సోమారామంలో రుద్రహోమం
భీమవరం ప్రకాశం చౌక్: పంచారామక్షేత్రం భీమవరం గునుపూడిలోని ఉమా సోమేశ్వర జనార్దనస్వామి ఆలయంలో బుధవారం రుద్రహోమం నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు తాగు,సాగు నీరందించే పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగంగా పూర్తికావాలని హోమం జరిపించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మునిసిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆలయ ఈవో సతీష్‌కుమార్, అర్చకులు సోంబాబు, మావుళ్లమ్మ ఆలయ చైర్మన్ కార్మూరి సత్యనారాయణమూర్తి, నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, చెరుకువాడ రంగసాయి పాల్గొన్నారు.
లక్షపత్రిపూజ
ఆలయంలో లక్షపత్రి పూజను ఘనంగా నిర్వహించారు. పండితులు గంటల సోమేశ్వరశర్మ ఆధ్వర్యంలో లక్షపత్రి పూజ, కల్యాణం జరిపించారు. స్వామి దర్శనానికి వచ్చిన వెంకటేశ్వర బధిరుల పాఠశాల విద్యార్థులకు అన్నప్రసాదాన్ని అందించారు.