్వీనర్ కోటాలో 55.67 శాతం భర్తీ కావడంతో కొన్ని కళాశాలల యాజమాన్యాలు సీట్లు పెంచుకున్నాయి. అయితే తొలి విడతలో కంటే రెండో విడతలో భర్తీ 4.07 శాతం తగ్గడంతో యాజమాన్యాలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నాయి. కనీసం ఒక్క కళాశాలలో కూడా 100 శాతం సీట్లు భర్తీ కాలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఎన్బీకేఆర్ 81.0 శాతం భర్తీతో జిల్లాలో టాప్‌గా నిలిచింది. రెండు కళాశాలల్లో 2 శాతం లోపు, మరో రెండు కళాశాలల్లో 6.2 శాతం లోపు సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తంగా ఇంజినీరింగ్ కళాశాలలు సీట్లు భర్తీ చేసుకోవడంలో పల్టీ కొట్టాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇంజినీరింగ్ కళాశాలల మనుగడ ప్రశ్నార్థకం కానుంది. నెల్లూరు (టౌన్): జిల్లా వ్యాప్తంగా 21 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో తొలి విడత కౌన్సెలింగ్‌కు 5,931 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లలో 3,302 సీట్లతో 55.67 శాతం భర్తీ అయ్యాయి. అయితే రెండో విడత కౌన్సెలింగ్‌కు ఆయా కళాశాలల్లో 6,523 సీట్లకు పెంచుకున్నారు. వాటిల్లో 3,366 సీట్లతో 51.60 శాతం మాత్రమే భర్తీ అయ్యాయి. రెండో విడతకు డిమాండ్ ఉన్న బ్రాంచ్‌ల్లో మొత్తం 592 సీట్లను పెంచుకున్నారు. సీట్లు స్వల్పంగా పెంచుకున్నా ఇంకా 3,157 సీట్లు ఆయా కళాశాలల్లో మిగిలిపోయాయి. తొలి విడత కంటే రెండో విడతలో కేవలం 64 సీట్లలో అధికంగా విద్యార్థులు చేరారు. తొలివిడత కంటే రెండో విడతలో సీట్ల భర్తీలో 4.06 శాతం తగ్గింది. జిల్లాలో కళాశాలలు 21 మొత్తం సీట్లు 6,523 భర్తీ అయినవి 3,366 భర్తీ కాని సీట్లు 3,157 తొలి విడతలో భర్తీ 55.67 శాతం రెండో విడతలో భర్తీ 51.60 శాతం జిల్లాలో టాప్ భర్తీ 81 శాతమే జిల్లాలో ఆశించిన స్థాయిలో కళాశాలల్లో సీట్లు భర్తీ కాలేదు. రెండో విడత కౌన్సెలింగ్ ఈ నెల 13వ తేదీతో ముగిసింది. జిల్లాలో ఏ కళాశాలలోనూ 100 శాతం సీట్లు భర్తీ కాలేదు. ఎన్బీకేఆర్ 81 శాతం సీట్లు భర్తీఅయి జిల్లాలో టాప్‌గా నిలిచింది. ఆ తర్వాత రెండో స్థానంలో విశ్వోదయ 77.6 శాతం, మూడో స్థానంలో వీసీకేవీ 76.5 శాతం, నాలుగో స్థానంలో శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల 74.3 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఆ తర్వాత 50 శాతానికి పైగా 5 కళాశాలల్లో సీట్లు భర్తీ అయ్యాయి. జిల్లాలో రెండు కళాశాలల్లో 2 శాతం లోపు సీట్లు భర్తీ కాగా, 10 శాతం లోపు మరో 3 కళాశాలలు ఉన్నాయి. వీటితో పాటు మరో 7 కళాశాలల్లో 10 నుంచి 50 శాతం లోపు సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. సీఎస్ఈ, ఈసీఈలకే డిమాండ్ ఇంజినీరింగ్‌లో సీఎస్ఈ, ఈసీఈ, సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ, ఐటీ తదితర బ్రాంచ్‌లు ఉన్నాయి. వీటిల్లో సీఎస్ఈ, ఈసీఈ బ్రాంచ్లకే డిమాండ్ ఉంది. ఈ రెండు కోర్సుల్లో చదివేందుకే విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. కంప్యూటర్ కోర్సు పూర్తి చేస్తే వెంటనే ఉద్యోగంలో చేరవచ్చన్న భావన విద్యార్థుల్లో నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఆయా కళాశాలల్లో 1,711 సీఎస్ఈ సీట్లు ఉంటే 1,297 మందితో 75.8 శాతం భర్తీతో టాప్‌గా నిలిచింది. ఆ తర్వాత ఈసీఈలో 1,977 సీట్లుకు 1,297 భర్తీతో 65.6 శాతం, ట్రిపుల్‌ఈలో 933 సీట్లకు 309 భర్తీతో 33.1 శాతం, మెకానికల్‌లో 863 సీట్లకు 236 భర్తీతో 27.3 శాతం, సివిల్‌లో 1,039 సీట్లకు 227 మంది చేరి 21.8 శాతం భర్తీ అయ్యాయి. నిరాశలో యాజమాన్యాలు ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్‌లో ఆశించిన స్థాయిలో సీట్లు భర్తీ కాకపోవడంతో ఆయా ఇంజినీరింగ్ కళాశాలల యాజమన్యాలు నిరాశలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడే పరిస్థితి ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుందోనన్న ఆందోళనలో కళాశాలల యజమానులు ఉన్నారు. ఇప్పటికే కొన్ని ఇంజినీరింగ్ కళాశాలలు మూత పడే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా జిల్లాలో ఇంటర్ చదివిన విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ రీతిలో ప్రతి ఏటా 3 వేల మందికి పైగా విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చదివేందుకు వెళుతున్నట్లు చెబుతున్నారు. ఇక్కడ కళాశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు బోధన, కంప్యూటర్ ల్యాబ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర సౌకర్యాలు సరిగా లేవన్న అభిప్రాయం ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మంది విద్యార్థులు ఇంజినీరింగ్ చదివేందుకు ఇతర రాష్ట్రాల వైపు వెళ్తున్నట్లు తెలిసింది. -
‘ ఎస్ఆర్కేఆర్’లో ఐ హబ్
భీమవరం: ఇంజినీరింగ్ విద్యార్థులు పరిశోధన, శిక్షణ, సాంకేతిక పరిజ్ఞాన్నాన్ని అందిపుచ్చుకునేందుకు తమ కళాశాలలో రూ.10 కోట్ల వ్యయంతో ఐ హబ్‌ను ఏర్పాటు చేసినట్టు భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల అధ్యక్షుడు సాగి ప్రసాద్‌రాజు అన్నారు. బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన ఐ హబ్‌ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సుమారు 500 మంది విద్యార్థులు ఒకే సమయంలో నూతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి ఐ హబ్ దోహదపడుతుందన్నారు. ఇంటర్నెట్, మొబైల్ వైఫై సౌకర్యంతోపాటు విద్యార్థులు నూతన ఉత్పత్తులు తయారు చేయడానికి సహకారం అందించేందుకు బ్యాంకులు, సాఫ్ట్వేర్ సంస్థలు, క్యాంటిన్వంటి అన్ని సదుపాయాలు హబ్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.పార్థసారథివర్మ మాట్లాడారు. అనంతరం కళాశాలలో రూ.15 కోట్లతో నిర్మించనున్న బాలికల హాస్టల్ భవనానికి అధ్యక్షుడు ప్రసాద్‌రాజు శంకుస్థాపన చేశారు. కళాశాల చైర్మన్ గోకరాజు మురళీరంగరాజు, డైరెక్టర్ ఎస్వీరంగరాజు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
‘రామచంద్ర’లో ఇన్నోవేషన్ క్లస్టర్ ల్యాబ్ ప్రారంభం
ఏలూరు సిటీ: బహుళజాతి సంస్థ ఆల్టిమెట్రిక్ స్థానిక రామచంద్ర ఇంజనీరిం గ్ కాలేజీలో ఏర్పాటుచేసిన ఇన్నోవేషన్ క్లస్టర్ ల్యాబ్‌ను బుధవారం సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఎం.గిరిధర్, ఆల్టిమెట్రిక్ సొల్యూషన్స్ ల్యాబ్ హెడ్ ఎస్.రఘువీర్ ప్రారంభించారు. ఈ ల్యాబ్ ద్వారా విద్యార్థులు ఇంజనీరింగ్ రం గంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా ఉపాధి, ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవచ్చన్నారు. విద్యార్థు ల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ల్యాబ్ ఏర్పాటుచే సినట్టు కళాశాల సెక్రటరీ కె.వేణుగోపాల్ చెప్పా రు. సంస్థ ప్రతినిధులు ఆర్.కీర్తి పాం డురంగారావు, ఇ.ప్రసన్నకుమార్, కళాశాల చైర్మన్ గంటా శ్రీరామచంద్రరా వు, ప్రిన్సిపాల్ డాక్టర్ డి.సంజయ్ పాల్గొన్నారు.