జిల్లా సబ్ జూనియర్స్ చెస్ విజేతలు
భీమవరం టౌన్ : జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక విశ్వకవి పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన జిల్లా సబ్ జూనియర్స్ చదరంగం పోటీల్లో 99 మంది క్రీడాకారులు పాల్గొన్నారని అసోసియేషన్ కార్యాదర్వి మాదాసు కిశోర్ గురువారం తెలిపారు. బాలుర విభాగంలో ఎ.అభిలాష్ వర్మ, ఎం.సిద్దేష్ (పాలకొల్లు), బి.ధార్మిక్, సి.ఆదిత్య (ఏలూరు) విజేతులుగా నిలిచారన్నారు. బాలికల విభాగంలో జి.సౌమ్యబాల, జి.కావ్య(కాళ్ల), డి.భవ్యశ్రీ (ఏలూరు), కై.వైష్ణవి(భీమవరం) విజేతలుగా నిలిచారు. వీరు నవంబర్ 4, 5, 6 తేదిల్లో కడపలో జరిగే రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్స్ చదరంగం పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. స్కూల్ అధినేత పొట్లూరి రఘుబాబు, పట్టణ చెస్ అసోసియేషన్ కార్యదర్శి టి.రవి, హెచ్‌ఎం దీక్షిత్ కుమార్ పాల్గొన్నారు.